కాస్టింగ్ కౌచ్: కొరియోగ్రాఫర్ సంచలన వ్యాఖ్యలు.. రేప్ చేసి వదిలేయడం లేదుగా, అంతలోనే!

శ్రీరెడ్డి వ్యవహారం మరో మారు ఇండియాలో కాస్టింగ్ కౌచ్ పై చర్చ జరిగేలా చేసింది. శ్రీరెడ్డి చేసిన అర్థ నగ్న నిరసనతో టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ వ్యవహారం జాతీయ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. శ్రీరెడ్డి కన్నా ముందు చాలా మంది సెలెబ్రిటీలు కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించారు. అన్ని చిత్ర పరిశ్రమల్లో అమ్మాయిలు వేధింపులకు గురవుతున్నారంటూ గగ్గోలు పెట్టారు. కానీ అప్పుడంత చర్చ జరగలేదు. శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై పోరాటం మొదలు పెట్టిన తరువాత సెలబ్రిటీలకు దీని గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉండగా బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కాస్టింగ్ కౌచ్ గురించి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరోజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారుతుండడంతో వెంటనే మరల క్షమాపణలు తెలియజేశారు.

శ్రీరెడ్డికి సపోర్ట్

శ్రీరెడ్డికి సపోర్ట్

కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి మాట్లాడడం మొదలు పెట్టాక ఆమెకు పెద్ద ఎత్తున మద్దత్తు లభించింది. విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు శ్రీరెడ్డి పోరాటానికి మద్దత్తు తెలిపాయి. ఆమెపై అందరిలో సానుభూతి పెరిగింది.

 అనవసరంగా పవన్ ని లాగి

అనవసరంగా పవన్ ని లాగి

తన పోరాటాన్ని సరైన మార్గంలో నడిపించాల్సిన రెడ్డి ఆర్జీవీ వంటి వికృత చేష్టలకు పాల్పడే దర్శకుడి మాట విని పవన్ కళ్యాణ్ పైనే దూషణలు దిగింది. ఆయన తల్లిని వినకూడని మాటలతో నిందించింది. శ్రీరెడ్డి క్షణికావేశం వలన ఆమె పోరాటం మొత్తం నీరుగారిపోయిందని చెప్పొచ్చు.

సోషల్ మీడియాలో ట్రోలింగ్

సోషల్ మీడియాలో ట్రోలింగ్

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తరువాత టాలీవుడ్ లో పెను దుమారం రేగింది. దర్శకుడు వర్మ కొంత మంది మీడియా అధినేతలు, రాజకీయ నాయకుల కోట్లాదిరూపాయల కుట్రలో పావుగా మారారని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు. ఈ కుట్రపై పవన్ అభిమానులు రగిలిపోతున్నారు. శ్రీరెడ్డికి మద్దత్తు తెలిపిన వారే కొన్ని మీడియా సంస్థలు, వర్మ, శ్రీరెడ్డిని టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు.

 భిన్నాభిప్రాయాలు

భిన్నాభిప్రాయాలు

ఇప్పటికి కొంత మంది మద్దత్తు శ్రీరెడ్డికి ఉన్న ఎక్కువ శాతం మంది మాత్రం ఆమె ఎంచుకున్న మార్గాన్ని తప్పు బడుతున్నారు. సాటి మహిళగా పవన్ కళ్యాణ్ తల్లిని దూషిచడం ఏంటనే విమర్శకు శ్రీరెడ్డిపై ఎక్కువవుతున్నాయి.

 షాకిచ్చిన ఆమె వ్యాఖ్యలు

షాకిచ్చిన ఆమె వ్యాఖ్యలు

జాతీయ అవార్డు విజేత ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కాస్టింగ్ కౌచ్ ని సమర్థించడం, వెంటనే తేరుకుని తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పడం చకచకా జరిగిపోయాయి. ప్రముఖ సెలెబ్రిటీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడంతో అంతా షాక్ కి గురయ్యారు.

 రేప్ చేసి వదిలేయడం లేదుగా

రేప్ చేసి వదిలేయడం లేదుగా

సరోజ్ ఖాన్ నేను మీడియాతో మాట్లాడుతూ ఆమె కాస్టింగ్ కౌచ్ ని సమర్థించడం ఆశ్చర్యంగా మారింది. మీడియా వారంతా సినిమా వాళ్ళ వెంట ఎందుకు పరిగెడుతున్నారు అంటూ ప్రశ్నించారు. రేప్ లు చేసి వారిని ఊరికే వదిలేయడం లేదు కదా అంటూ కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగైనా కొంతమందికి అన్నం దొరుకుతుందని అన్నారు.

అమ్మాయిలే నిర్ణయించుకోవాలి

అమ్మాయిలే నిర్ణయించుకోవాలి

కాస్టింగ్ కౌచ్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవలసింది అమ్మాయిలు మాత్రమే అని సరోజ్ ఖాన్ అన్నారు. అవకాశాల కోసం అమ్ముడు పోవలసిన అవసరం ఏంటని ఆమె ప్రశ్నించారు. మనలో టాలెంట్ ఉంటె ఇలాంటి అడ్డ దారులని ప్రోత్సహించాల్సిన అవసరం ఏంటని సరోజ్ ఖాన్ వ్యాఖ్యానించారు.

ఒక్క సినిమా రంగంలోనేనా

ఒక్క సినిమా రంగంలోనేనా

ఇది కేవలం ఒక్క సినిమా రంగానికి మాత్రమే సంబంధించిన విషయం కాదని, సమాజం మొత్తానికి వర్తిస్తుందని అన్నారు. ప్రభుత్వ సంస్థల్లో, శాఖల్లో మహిళల్ని వేధించిన ఘటనలు జరుగుతున్నాయి కదా అని సరోజ్ ఖాన్ అన్నారు. సరోజ్ ఖాన్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా దుమారం మొదలైంది.ఒక మహిళగా, సెలేబ్రిటిగా ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేసారని ఆమెపై విమర్శలు ఎక్కువవడంతో యూ టర్న్ తీసుకుని క్షమాపణలు కోరారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X