నీకు ఏం జరిగిందో నాకు తెలుసు.. ఆ అమ్మాయితో ప్రశాంతంగా.. రానా గారు అంటూ శ్రీ రెడ్డి కామెంట్స్

శ్రీ రెడ్డి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలతోనే సెన్సేషన్ అయింది. క్యాస్టింగ్ కౌచ్, మీటూ ఆరోపణలు చేస్తూ టాలీవుడ్‌ను ఏకి పారేసింది. దగ్గుబాటి సురేష్ తనయుడు, రానా సోదరుడు అభిరామ్‌తో కొనసాగించిన రహస్య బంధం గురించి మీడియా ముఖంగా చెప్పిన సంగతి తెలిసిందే.

Recommended Video

Sri Reddy Post On Rana And Miheeka Bajaj Relation, Different Angle Of Sri Reddy

ఈ మేరకు ఆమె లీక్ చేసిన ఫోటోలు ఏ రేంజ్‌లో వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో అవకాశం లభించిన ప్రతీసారి దగ్గుబాటి ఫ్యామిలీపై ఏదో రకంగా కామెంట్స్ చేస్తూనే వచ్చింది. తాజాగా రానా తన ప్రేయసిని గురించి అందరికీ పరిచయం చేయడంపైనా శ్రీరెడ్డి స్పందించింది.

దగ్గుబాటి ఫ్యామిలీపై కామెంట్స్..

దగ్గుబాటి ఫ్యామిలీపై కామెంట్స్..

సురేష్ బాబును సురేష్ మామా అంటూ తన పోస్ట్‌లో సంభోదిస్తూ కామెంట్స్ చేస్తుంది. ఐటీ రైడ్స్ జరిగిన విషయంలో, నానక్ రామ్ గూడ‌లోని రామా నాయుడు స్టూడియోను పడగొడుతున్న సందర్భంలోనూ శ్రీ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను చేసింది.

తనను నాశనం చేసిన వారు..

తనను నాశనం చేసిన వారు..

తనను మోసం చేసిన వారు, తనకు అన్యాయం చేసిన వారే నాశనం అవుతారని అందుకే వారిపై ఐటీ రైడ్స్ జరగుతున్నాయని చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. రామానాయుడు స్టూడియోలో తన అనుభవాలకు సాక్ష్యంగా ఉన్నవి కూలిపోతున్నాయని, అక్కడే తనకు మొదటి రాత్రి గడిచిందని కామెంట్ చేసింది.

రానా, త్రిషలపై..

రానా, త్రిషలపై..

రానా, త్రిషలు ఒకప్పుడు పీకల్లోతు ప్రేమలో ఉన్నారన్న సంగతి తెలిసిందే. సుచీ లీక్స్‌లో భాగంగా వీరిద్దరి రహస్య బంధం బట్టబయలైంది. రానా, త్రిషలపైనా శ్రీ రెడ్డి నోరు పారేసుకుంది. త్రిషను తన కామెంట్లలో మరింత టార్గెట్ చేసేది. తాజాగా రానా ప్రేయసి ప్రకటనపై శ్రీ రెడ్డి స్పందించిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

రానా ప్రేయసి గురించి ఆసక్తి..

రానా ప్రేయసి గురించి ఆసక్తి..

రానా.. తన ప్రేయసి పేరు మిహికా బజాజ్ అని ఆమె ఓకే చెప్పిందని ప్రకటించింది. ఇక అప్పటి నుంచి ఆమె ఎవరా? అని అంటూ వెదుకులాట ప్రారంభించారు తెలుగు ప్రేక్షకులు. మిహికా.. హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి. కాకపోతే ముంబై కేంద్రంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని నడుపుతున్నారు. డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో అనే కంపెనీకి వ్యవస్థాపకురాలు. ముంబై, హైదరాబాద్‌లో వెడ్డింగ్ ప్లానర్‌గా సెలెబ్రిటీలకు సుపరిచితురాలు.

ఏం జరిగిందో నాకు తెలుసు..

ఏం జరిగిందో నాకు తెలుసు..

శ్రీ రెడ్డి స్పందిస్తూ.. ‘నీ లైఫ్‌లో ఏం జరిగిందో నాకు తెలుసు రానా గారు.. ఈ అమ్మాయితో ప్రశాంతమైన జీవితం కొనసాగించాల'ని పోస్ట్ చేసింది. శ్రీ రెడ్డి ఈ విధంగా ప్రశాంతంగా ఓ పోస్ట్ చేయడం, కాసింత పాజిటివ్‌గా ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X