రోజాపై రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. ఆమెని ఎవరూ కెలకలేదా, మహేష్ తరువాతి సినిమాలో!
Recommended Video

మీడియా సంచలనం శ్రీరెడ్డి రెండవ దశ సంచల వ్యాఖ్యలు మొదలు పెట్టింది. పవన్ కళ్యాణ్ తల్లిపై దారుణమైన వ్యాఖ్యల తరువాత శ్రీరెడ్డి కొంత సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. మరో మారు టాలీవడో లో ప్రముఖుల్ని టార్గెట్ గా శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. శ్రీరెడ్డి తాజాగా వైసిపి నేత, సినీ నటి రోజాపై సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడింది. మీడియా ముందు రెచ్చిపోయి మాట్లాడే శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా రోజాపై సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్రీరెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.

వ్యతిరేకంగా మాట్లాడిన వారందరిని
కాస్టింగ్ కౌచ్ పేరుతో శ్రీరెడ్డి పోరాటం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. కానీ ఆమె పోరాటం ప్రస్తుతం వ్యక్తులని టార్గెట్ చేస్తూ పక్కదోవ పడుతుందనే విమర్శ బలంగా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అదే జరిగింది. ఇలాంటి విషయాల్లో చట్టబద్దమైన న్యాయపోరాటం చేయాలని పవన్ శ్రీరెడ్డికి సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారందరిని శ్రీరెడ్డి టార్గెట్ చేస్తోందనే విమర్శలు ఎక్కువవుతున్నాయి.

అంత ఆవేశం ఎందుకు
పవన్ కళ్యాణ్ ఇచ్చిన సలహాని సరైన కోణంలో చూడని శ్రీరెడ్డి మీడియా ముందుకు వచ్చి అతి దారుణంగా అతని తల్లిని తీరుతో వికృత చేష్టలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి వైఖరిని, పవన్ కళ్యాణ్ వెనుక జరుగుతున్న కుట్రని ఇండస్ట్రీలో వారంతా ఖండించారు.

ఖండించిన రోజా
గత కొంత కాలంగా మీడియాలో జరుగుతున్న వ్యవహారాలు తాను గమనిస్తూనే ఉన్నానని రోజా ఇటీవల ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు. కొన్ని రోజులు అయ్యాక సైలెంట్ అవుతారని భావించా. కానీ పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టించే విధంగా ప్రోత్సాహించడాన్ని తట్టుకోలేకపోయానని రోజా అన్నారు. ఇండస్ట్రీ మీద కావాలనే బురద చాల్లే ఘటనలు జరుగుతుంటే తాను మాట్లాడానని అన్నారు. తాను ఇండస్ట్రీకి వచ్చి 27 ఏళ్ళు గడిచిందని రోజా అన్నారు.

శ్రీరెడ్డి కౌంటర్
శ్రీరెడ్డి ఎవరి గురించి మాట్లాడినా సంచలనంగా మారుతోంది. ఎందుకంటే ఆమె చేస్తున్న వ్యాఖ్యలు అంత ఘాటుగా ఉంటున్నాయి. రోజా వ్యాఖ్యలకు శ్రీరెడ్డి తాజగా కౌంటర్ ఇచ్చింది. రోజా గారి కవరింగ్ బాగానే ఉంది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదా.. వాయమ్మా అంటూ కామెంట్ పెట్టింది.
ఆమెని ఎవరూ కెలకలేదా
రోజా ఇండస్ట్రీకి వచ్చి 27 ఏళ్ళు అయ్యిందట. అయినా కూడా ఆమెని ఎవరూ ఇంత వరకు కెలకలేదట. మీరు ఎవరికీ నచ్చలేదేమో కొంపదీసి ? అంటూ రోజాపై శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీ మీద బురద వేస్తున్నానా.. మొత్తం ఇండస్ట్రీ రిపోర్ట్ రెడీ అవుతోంది.. నా వద్దమ్మా నీ లొల్లి అంటూ తన ఫేస్ బుక్ పేజీలో శ్రీరెడ్డి కామెంట్స్ పెట్టింది.

మహేష్ సినిమా బాగలేదంటూ
ఇటీవల సోషల్ మీడియాలో శ్రీరెడ్డి మహేష్ భరత్ అనే నేను చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. భరత్ అనే నేను చిత్రం అసలు బాగాలేదని పోస్ట్ లు పెట్టి ఆ తరువాత డిలీట్ చేసింది. తాజగా మళ్ళీ శ్రీరెడ్డి యుటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. మహేష్ బాబుని ప్రశంసలతో ముంచెత్తింది.

ఆయన గ్రేట్ పర్సన్
సమాజానికి మంచి సందేశాలు ఇచ్చే చిత్రాలు చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న మహేష్ బాబు గ్రేట్ పర్సన్ అని శ్రీరెడ్డి ప్రశంసించింది. మహేష్ అభిమానులు కూడా సూపర్ కూల్ అని కామెంట్ పెట్టింది.
మహేష్ తరువాతి చిత్రంలో
మహేష్ బాబు తరువాతి చిత్రంలో అందరూ తెలుగు ఆర్టిస్టులే ఉండాలని కూడా శ్రీరెడ్డి కోరింది. తెలుగు వారికి అవకాశాలు కల్పించాలని శ్రీరెడ్డి కోరుతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











