కుక్కతో నా కొడుకు శోభనం ఎలా జరిగింది అంటే.. సీనియర్ నటుడు బ్రహ్మాజీ పంచుల వర్షం
తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ నటుడు బ్రహ్మజీ కుమారుడు సంజయ్ రావు, బాలనటిగా నుంచి హీరోయిన్‌గా మారిన ప్రణవి మానుకొండ జంటగా నటిస్తున్న చిత్రం స్లమ్ డాగ్ హజ్బెండ్. కామెడీ, ఎమోషన్స్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ రిలీజ్ చేయనున్నది. మైక్ మూవీస్ బ్యానర్‌పై డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ (జూలై 21) పోస్టర్‌ను హీరో సత్య దేవ్ విడుదల చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో చిత్ర యూనిట్ మాట్లాడుతూ..
నటుడు సత్యదేవ్ మాట్లాడుతూ.. స్లమ్ డగ్ హజ్బెండ్ కాన్సెప్ట్ నాకు ముందే తెలుసు. జ్యోతిలక్ష్మి సినిమా షూటింగ్ సమయంలోనే కథను శ్రీధర్ వినిపించారు.కానీ ఇంత ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని అనుకోలేదు. సంజయ్ రావు, ప్రణవికు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ట్రైలర్ బాగుంది. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
నటుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ.. నా కొడుకు హీరోగా ఎదిగినందుకు సంతోషంగా ఉంది. కానీ ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. నా కొడుకుకు సపరేట్‌గా నేనేమీ సలహాలు ఇవ్వలేదు. ఈ తరంలో హీరోలు అందరూ సహజంగానే నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ పాత్ర కోసం నన్ను అప్రోచ్ అయ్యారు. తరువాత హీరో కోసం మా అబ్బాయిని తీసుకున్నారు. కథలు ఎంచుకోవడం, సినిమాలు సెలెక్ట్ చేసుకునే విషయంలో నేను నా కొడుక్కి ఎలాంటి సలహాలు ఇవ్వను. నా కొడుకు మొదటి సినిమాకు చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు ముందుకు వచ్చి ప్రమోషన్స్ చేశారు. ప్రతీ సినిమాకు అలా అందరినీ పిలవడం బాగుండదు. మొదటి సినిమాకు అందరూ ఆశీర్వాదం అందించారు. తరువాత అన్నీ సినిమాలు మన కష్టం మీద ఆధారపడి ఉంటుంది.' అన్నారు.
డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. హీరోయిన్ పాత్ర కోసం చాలా మందిని ఆడిషన్స్ చేశాను. పక్కింటి అమ్మాయిలా ప్రణవి బాగా సెట్ అవుతుందని ఆమెను హీరోయిన్‌గా తీసుకున్నాం. ఈ చిత్రంలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ ఉండదు. డాగ్‌కు మెయిల్ వాయిస్ పెట్టాం. కానీ అందులోనూ ఓ ట్విస్ట్ ఉంటుంది. పూరి జగన్నాథ్ సర్ దగ్గర నేను అసిస్టెంట్‌గా పని చేశాను. మనుషులకంటే జంతువులే విధేయంగా ఉంటాయి. ఐశ్వర్య రాయ్ చెట్టుని పెళ్లి చేసుకుంది. ఆ రెండు పాయింట్లను అల్లుకుని ఈ కథను రాసుకున్నాను అని అన్నారు.

నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ.. మొదటి నుంచీ ఈ సినిమాకు ఇదే టైటిల్ అనుకున్నాం. ఈ టైటిల్ చూసే నేను స్క్రిప్ట్ విన్నాను. ఇది చాలా వినోదాత్మకంగా ఉంటుంది. కొత్త పాయింట్, కొత్త కథ. సంజయ్ ఓ డాగ్ లవర్. ఈ సినిమా ఆయనకు రాసిపెట్టి ఉంది అని అన్నారు.
స్లమ్ డాగ్ హస్బెండ్ మూవీలో కీలక పాత్రలో నటించిన వేణుగోపాల్ రావు పొల్సానీ మాట్లాడుతూ.. దర్శకుడు శ్రీధర్‌రెడ్డితో నాకు మంచి అనుబంధం ఉంది. నన్ను గురు గారు అని గౌరవిస్తారు. ఓ రోజు ఫోన్ చేసి క్యారెక్టర్ ఉందని చెప్పారు. వెంటనే నేను చేస్తానని చెప్పాను. నాకు మంచి పాత్ర ఇచ్చారు అని అన్నారు.

స్లమ్ డాగ్ హస్బెండ్ రిలీజ్ డేట్ ప్రకటన తర్వాత మీడియాతో ఉత్సాహంగా చిత్ర యూనిట్ మాట్లాడింది. బ్రహ్మజీ తనదైన శైలిలో మాట్లాడుతూ.. జర్నలిస్టు సురేష్ కొండెటి పంచులు వేశారు. కుక్కుతో పెళ్లి జరిగింది కదా.. శోభనం ఎలా జరిగిందో చెప్పమని అడుగుతాడు అని అన్నాడు. ఇలాంటి వినోదభరిత ప్రశ్నలతో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగింది.


Click it and Unblock the Notifications











