twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లోకేష్‌కి సపోర్ట్ చేస్తూ పప్పులో కాలేసిన శ్రీరెడ్డి.. నేను రంగంలోకి దిగితే అంటూ పవన్‌కి వార్నింగ్!

    |

    Recommended Video

    Sri Reddy Supports Nara Lokesh

    శ్రీరెడ్డి పోరాటం ఇండస్ట్రీలోని కాస్టింగ్ కోచ్ పైనా లేక పవన్ కళ్యాణ్ పైనా అనే విషయం సగటు ప్రజలకు అర్థం కానీ పరిస్థితి నెలకొని ఉంది. అంతే కాదు ఏపీ మంత్రి నారా లోకేష్ ని ఏమైనా అంటే ఊరుకునేది లేదని కూడా వార్నింగ్ ఇస్తోంది. ఎడతెరిపిలేకుండా పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా శ్రీరెడ్డి కామెంట్లు చేస్తూనే ఉంది. తాజగా పవన్ కళ్యాణ్ తిడుతూ, మంత్రి లోకేష్ ని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అందులో శ్రీరెడ్డి పప్పులో కాలేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

     నారా లోకేష్ ప్రస్తావన

    నారా లోకేష్ ప్రస్తావన

    యూట్యూబ్ లో నారా లోకేష్ గురించి ఉన్న ఓ వీడియో గురించి శ్రీరెడ్డి ప్రస్తావిస్తూ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోను అని ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల కాలంలో నారా లోకేష్ కు మద్దత్తుగా శ్రీరెడ్డి మాట్లాడుతున్న సంగతి తెలిసిందే.

    పప్పులో కాలేసిన శ్రీరెడ్డి

    పప్పులో కాలేసిన శ్రీరెడ్డి

    నారా లోకేష్ గురించి పోస్ట్ పెట్టిన సమయంలో నారా రోహిత్ అంటూ శ్రీరెడ్డి ప్రస్తావించింది. నారా రోహిత్ ని అంటే చూస్తూ ఊరుకోను అంటూ పేర్కొంది.

    నేను రంగంలోకి దిగితే

    నేను రంగంలోకి దిగితే

    తాను రంగంలోకి దిగితే పవన్ ప్రతి ఒక్క మాటకు సమాధానం ఇస్తానని శ్రీరెడ్డి పేర్కొంది. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో పోరాటం చేయకుండా సోది డైలాగులు చెబుతున్నారని పవన్ పై విమర్శలు కురిపించింది.

     ఏ విషయంలో అయినా

    ఏ విషయంలో అయినా

    శ్రీరెడ్డి ప్రతి చిన్న విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ని తిట్టడమే పనిగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఆమె పెడుతున్న పోస్ట్ లు అలాగే ఉన్నాయి.

    English summary
    SriReddy did mistake while supporting Nara Lokesh. SriReddy warns Pawan Kalyan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X