వ్యభిచారం చేస్తున్నా, బావగారు ఏమీ అనుకోవద్దు.. త్రిషని గురించి, రానాపై శ్రీరెడ్డి దారుణమైన వ్యాఖ్యలు
Recommended Video

ఆ మద్యన మీడియాలో హల్ చల్ చేసిన శ్రీరెడ్డి కొంతకాలంగా టివి ఛానల్స్ లో కనిపించడం లేదు. దానికి కారణం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ పై చేసిన దారుణమైన వ్యాఖ్యలతో తీవ్రమైన వివాదం చెలరేగింది. స్వయంగా పవనే రంగంలోకి దిగడంతో పరిస్థితి మారిపోయింది. శ్రీరెడ్డిని హైలైట్ చేస్తున్న కొన్ని మీడియా సంస్థలు కిక్కురుమనకుండా సైలెంట్ అయిపోయాయి. శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పోరాటానికిముందు యూట్యూబ్ లో ఆమె బూతు ఇంటర్వ్యూలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మరో మారు ఆ ప్రక్రియని శ్రీరెడ్డి మొదలు పెట్టింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ప్రోమోలో శ్రీరెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.

డర్టీ పిక్చర్
ఈ ఇంటర్వ్యూ గురించి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపేవిగా ఉన్నాయి. ఇది డర్టీ పిక్చర్ లాంటి ఇంటర్వ్యూ అని శ్రీరెడ్డి తెలిపింది. ఇందులో మా బావ రానా ప్రస్తావన కూడా ఉందని శ్రీరెడ్డి వ్యాఖ్యానించడం హాట్ టాపిక్.

నేను వ్యభిచారమే చేస్తున్నా
ఆ ఇంటర్వ్యూ ప్రోమో సంచలనం రేపే విధంగా ఉంది. తాను ఇండస్ట్రీలో చేస్తున్నది వర్క్ కాదని వ్యభిచారమే చేస్తున్నా అని శ్రీరెడ్డి తెలిపింది. ఓ డిప్యూటీ సీఎం కొడుకు తన మాజీ బాయ్ ఫ్రెండ్ అని శ్రీరెడ్డి తెలిపింది.

రానా గురించి దారుణమైన వ్యాఖ్యలు
శ్రీరెడ్డి ఈ ప్రోమోలు దగ్గుబాటి రానా గురించి అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేసింది. ఓ పార్టీకి త్రిష, రానా ఇద్దరూ వచ్చారని శ్రీరెడ్డి తెలిపింది. త్రిషని చూసిన వెంటనే అంటూ శ్రీరెడ్డి చేసిన బూతు వ్యాఖ్యలు పేర్కొనలేని విధంగా ఉన్నాయి. పైగా బావగారు మీరు ఏమి అనుకోవద్దు అంటూ వ్యాఖ్యనించింది.

పవన్ కళ్యాణ్ గురించి
పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకుండా, ఆయన్ని తిట్టకుండా శ్రీరెడ్డి ఉండలేకపోతున్నట్లు అర్థం అవుతోంది. ఇంటర్వ్యూని హైలైట్ చేసేందుకు కావాలనే పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకుని వస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలో కూడా పవన్ కుటుంబం గురించి శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

శృతి మించుతున్నాయి
శ్రీరెడ్డి చేష్టలు రోజు రోజుకు శృతి మించుతున్నాయనే అభిప్రాయం రోజు రోజుకూ ఎక్కువవుతోంది.


Click it and Unblock the Notifications











