షాకిచ్చిన శ్రీరెడ్డి, బిగ్‌బాస్ గురించి బ్యాడ్ న్యూస్.. మోహన్ బాబుపై సంచలన వ్యాఖ్యలు!

Recommended Video

Sri Reddy Gives Clarity On Bigg Boss 2

సంచలన నటి శ్రీరెడ్డి ఇటీవల సోషల్ మీడియా వేదికగా స్పదింస్తున్న సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ పోరాటంతో వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలతో మీడియాలో హైలైట్ అయింది. తాజగా మరో మారు శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల శ్రీరెడ్డి గురించి అనేక ఊహాగానాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, దగ్గుబాటి ఫ్యామిలీ, నాని టార్గెట్ గా శ్రీరెడ్డి కామెంట్స్ చేస్తోంది. బిగ్‌బాస్ విషయంలో వస్తున్న ఊహాగానాలపై శ్రీరెడ్డి స్పదించింది.

 బిగ్‌బాస్ 2 లో శ్రీరెడ్డి

బిగ్‌బాస్ 2 లో శ్రీరెడ్డి

తెలుగు బిగ్‌బాస్ 2 కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. ఈసారి బిగ్ బాస్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ఆడియన్స్ కు వినోదాన్ని పంచాలని నిర్వాహకులు భావిస్తున్నారు. కావలసిన మసాలా ఎలిమెంట్స్ ని దట్టించినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ 2 లో శ్రీరెడ్డి కూడా కంటెస్టెంట్ గా ఎంపికైనట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.

నానిపై కామెంట్స్

నానిపై కామెంట్స్

శ్రీరెడ్డి తరచుగా నానిపై కామెంట్స్ చేస్తుండడం, నానికి నాకు పడదు, ఇపుడేం చేద్దాం అంటూ పరోక్షంగా బిగ్‌బాస్ గురించి వ్యాఖ్యలు చేయడంతో ఆ ఊహాగానాలకు బలం చేకూరింది. బిగ్‌బాస్ టీం కూడా కంటెస్టెంట్స్ వివరాలు గోప్యంగా ఉంచింది.

బ్యాడ్ న్యూస్ మై ఫ్రెండ్స్

బిగ్‌బాస్ లో తాను పాల్గొనబోతున్నానంటూ వస్తున్న ఉహాగానాలపై శ్రీరెడ్డి షాకిచ్చింది. బ్యాడ్ న్యూస్ మై ఫ్రెండ్స్.. నేను బిగ్‌బాస్ షోలో పాల్గొనడం లేదు. నా దురదృష్టం. ఈ వార్తతో కొంతమంది సంతోషపడతారు, మరికొంత మంది భాదపడతారని తెలుసు. బిగ్‌బాస్ లో పాల్గొనే వారందరికీ శుభాకాంక్షలు అని శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ప్రకటించింది.

పవన్ కళ్యాణ్ ఫాన్స్ కు గుడ్ న్యూస్

పవన్ కళ్యాణ్ గురించి ఇకపై నెగిటివ్ గా మాట్లాడానని, అయన అభిమానులు ఇక సంతోషంగా ఉండవచ్చని శ్రీరెడ్డి తెలిపింది. నా వైపు నుంచి పాజిటివ్ గా స్పందిస్తున్నాని తెలిపింది. కచాలా రోజులుగా శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇండస్ట్రీకి పెదరాయుడు

ఇండస్ట్రీకి పెదరాయుడు

వైఫ్ ఆఫ్ రామ్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా మోహన్ బాబు స్పీచ్ గురించి శ్రీరెడ్డి ప్రస్తావించింది. ఇండస్ట్రీకి మీరే పెద్ద అయితే బావుంటుందని శ్రీరెడ్డి తెలిపింది. పెదరాయుడు అనే హ్యాష్ టాగ్ పోస్ట్ చేసింది.

 ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు

ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు

ఇటీవల ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు తనని కలచివేశాయని మోహన్ బాబు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అన్నారు. దాసరి నారాయణరావు లాంటి పెద్ద దిక్కు ఈ సమయంలో ఉంటె బావుంటుందని మోహన్ బాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X