twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సినిమాలు తప్ప అన్ని అట్టర్ ప్లాప్.. నువ్వు నాచురల్ స్టారా, నానిపై శ్రీరెడ్డి తీవ్రంగా

    |

    న్యాచురల్ స్టార్ నానికి టాలీవుడ్ లో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నాని నటించిన చిత్రాలకు మంచి మార్కెట్ కూడా ఉంది. వరుస విజయాలతో నాని తన పరిధిని తానే పెంచుకుంటూ వచ్చాడు. నాని న్యాచురల్ స్టార్ గా ఎదిగిన వైనం అందరికి తెలిసిందే. మీడియా డిబేట్లతో పబ్లిసిటీ తెచ్చుకున్న శ్రీరెడ్డి టాలీవుడ్ ప్రముఖులపై తీవ్రమైన వ్యాఖ్యలు కొనసాగిస్తోనే ఉంది. టాలీవుడ్ లోని ప్రముఖులనే శ్రీరెడ్డి టార్గెట్ చేసింది. ప్రముఖ నిర్మాతలపై, నటులపై కూడా శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. నానిపై కూడా తరచుగా శ్రీరెడ్డి కామెంట్స్ చేస్తూనే ఉంది. తాజగా నాని పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసేలా ఉన్నాయి.

     సూపర్ హిట్ అనే ట్వీట్

    సూపర్ హిట్ అనే ట్వీట్

    నాని నటించిన కృష్ణార్జున యుద్ధం చిత్రం ఇటీవల విడుదలై నిరాశపరిచింది. నాని వరుస జైత్ర యాత్రకు ఈ చిత్రం బ్రేక్ వేసింది. కృష్ణార్జున యుద్ధం చిత్రంలో నాని డ్యూయెల్ రోల్ లో నటించాడు. యప్ టివి లో ఈ చిత్రం ప్రదర్శన సందర్భంగా ఆ సంస్థ ఓ ట్వీట్ చేసింది. నాని సూపర్ హిట్ చిత్రం కృష్ణార్జున యుద్ధం మిస్ కావొద్దంటూ ట్వీట్ చేసింది.

     నాని స్పందన

    నాని స్పందన

    ఈ ట్వీట్ పై నాని సరదాగా స్పందించాడు. సినిమా సూపర్ హిట్ కాలేదు బాబాయ్ అంటూ తన చిత్రంపై తానే సెటైర్ వేసుకున్నాడు. కనీసం ఆడలేదు కూడా. కానీ మనసుపెట్టి చేసిన చిత్రం అని నాని తెలిపాడు.

     నానిపై తరచుగా

    నానిపై తరచుగా

    సంచలన నటి శ్రీరెడ్డి తరచుగా నానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. కాస్టింగ్ కౌచ్ పై పోరాటం పేరుతో అనేక మంది ప్రముఖులపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వారిలో నాని కూడా ఉన్నాడు.

     అవి తప్ప అన్ని అట్టర్ ప్లాప్

    అవి తప్ప అన్ని అట్టర్ ప్లాప్

    యప్ టివి ట్వీట్ పై నాని స్పందనని ప్రస్తావిస్తూ శ్రీరెడ్డి ట్వీట్ చేసింది. లవ్ స్టోరీలు మినహా మిగిలిన అన్ని చిత్రాలు అట్టర్ ప్లాప్ అని కామెంట్ చేసింది. ప్రేమకథలు మినహా జోనర్ మార్చి సినిమాలు చేయలేని నీవు న్యాచురల్ స్టారా అంటూ శ్రీరెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.

     పవన్ కళ్యాణ్ ని కెలుకుతూనే

    పవన్ కళ్యాణ్ ని కెలుకుతూనే

    తన వివాదాస్పద కామెంట్ల పరంపరలో పవన్ కళ్యాణ్ ని కూడా శ్రీరెడ్డి విడిచిపెట్టడంలేదు. తాజాగా చేసిన ట్వీట్ లో ఆమె వ్యాఖ్యలు పవన్ ఫాన్స్ ని కవ్వించేవిగా ఉన్నాయి. ఆర్జీవీ ఫిలిం అన్ స్కూల్ ప్రారంభోత్సవానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని, ఆయన అభిమానులని ఆహ్వానిస్తున్నానంటూ శ్రీరెడ్డి ట్వీట్ చేసింది. దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు ధీటుగా జవాబిస్తున్నారు.

    English summary
    SriReddy controversial comments on Nani. She made comments on Pawan Kalyan also
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X