శ్రీరెడ్డి కౌంటర్: లీక్స్ బయటపెడతా.. గెట్ రెడీ జీవితారాజశేఖర్, నాగబాబు ఎంత క్రూరుడు!

Recommended Video

Sri Reddy Issue:Sri Reddy Tweets To Jeevitha rajashekar

మెగా బ్రదర్ నాగబాబు కొద్ది సేపటి క్రితం మీడియాతో మాట్లాడారో లేదో అప్పుడే శ్రీరెడ్డి నుంచి కౌంటర్ వచ్చేసింది. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో జరుగుతున్న పరిణామాల గురించి నాగబాబు మీడియాతో మాట్లాడారు. శ్రీరెడ్డి టాపిక్, కాస్టింగ్ కౌచ్ తదితర అంశాల గురించి ఆయన మీడియా సమావేశంలో ప్రస్తావించారు. శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ తల్లిని దూషించిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి కూడా నాగబాబు మీడియాలో రియాక్ట్ అయ్యారు. తన తమ్ముడి సహనాన్ని చేతగాని తనంగా భావించవద్దని హెచ్చరించారు. గత నెలరోజులుగా శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై చేస్తున్న పోరాటంలో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి.

వెనకడుగు వేసే ప్రసక్తే లేదు

నాగబాబు మీడియా సమావేశాల్లో ప్రస్తావించిన విషయాలకు శ్రీరెడ్డి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధం అయిపోయింది. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియాలో కొన్ని సంచలన కామెంట్లు పెట్టింది. ఈ సమయంలో తాను పోరాటం నుంచి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని శ్రీరెడ్డి తేల్చి చెప్పింది.

బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఇవ్వను

బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఇవ్వను

ఇక తాను ఎవ్వరికీ బ్లాక్ మెయిలింగ్ చేసే అవకాశాన్ని ఇవ్వనని, తన జీవితంలో జరిగిన మంచి, చెడు అన్ని విషయాలని బయటకు వెల్లడిస్తానని శ్రీరెడ్డి తెలిపింది. తన స్నేహితుల గురించి కూడా చెబుతానని అంటోంది. ఒక మనిషిగా తాను మంచిపనులు, చెడు పనులు కూడా చేసానని శ్రీరెడ్డి వెల్లడించింది.

పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగానే

తన స్నేహితుల సహకారంతో పోరాటాన్ని కొనసాగించాలనుకుంటున్నానని శ్రీరెడ్డి తెలిపింది. పవన్ కళ్యాణ్ చట్ట పరంగా పోరాటం చేయాలని చెప్పారు. ఒకే సర్ అలాగే చేస్తాను అంటూ కామెంట్ పెట్టింది.

గెట్ రెడీ జీవితరాజశేఖర్

జనసేన పార్టీ శ్రీధర్ గారు తాను సమస్య పరిష్కరానికి పోరాటం చేస్తున్నానని సహకరిస్తానని అన్నారు. ఇప్పుడు సహకరించాలని శ్రీరెడ్డి కోరింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలని సీరియస్ గా తీసుకుంటున్నా. క్షమాపణ కోరి ఆయనతో గొడవ ఇప్పటికే ముగించా. కానీ చట్ట పరంగా మాత్రం తన పోరాటాన్ని కొనసాగిస్తాని, గెట్ రెడీ జీవితరాజశేఖర్.. లీక్స్ బయట పెడతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

నాగబాబు ఎంత క్రూరుడు

నాగబాబు ఎంత క్రూరుడు

ఈ సందర్భంగా శ్రీరెడ్డి నాగబాబుపై విమర్శలతో విరుచుకుపడింది. నాగబాబు మాట్లాడిన మాటలు చాలా క్రూరంగా ఉన్నాయని శ్రీరెడ్డి అన్నారు. మీరు మానవత్వం ఉన్న మనిషి అనుకుంటున్నారా? మీకు జాలి లేదా అంటూ శ్రీరెడ్డి ప్రశ్నించింది. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు తాను సమాధానం ఇస్తానని శ్రీరెడ్డి తెలిపింది.

పడిలేచిన కెరటాన్ని

మంగళవారం మహా న్యూస్ ఛానల్ లో జరిగిన చర్చా కార్యక్రమాన్ని కూడా శ్రీరెడ్డి ప్రస్తావించింది. 25 మంది ఒక వైపు, తాము ముగ్గురం మాత్రమే ఒకవైపు.. మహాన్యూస్ ఛానల్ చాలా బాగా ప్లాన్ చేసారని ఎద్దేవా చేసింది. ముందుగా తెలిసి ఉంటె తాము కనీసం 10 మందితో అయినా వెళ్లేవారం అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. అయినా పరవాలేదు తాను ప్రతి ఒక్కరికి సమాధానంఇస్తా.. పడిలేచిన కెరటాని అంటూ సోషల్ మీడియాలో సంచలన కామెంట్లు పోస్ట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X