‘‘ అది బ్లండర్‌ మిస్టేక్ .. పూరి జగన్నాథ్‌ని ఎవ్వరూ కాపాడలేరు ’’

గురువు రామ్ గోపాల్ వర్మ టేకింగ్, ఆయన లక్షణాలను యాజ్ టిజ్ దించేశారు పూరి జగన్నాథ్. పూరి మాటలు, చేతలు, రాతలు అన్నీ అచ్చుగుద్ధినట్లుగా ఆర్జీవీ మాదిరిగానే ఉంటాయి. హీరోని, హీరోయిజాన్ని, హీరో బాడీ లాంగ్వేజ్‌ని కొత్తగా చూపించడంలో పూరి జగన్నాథ్ సిద్ధహస్తుడు. నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుందని పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్ ఆయనకు అతికినట్టుగా సరిపోతుంది. పూరి సినిమాల్లో హీరోలు పొరంబోకుల్లా, జులాయిల్లా, ఊరనాటుగా లెక్కలేనితనంతో కనిపిస్తారు.

జగన్నాథ్ చేతుల్లో పడిన ఏ కథానాయకుడైనా సరే కొత్తగా మేకోవర్ అయిపోతుంటారు. సినిమా ఫ్లాప్ అయినా సరే ఆ హీరోకు కొత్త ఇమేజ్ రావడం మాత్రం పక్కా. ఇప్పటికీ పూరీ జగన్నాథ్ సినిమా అంటే అందులో ఏదో ఒక వైవిధ్యం ఉంటుందని ప్రేక్షకులు.. ముఖ్యంగా యువత భావిస్తుంటారు. ఆయన పెన్ పవర్ గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా తక్కువే. బద్రీ నుంచి లేటెస్ట్ డబుల్ ఇస్మార్ట్ వరకు పూరి జగన్నాథ్ రాసిన డైలాగ్స్ బాంబుల్లా పేలాయి.

senior Journalist Imandi Ramarao analysis on puri jagannadh ram pothineni s double ismart

ఒకానొక దశలో తెలుగులో స్టార్ డైరెక్టర్‌గా వెలుగొందిన ఆయన ఇప్పుడు రేసులో లేకుండా పోయారు. రోటీన్ కొట్టుడు తప్పించి ఏమాత్రం కొత్తదనం లేకపోవడంతో పూరి జగన్నాథ్ సినిమాలను ప్రేక్షఖులు తిరస్కరిస్తున్నారు. తాజాగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా ఆయన తెరకెక్కించిన డబుల్ ఇస్మార్ట్ స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. ఇస్మార్ట్ శంకర్‌కు రీమేక్ కావడంతో పాటు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలకపాత్ర పోషించడం, పాటలు, డైలాగ్స్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో డబుల్ ఇస్మార్ట్‌‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కట్ చేస్తే ఫస్ట్ షో నుంచే సినిమాకు డివైడ్ టాక్ మొదలై బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం సందడి లేదు. హార్డ్ కోర్ పూరి ఫ్యాన్స్ సైతం బొమ్మ చూసి బాగా డిజప్పాయింట్ అయ్యారు. పూరి ఔట్ డేటెడ్ అయిపోయారని, ఆయనలో మునుపటి వాడి వేడి తగ్గిందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. హీరోలను మేకోవర్ చేయడంపై పెట్టిన శ్రద్ధ.. స్క్రిప్ట్ పైనా పెట్టాలంటూ కామెంట్ చేస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ కారణంగా రూ.కోట్లలో నష్టం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలే చెబుతున్నాయి. పరిస్ధితులు చూస్తుంటే పూరి కెరీర్‌కి ఎండ్ కార్డ్ పడే సమయం ఆసన్నమైందని ఫిలింనగర్‌లో చర్చించుకుంటున్నారు.

senior Journalist Imandi Ramarao analysis on puri jagannadh ram pothineni s double ismart

ఈ నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు కీలక వ్యాఖ్యలు చేశారు. సీక్వెల్ తీసేంత సీన్ ఇస్మార్ట్ శంకర్‌‌కు లేదని .. అటు తిప్పి ఇటు తిప్పి దానినే పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ అని తీయడం పెద్ద పొరపాటన్నారు. పూరిలో క్రియేటివిటీ పోయిందని.. సినిమాపై కాన్సన్‌ట్రేషన్ తగ్గిందని రామారావు అన్నారు. 10 పర్సెంట్ కథకు 100 పర్సెంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగల రామ్ వంటి నటుడిని పెట్టుకుని కూడా పూరి ఇలా డీల్ చేస్తారని ఊహించలేదన్నారు. ఇకనైనా కథలో వైవిధ్యం ఉండేలా చూసుకోవాలని లేదంటే భారీ స్టార్ క్యాస్టింగ్ ఉన్నా కాపాడలేరని ఇమ్మంది రామారావు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X