లారెన్స్ ఏమైనా నా బాయ్ ఫ్రెండా, మరో అమ్మాయిని కూడా.. శ్రీరెడ్డి సంచలనం!
Recommended Video

సంచలన నటి శ్రీరెడ్డి తమిళ చిత్ర పరిశ్రమలో అలజడి రేపుతోంది. తమిళ్ లీక్స్ అంటూ తన ఫేస్ బుక్ పేజీలో సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.తాజగా చెన్నై నగరానికే వెళ్లిన శ్రీరెడ్డి అక్కడ యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఓ తమిళ యూట్యూబ్ ఛానల్ లో రాఘవ లారెన్స్ పై శ్రీరెడ్డి విరుచుకుపడింది. కాస్టింగ్ కౌచ్ రూపుమాపేందుకే తన పోరాటం అని శ్రీరెడ్డి తెలిపింది. తనని లారెన్స్ ఎలా వంచించాడో శ్రీరెడ్డి వివరించింది.

అన్నిరంగాల్లో ఉంది
అని రంగాల్లో మహిళలు ఇబ్బందులు, వేధింపులు ఎదుర్కొంటున్నారు. కానీ సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ భయంకరంగా ఉందని శ్రీరెడ్డి తెలిపింది. ఇండస్ట్రీలో ప్రతిరోజు అమ్మాయిలని వేధించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు.

మేకప్ మాన్ కూడా
మేకప్ మాన్ కూడా మహిళా ఆర్టిస్టులతో అసభ్యంగా మాట్లాడుతారు. మేకప్ మాన్ నుంచి ప్రొడ్యూసర్ వరకు ఇదే పరిస్థితి నెలకొని ఉంది. హీరోయిన్లు ఎవరూ దీనిగురించి ఎవరూ మాట్లాడారు. ఎందుకంటే వారికి అవకాశాలు రాకుండా పోతాయనే భయం.

నా పైన నేనే
ఈ పబ్లిసిటీ కొద్దిరోజులు మాత్రమే ఉంటుంది. కానీ జీవితాంతం జనాలు నన్ను చెడుగానే చూస్తారు. ఈ తరం అమ్మాయిల కోసం నాపైన నేనే మచ్చ వేసుకుంటున్నానని శ్రీరెడ్డి తెలిపింది.

నా బాయ్ ఫ్రెండా
తనని వాడుకుని మోసం చేసినందుకే లారెన్స్ ని నిందిస్తున్నానని శ్రీరెడ్డి తెలిపింది. అతడు పిలవగానే హోటల్ రూమ్ కి వెళ్ళడానికి అతడేమైనా నా బాయ్ ఫ్రెండా.. అవకాశం ఇస్తానని నమ్మించడం వలెనే వెళ్ళాను.

మరో అమ్మాయిని కూడా
తనతో పటు లారెన్స్ మరో అమ్మాయిని కూడా మోసం చేశాడని శ్రీరెడ్డి తెలిపింది. ఆమె నా స్నేహితురాలే. ఈ సమస్య ఇంకా పెద్దదైతే ఆమెకూడా బయటకు వస్తుందని శ్రీరెడ్డి తెలిపింది.

పైకి సమాజ సేవ చేస్తూ
సమాజ సేవ పేరుతో లారెన్స్ ముసుగు తొడుక్కుని కనిపిస్తున్నారని శ్రీరెడ్డి ఆరోపించింది. అతడి నిజస్వరూపం ఇదే అని శ్రీరెడ్డి తెలిపింది. వీటన్నింటికి ఆధారాలు అడుగుతున్నారు. పడుకునేటప్పుడు కెమెరాలు పెట్టుకుంటారా అంటూ శ్రీరెడ్డి ఘాటుగా బదులిచ్చింది.


Click it and Unblock the Notifications











