»   » సీన్ రివర్స్ అయ్యిందట, కెమెరామన్ గంగతో రాంబాబు వీడియో.. పవన్‌ని టార్గెట్ చేస్తున్న శ్రీరెడ్డి!

సీన్ రివర్స్ అయ్యిందట, కెమెరామన్ గంగతో రాంబాబు వీడియో.. పవన్‌ని టార్గెట్ చేస్తున్న శ్రీరెడ్డి!

Subscribe to Filmibeat Telugu

ఇటీవల మీడియా ముందు శ్రీరెడ్డి చెలరేగిపోయేది. శ్రీరెడ్డి ఏం చేసినా సంచలనముగా మారేది. కానీ ఇప్పుడు శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు అంతగా ప్రధాన్యత లభించడంలేదు. దీనికి కారణం కొన్ని మీడియా సంస్థల కుట్రలని పవన్ కళ్యాణ్ బట్టబయలు చేయడమే ఆయన ఫాన్స్ అంటున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు శ్రీరెడ్డి చేస్తున్న సంచలన వ్యాఖ్యలపై ఎడతెరిపి లేకుండా కొన్ని టివి ఛానల్స్ అదేపనిగా డిబేట్లు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రజలకు కూడా విసుగుపుడుతున్న టైంలో పవన్ కళ్యాణ్ టివి9, ఏబీఎన్, టీవీ5 ఛానల్స్ పై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా వాటిని ఏకిపారేశారు. దీనితో పవన్ ఫాన్స్ నుంచి మాత్రమే కాదు.. సగటు ప్రజలనుంచి కూడా పవన్ కు మద్దత్తు లభించింది. తనకు పబ్లిసిటీ విపరీతంగా దక్కుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ తల్లిని తీవ్రంగా దూషించిన శ్రీరెడ్డి చిక్కుల్లో పడింది. అప్పటి నుంచి ఆమె వ్యాఖ్యలకు పెద్దగా ప్రాధాన్యత లభించడంలేదు. తాజగా మరో మారు శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ టార్గెట్ గా సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ లు పెట్టింది.

పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్

పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్

పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి నోరు తెరిస్తే అభిమానుల నుంచి ఏస్థాయిలో మద్దత్తు లభిస్తుందో మరో మారు రుజువైంది. అప్పటి వరకు తన తల్లిపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై డిబేట్లు నడిపిన ఛానల్స్ పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాయి.

శ్రీరెడ్డికి తగ్గిన ప్రాధాన్యత

శ్రీరెడ్డికి తగ్గిన ప్రాధాన్యత

ఆ మధ్యన నెలల పాటు శ్రీరెడ్డి ఏంచేసినా మీడియాలో సెన్సేషన్ గా మారేది. కానీ పవన్ కళ్యాణ్ తల్లిని శ్రీరెడ్డి దూషించిన తరువాత ఆమెకు ప్రాధాన్యత తగ్గింది. శ్రీరెడ్డి మొదలు పెట్టిన కాస్టింగ్ కౌచ్ పోరాట ప్రభావం కూడా తగ్గింది. కానీ టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మాత్రం శ్రీరెడ్డి లేవనెత్తిన కొన్ని అంశాలపై చర్యలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే.

పవన్ అభిమానులపై న్యాయపోరాటం

పవన్ అభిమానులపై న్యాయపోరాటం

పవన్ కళ్యాణ్ అభిమానులు తనని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని శ్రీరెడ్డి వాపోతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సలహా మేరకు తాను న్యాయపోరాటం చేస్తానని, పవన్ కళ్యాణ్ ఫాన్స్ తనని వేధిస్తున్నారని ఇటీవల శ్రీరెడ్డి ప్రకటించింది.

కార్టూన్ తో పవన్ ఫాన్స్‌పై సెటైర్

తాజాగా శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పేజీలో పవన్ కళ్యాణ్ ఫాన్స్‌పై సెటైర్ వేస్తూ ఓ కార్టూన్ పోస్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ ఫాన్స్ ముసుగులో వేదవవేషాలు వేసే వారు ఇబ్బందుల్లో చిక్కుకుంటారని హెచ్చరించింది.

కెమెరామన్ గంగతో రాంబాబు వీడియో

మరో పోస్ట్ లో శ్రీరెడ్డి నేరుగా పవన్ కళ్యాణ్ పై కూడా సెటైర్ వేసింది. కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలోని ఓ సన్నివేశాని పోస్ట్ చేసిన శ్రీరెడ్డి మీడియా పవర్ ఇది, అద్భుతమైన సీన్ అంటూ కామెంట్ పెట్టింది.

సీన్ రివర్స్

సీన్ రివర్స్

ప్రకాష్ రాజ్ కు పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చే సన్నివేశం అది. కానీ నిజజీవితంలో సీన్ రివర్స్ అయ్యిందని శ్రీరెడ్డి పేర్కొంది. ప్రకాష్ రాజ్ సమస్యలపై పోరాడుతున్నారని ఆయనే రియల్ హీరో అంటూ ప్రశంసిస్తూ పరోక్షంగా పవన్ కళ్యాణ్‌పై సెటైర్ వేసింది.

English summary
SriReddy once again targets Pawan Kalyan and his fans. SriReddy posts Cameraman Gangatho Rambabu video
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X