చిరంజీవి గారు.. మీ పేరు చెప్పి.. అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తున్నాడు.. శ్రీరెడ్డి

By Rajababu

Recommended Video

Srireddy Leaks : వివాదంలోకి మెగాస్టార్ చిరంజీవికి కూడా లాగే ప్రయత్నం

సినీ తార శ్రీరెడ్డిపై మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) కొంత రాజీపడినా క్యాస్టింగ్ కౌచ్ వివాదం తీవ్రత ఇంకా టాలీవుడ్‌లో తగ్గుముఖం పట్టలేదు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరామ్‌పై బాంబు పేల్చిన శ్రీరెడ్డి.. తాజాగా నిర్మాత వాకాడ అప్పారావుపై సంచలన ఆరోపణలు చేసింది. దీంతో ఈ వివాదంలోకి మెగాస్టార్ చిరంజీవికి కూడా లాగే ప్రయత్నం చేస్తున్నది.

వాకాడపై వర్థమాన తారల ఆరోపణలు

వాకాడపై వర్థమాన తారల ఆరోపణలు

ఏప్రిల్ 12వ తేదీ (గురువారం) రాత్రి మహాటీవీ చర్చా కార్యక్రమంలో శ్రీరెడ్డితో వర్థమాన నటులు శృతి, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. వారంతా నిర్మాత వాకాడ అప్పారావు గురించి సంచలన విషయాలు బయట పెట్టారు. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నిర్మాత వాకాడ అప్పారావు పచ్చి కామాంధుడని, పడుకుంటనే అవకాశాలు ఇస్తానని డైరెక్టుగా మాట్లాడతాడని ఆరోపణలు చేశారు.

 వయసుకు తగ్గ పాత్రలు

వయసుకు తగ్గ పాత్రలు

వాకాడ అప్పారావు‌కు ఫోన్ చేసి చిరంజీవి సినిమాలో అవకాశం ఇప్పించండి సార్ అని అడిగితే.... నీ వయసు ఎక్కువగా ఉంది, ఎవరైనా వయసులో ఉన్న అమ్మాయిని సెట్ చేస్తే మీ వయసుకు తగ్గ క్యారెక్టర్ ఇప్పిస్తాను అన్నాడు... అని మహాటీవీ లైవ్ కార్యక్రమంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీవాణి ఆరోపించడం సంచలనం రేపింది.

 చిరంజీవి గారూ..

చిరంజీవి గారూ..

ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి తన ట్విట్టర్ అకౌంట్‌లో ఘాటుగా స్పందించారు. ‘మెగాస్టార్ చిరంజీవి గారు ఇతను మీ పేరు చెప్పుకుని ఎంతో మంది ఆడవారి జీవితాలను నాశనం చేసాడు, దయచేసి ఇటువంటి వారిని ప్రోత్సహించకండి' అని శ్రీరెడ్డి ట్వీట్ చేసింది.

 శారీరకంగా వాడుకొన్నాడు.

శారీరకంగా వాడుకొన్నాడు.

వందలాది మంది ఔత్సాహిక మహిళా నటులను శారీరకంగా వాడుకొన్నాడు. లైంగికంగా వేధించాడు. 16 ఏళ్ల అమ్మాయిలు కావాలని డిమాండ్ చేస్తాడు అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాకాడ అప్పారావుపై బాంబు పేల్చింది.

శ్రీరెడ్డిపై వర్మ ప్రశంసల జల్లు

శ్రీరెడ్డిపై వర్మ ప్రశంసల జల్లు

మా అసోసియేషన్ మెట్టుదిగి రావడంతో శ్రీరెడ్డిపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. క్యాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి చేస్తున్న పోరాటానికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను. హైదరాబాద్‌కు వచ్చినట్లయితే శ్రీరెడ్డిని కలుస్తాను. ఆమె చేతితో ఆటోగ్రాఫ్ తీసుకొంటాను అని వర్మ లైవ్‌లో వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

 వర్మ ప్రశంసలపై శ్రీరెడ్డి

వర్మ ప్రశంసలపై శ్రీరెడ్డి

రాంగోపాల్ వర్మ ప్రశంసలకు శ్రీరెడ్డి ఆనందంలో మునిగిపోయింది. వర్మ ప్రశంసలు నాకు మరింత ప్రోత్సాహంగా ఉన్నాయి. వర్మ ప్రశంసలు జీవితంలో మరిచిపోలేనటువంటివి అని శ్రీరెడ్డి పేర్కొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X