గుడ్డిగా నమ్మా, ఆవేశంలో ఒక మాట అన్నా.. ఇలా చేయమని పవన్ కళ్యాణ్ చెప్పాడా.. శ్రీరెడ్డి!

Recommended Video

Sri Reddy Emotional Appeal To Pawan Fans

పవన్ కళ్యాణ్ తల్లిని దారుణంగా దూషించిన తరువాత శ్రీరెడ్డికి చిక్కులు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో పవన్ ఫాన్స్ ఆమెని ఏకిపారేయడం మొదలు పెట్టారు. శ్రీరెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతుండడంతో ఈ పరిస్థితి ఎక్కువవుతూనే ఉంది. తాజాగా శ్రీరెడ్డి సోషల్ మీడియా ద్వారా పవన్ ఫాన్స్ కు ఎమోషనల్ అప్పీల్ చేసింది. ఓ రకంగా చెప్పాలంటే శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని ఎమోషనల్ గా క్లాస్ పీకడం లాంటిది అని చెప్పొచ్చు.

 మీ తల్లి దండ్రుల గురించి ఆలోచించారా

మీ తల్లి దండ్రుల గురించి ఆలోచించారా

పవన్ కళ్యాణ్ కోసం ఆయన ఫాన్స్ చచ్చిపోతాం అని కామెంట్స్ చేస్తున్నారు. ఆ మాట అనే ముందు మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించారా.. ఎవరి కోసమేమో చావడానికేనా వారు మిమ్మలి కన్నది.. ఇలాంటి కామెంట్స్ ఆపి మీ తల్లిందండ్రుల గురించి ఆలోచించండి అంటూ శ్రీరెడ్డి పవన్ ఫాన్స్ ని కోరింది.

ఇలా చేయమని పవన్ కళ్యాణ్ చెప్పాడా

ఇలా చేయమని పవన్ కళ్యాణ్ చెప్పాడా

ఒక్క నెగిటివ్ పోస్ట్ పెట్టిన తట్టుకోలేని మీరు సమాజానికి మంచి ఎలా చేస్తారు. ఎవరు నెగిటివ్ కామెంట్స్ పెట్టినా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయమని మీ హీరోనే చెప్పాడా అంటూ శ్రీరెడ్డి ప్రశ్నించింది.

 చేతనైతే ఇలా చేయండి

చేతనైతే ఇలా చేయండి

మీకు చేతనైతే సినీ ప్రరిశ్రమలో ఇకపై ఆడపిల్ల బలి కాకుండా ఉండేలా పోరాటం చేయండి అంటూ శ్రీరెడ్డి హితవు పలికింది. మన ఇంటి నుంచి కూడా చిత్ర పరిశ్రమకు ఆడపిల్లలు వెళ్లే అవకాశం ఉందని శ్రీరెడ్డి పేర్కొంది.

ఆవేశంలో ఒక మాట అన్నా

మోసపోయి రోడ్డెక్కా. మీ హీరో సపోర్ట్ చేస్తాడని గుడ్డిగా నమ్మా. కానీ ఆయన చాలా తేలికగా మాట్లాడే సరికి ఆవేశంలో ఒక మాట అన్నా. కానీ మీకందరికీ ఆలోచించే కెపాసిటీ ఉండి కూడా ఏంచేస్తున్నారు.. బూతులు తిడుతూ రెచ్చిపోతున్నారు అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది.

ఏ పార్టీతో నాకు సంబంధం లేదు

ఏ పార్టీతో నాకు సంబంధం లేదు

తనకు ఏ రాజకీయ పార్టీతో కానీ, మీడియాతో కానీ సంబంధాలు లేవని శ్రీరెడ్డి తెలిపింది. తాను కేవలం సమాజం, న్యాయం తరుపున మాత్రమే నిలబడతానని శ్రీరెడ్డి పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X