ఆకాష్ పూరి పేరిట నకిలీ ఖాతా.. లేడీ ఫ్యాన్స్‌కు వల.. అదుపులో నిందితుడు
సోషల్ మీడియా వాడకం పెరుగుతుండటం మంచినీ, చెడును రెండింటినీ ప్రేరేపిస్తోంది. మంచి ఎంతగా జరుగుతుందని భావిస్తున్నామో..చెడు అంత కంటే ఎక్కువగానే జరుగుతోంది. ఈ సోషల్ మీడియా కాలంలో ఎవరు నిజం, ఎవరు నకిలీ తేల్చుకోవడం కష్టమవుతుంది. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి వాడకం ఎక్కువైన ఈ తరుణంలో వాటికి యువత బానిసగా తయారవుతోంది. ఎన్నో నేరాలకు ఇక్కడే నాంది పడుతోంది. ఫేస్ బుక్ పరిచయాలు, ప్రేమగా మారి, హత్యలకు దారి తీసిన ఘటనలెన్నో చూస్తూనే ఉన్నాము.

సెలెబ్రిటీలకు తప్పని బెడద..
సోషల్ మీడియా వల్ల సామాన్య జనానికి ఏమంత ప్రమాదం లేకపోయినా.. సెలెబ్రిటీలకు మాత్రం వాటి సెగ తగులుతూనే ఉంటుంది. పొగడ్తలైనా, విమర్శలైనా నేరుగా వారిని తాకుతూ ఉంటాయి. ఇంత వరకు పర్లేదు అనుకున్నా.. కొంతమంది మాత్రం హద్దులు మీరుతుంటారు. సెలెబ్రిటీల పేర్లను తగిలించుకుని అధికార ఖాతాలైనట్టుగా వాడేస్తుంటారు.

నమ్మి మోసపోతున్న ఫ్యాన్స్..
పెద్ద హీరో, హీరోయిన్ల ఖాతాలను ఈజీగానే గుర్తుపట్టొచ్చు. వారికి బ్లూ కలర్ టిక్ మార్క్ ఉండటంతో ఎలాంటి సమస్య రాదు. అయితే మీడియం, చిన్న హీరోలు, అప్పుడప్పుడే ఇండస్ట్రీకి వస్తోన్న వారికి వీటితో ఇబ్బంధిని ఎదుర్కొనే అవకాశాలుంటాయి. నకిలీ ఖాతాలే ఒరిజినల్ అని కొందరు అభిమానులు మోసపోతుంటారు.

రమ్య పాండ్యన్..
తాజాగా రమ్య పాండ్యన్ అనే ఓ తమిళ నటి ఇలాంటి ఫేక్ ఖాతాల బారిన పడింది. అయితే తన పేరు మీదున్న ఓ ఖాతాలోంచి ఓ అర్దనగ్న ఫోటోను షేర్ అయింది. అయితే రమ్య పాండ్యన్ అని సోషల్ మీడియా కోడై కూసింది. దీంతో బయటకు వచ్చిన ఆమె.. అది తన ఖాతా కాదనీ, తన ఫోటో కానే కాదని వివరణ ఇచ్చుకుంది.

తాజాగా ఆకాష్ పూరి పేరిట..
తాజాగా ఆకాష్ పూరి పేరిట ఓ నకిలీ ఖాతాను తెరిచాడో యువకుడు. అది తెలియని కొంతమంది లేడీ ఫ్యాన్స్‌ను వలలోకి దింపేందుకు ప్రయత్నం చేశాడు. అయితే ఈ క్రమంలో ఓ బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆకాష్ ప్రస్తుతం రొమాంటక్ చిత్రంతో బిజీగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











