twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇక చచ్చాడు పో అంటూ కామెంట్.. రానా ప్రకటనపై సమంత క్రేజీ రియాక్షన్

    |

    రానా తనకు కాబోయే శ్రీమతి గురించి ప్రకటించిన క్షణం నుంచి సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతూనే ఉన్నాయి. టాలీవుడ్ బాలీవుడ్ సెలెబ్రిటీలందరూ రానాకు, ఆయన ప్రేయసి మిహికా బజాజ్‌కు కంగ్రాట్స్ తెలుపుతున్నారు. రానా అంటే జాతీయ స్థాయి నటుడు కాబట్టి ఆ రేంజ్‌లో సందడి ఉంటోంది. ఇక టాలీవుడ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రానాకు విషెస్ చెప్పిన వారికంటే చెప్పని వారి లిస్ట్ చెబితేనే త్వరగా అయిపోతుందేమో. అంతలా విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఎంతోమంది సెటైర్స్, కౌంటర్స్, ఆశీస్సులు, దీవెనలు అందించారు. వీరిలో నాని, సమంత కామెంట్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. ఇక మంచు లక్ష్మీకి ఈ వ్యవహారం గురించిముందే సమాచారం వచ్చిందన్న సంగతి అర్థమైపోతోంది.

    Recommended Video

    Rana Daggubati Engaged To Miheeka Bajaj| Tollywood Funniest Wishes
     రానా ప్రేయసి గురించి ఆసక్తి..

    రానా ప్రేయసి గురించి ఆసక్తి..

    రానా తన ప్రేయసి పేరు మిహికా బజాజ్ అని ప్రకటించిన క్షణం నుంచి... ఇక ఆమె ఎవరా? అని అంటూ వెదుకులాట ప్రారంభించారు తెలుగు ప్రేక్షకులు. మిహికా.. హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి. కాకపోతే ముంబై కేంద్రంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని నడుపుతున్నారు. డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో అనే కంపెనీకి వ్యవస్థాపకురాలు. ముంబై, హైదరాబాద్‌లో వెడ్డింగ్ ప్లానర్‌గా సెలెబ్రిటీలకు సుపరిచితురాలు.

     కదిలిన టాలీవుడ్..

    కదిలిన టాలీవుడ్..

    ఓ ఇంటి వాడు కాబోతోన్న రానాకు సెలెబ్రిటీలందరూ విషెస్ తెలిపారు. దాని కోసం అందరూ సోషల్ మీడియాను ఆశ్రయించారు. రానాకు కంగ్రాట్స్ చెబుతూ సినీతారలంతా ట్వీట్స్ చేశారు. రామ్ చరణ్, మంచు మనోజ్, రాజమౌళి, హరీష్ శంకర్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, క్రిష్, శోభు యార్లగడ్డ,అనుష్క, చిరంజీవి ఇలా సెలెబ్రిటీలంతా స్పందించారు.

    మంచు లక్ష్మీకి ముందే తెలుసా?

    మంచు లక్ష్మీకి ముందే తెలుసా?

    రానా తన ప్రేయసి గురించి ప్రకటించడం మంచు లక్ష్మీ స్పందిస్తూ.. ‘ఈ ప్రపంచం ఓ విషయం తెలుసుకోవాలని నేనెంత గానో ఎదురుచూస్తున్నా.. ఆ ఆనంద గడియలు వచ్చేశాయ్.. మీ ఇద్దరి పట్ల ఎంతో ఆనందంగా ఉంది.. గత కొన్ని రోజులుగా ఈ విషయాన్ని దాచుకుంటూ ఉన్న ఒత్తిడి మొత్తం వెళ్లిపోయింద'ని చెప్పుకొచ్చింది. ఈ లెక్కన రానా ప్రేయసి గురించి అత్యంత సన్నిహితులకు ముందే తెలుసన్న మాట.

     ఇంకా ఏమేమీ చూడాల్సి వస్తుందో..

    ఇంకా ఏమేమీ చూడాల్సి వస్తుందో..

    రానా ప్రకటనపై నాని స్పందిస్తూ.. ‘ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో 2020 లో'ఓ ఫన్నీ కామెంట్ చేశాడు. అంతేకాకుండా ఈ సందర్భంలో బజాజ్ కంపెనీకి సంబంధించిన పాత ప్రకటనను అంకితం చేస్తున్నట్టు తెలిపాడు. మిహిక బజాజ్‌ను హమారా బజాజ్ హమారా బజాజ్ అంటూ పరోక్షంగా ఆటపట్టించాడు. అనంతరం.. జోక్స్‌ పక్కకు పెడితే సూపర్‌ బాబాయ్‌ అంటూ ట్వీట్‌ చేశాడు. ఇది చూసిన నెటిజన్స్ నాని టైమింగ్‌కు ముగ్దులవుతున్నారు.

    చచ్చాడు అంటూ సమంత కామెంట్..

    చచ్చాడు అంటూ సమంత కామెంట్..

    ప్రేయసి ఓకె చెప్పిందంటూ రానా చేసిన పోస్ట్‌కు సమంత స్పందించింది.. డెడ్, డైడ్ అంటూ కామెంట్ చేసింది. వీటికి రానా రిప్లై ఇస్తూ.. రుత్ అంటూ హార్ట్ సింబల్‌ను షేర్ చేశాడు. హన్సిక, శ్రుతీ హాసన్, సోనమ్ కపూర్, తమన్నా, దుల్కర్ సల్మాన్, కాజల్ వంటి వారు విషెస్ తెలిపారు.

    English summary
    samantha Reaction To Rana Announcing About Miheeka Bajaj. Samantha Reacts That Rana Announcement Is Dead Died. He IS Also Replied That
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X