ఆమెపై విరుచుకుపడ్డ శ్రీరెడ్డి.. ఘాటు రిప్లై, వాళ్ళకి బానిస, షాక్‌కి గురైన హీరోయిన్!
Recommended Video

బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారుతున్నాయి. ఆమె క్షమాపణలు చెప్పినా వివాదం అలాగే కొనసాగుతోంది. కాస్టింగ్ కౌచ్, టాలీవుడ్ లో శ్రీరెడ్డి వ్యవహారం గురించి సరోజ్ ఖాన్ మంగళవారం మీడియాతో తన అభిప్రాయాలు పంచుకుంది. కాస్టింగ్ కౌచ్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు దానిని సమర్థించే విధంగా ఉండడంతో అంతా షాక్ కి గురయ్యారు. దీనితో చిత్ర వర్గాలనుంచి ఆమెకు తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. వెంటనే తేరుకున్నసరోజ్ ఖాన్ క్షమాపణలు తెలిపింది. కానీ ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం మాత్రం ఆగడంలేదు. టాలీవుడ్ సంచలనం శ్రీరెడ్డి సరోజ్ ఖాన్ పై మండిపడింది.

రేప్ చేసి వదిలేదయడం లేదుగా
సరోజ్ ఖాన్ మంగళవారం కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. ఇక్కడ రేప్ చేసి వదిలేదం లేదుగా. అలాగైనా కొందరికి అన్నం దొరుకుతోంది అని సంచలన వ్యాఖ్యలు చేసారు. కాస్టింగ్ కౌచ్ విషయంలో తుది నిర్ణయం అమ్మాయిలదే అని అన్నారు. అవకాశాల కోసం అమ్ముడు పోవలసిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

ప్రలోభాలకు గురి చేయడం వలనే
దీనిపై శ్రీరెడ్డి గతంలోనే స్పందించింది. ఎన్నో ఆశలతో ఇండస్ట్రీకి వస్తున్న అమ్మాయిలని ప్రలోభాలకు గురిచేసి లోబరుచుకుంటున్నారని గతంలో శ్రీరెడ్డి వాదించిన సంగతి తెలిసిందే.

గౌరవం పోయింది
సరోజ్ ఖాన్ జాతీయ అవార్డు గెలుచుకున్న కొరియోగ్రాఫర్. కాస్టింగ్ కౌచ్ విషయంలో ఆమె చెసిన వ్యాఖ్యల తరువాత గౌరవం పోగొట్టుకున్నారని శ్రీరెడ్డి మండిపడింది. సరోజ్ ఖాన్ తన వ్యాఖ్యలు ద్వారా తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఆమె మాటలని బట్టి చూస్తే నిర్మాతలకు అమ్మాయిలు బానిసల్లాగా ఉండాలని అనిపిస్తోందని శ్రీరెడ్డి మండిపడింది.

షాక్‌కి గురైన హిరోయిన్
సరోజ్ ఖాన్ వ్యాఖ్యలతో బాలీవుడ్ హీరోయిన్ సోఫీ చౌదరి షాక్ కి గురైంది. సరోజ్ ఖాన్ పై తనకు గౌరవం ఉందని, కానీ అమ్మాయిలని కించ పరిచేలా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని తాను భావించలేదని నటి సోఫీ చౌదరి సోషల్ మీడియా ద్వారా స్పందించింది. పని కోసం ఏ అమ్మాయి కూడా పడుకోవాలని భావించదని సోఫీ అభిప్రాయపడింది.


Click it and Unblock the Notifications











