అభిరామ్ సిగ్గున్నదా?
నన్ను వాడుకొన్నది అభిరామ్. నీకు సిగ్గున్నదా అని ప్రశ్నిస్తున్నాడు. స్టూడియోలో చాలా మందిని వాడుకొన్నాడు. మూతీ మూతి నాకుకునే సన్నివేశాన్ని చూడండి. నిర్మాత సురేష్‌బాబు కొడుకును బయటకు లాగండి అని శ్రీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది.
మరికొందరి పేర్లు బయటపెడుతా
ఇంకా చాలా మంది సినీ ప్రముఖులు ఉన్నారు. వారి పేర్లను, ఫొటోలను కూడా బయటపెడుతాను. వారి వల్ల వందల మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి. వారి స్టూడియోల వద్దకు వెళ్లి నిరసన చేయాలి అని శ్రీరెడ్డి వేడుకొన్నారు.
పరిశ్రమకు మాయని మచ్చగా
తెలుగు సినిమా ఇండస్ట్రీకి వీరంతా మాయని మచ్చగా ఉన్నారు. ఎంతమంది అమ్మాయిల జీవితాలు నలిగిపోతున్నాయి. నాకు జరిగిన అన్యాయంపై సురేష్‌బాబు మాట్లాడాలి. నన్ను దారుణంగా వాడుకోని వదిలేశారు అని శ్రీరెడ్డి అన్నారు.
అక్రమాలకు ముగింపు
తెలుగు అమ్మాయిల భవిష్యత్ కోసమైనా ఇలాంటి అక్రమాలకు ముగింపు పలుకాలి. మహిళా సంఘాలు ఈ వ్యవహారంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మరో అమ్మాయికి ఇలాంటి అన్యాయం జరుగకుండా చూడాల్సిన అవసరంఉంది.
జీవితాలను నలిపివేస్తున్నారు..
గత కొద్దిరోజులుగా పలు టీవీ ఛానెళ్లలో జరిగిన చర్చలో పలువురు సినీ ప్రముఖులు తన జీవితాన్ని నలిపివేశారు అని చెప్పుకొన్నది. మంగళవారం కూడా ఓ ఛానెల్‌కు కొన్ని ఫొటోలు అందజేసింది. వాటిని ప్రసారం చేయకపోవడంతో సదరు చానెల్ నుంచి ఆమె బయటకు వచ్చింది.
స్టూడియోల్లో అక్రమాలు
హైదరాబాద్‌లోని చాలా స్టూడియోల్లో అమ్మాయిలను వాడుకొంటున్నారు. వారి స్టూడియోలు ఇలాంటి వాటికి నిలయాలుగా మారుతున్నాయి ఆమె ఆరోపించారు. అందుకే వారు పట్టుబడటం లేదు అని శ్రీరెడ్డి అన్నారు.
వారిని అరెస్ట్ చేయాలి
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌పై శ్రీరెడ్డి మండిపడ్డారు. తన ఆధార్ కార్డు, ఫోన్ నంబర్లను ఎలా బయటపెడుతారు అని ఆమె ప్రశ్నించారు. ఆధార్, ఫోన్ నంబర్లు బయటపెట్టడం వల్ల నా జీవితానికి భద్రత కరువైంది. ఇందుకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి అని శ్రీరెడ్డి డిమాండ్ చేసింది.
అభిరామ్‌పై చర్యలు తీసుకోవాలి
శ్రీరెడ్డికి జరిగిన అన్యాయంపై ప్రభుత్వం, అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. సురేష్‌బాబును ఈ విషయంలో ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అభిరామ్‌పై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త దేవీ డిమాండ్ చేశారు.