Just In
Don't Miss!
- News
శ్రీలంక తమిళ శరణార్థులను మాటేమిటి? లక్షమందికి పైగా: వారికీ..: శ్రీశ్రీ రవిశంకర్
- Finance
హైదరాబాద్ ప్రయాణీకులకు శుభవార్త: మెట్రోలో G5 సేవలు.. కానీ!
- Sports
ఇంటర్నెట్ మనసు గెలిచిన ఫోటో: గేమ్ మధ్యలో బిడ్డకు పాలిచ్చిన వాలీబాల్ ప్లేయర్
- Technology
చైనా సంస్థలతో జట్టు కట్టేందుకు వ్యూహాలు రచిస్తున్న ఇంటెక్స్
- Lifestyle
వైరల్ వీడియో : నీళ్లలో నిలబడే మనిషిని ఎప్పుడైనా చూశారా?
- Automobiles
2020 స్కోడా ర్యాపిడ్ టీజర్ ఫోటోలు.. అసలైన మోడల్ ఇలా ఉంటుంది
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
పవన్ కళ్యాణ్‌కి మీడియా భయపడుతోంది.. రాంగ్ సిగ్నల్స్.. ప్లీజ్ అంటున్న శ్రీరెడ్డి!
ఆ మధ్యన కొన్ని మీడియా ఛానల్స్ లో తెగ హల్ చల్ చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు సైలెంట్ గా ఉంటోంది. కాస్టింగ్ కౌచ్ పోరాటం పేరుతో శ్రీరెడ్డి మీడియాలో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. కానీ పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలు దిగిన అనంతరం ఆమెపై అందరిలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ ని తిట్టామని చెప్పిన వెంటనే శ్రీరెడ్డి ఎందుకు తిట్టింది. దీనిపై కొన్ని వాస్తవాలు తెలుసుకున్న పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గానే సదరు మీడియా సంస్థలపై విరుచుకుపడ్డారు. అప్పటినుంచి ఆ మీడియా సంస్థలు శ్రీరెడ్డిపై డిబేట్లు పెట్టకుండా గప్ చుప్ అయిపోయాయి.


ప్లీజ్ అంటున్న శ్రీరెడ్డి
ప్లీజ్.. మీడియా సైలెంట్ గా ఉండకూడదు. వాస్తవాలు బయట పెట్టాలి అని శ్రీరెడ్డి సొసైల్ మీడియా వేదికగా వేడుకుంటోంది. పవన్ కళ్యాణ్ కో, ఇంకొకరికో భయపడడం వలన జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని శ్రీరెడ్డి అంటోంది.

సురేష్ మామ అండ్ కో
ఈ సందర్భంగా శ్రీరెడ్డి ప్రముఖ నిర్మాత సురేష్ బాబుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. సురేష్ మామ అండ్ కో చేస్తున్న అన్యాయాల్ని మీడియా ఎండగట్టాలని శ్రీరెడ్డి కోరుతోంది.

చిన్న నిర్మాతలు బావుంటేనే
ఇండస్ట్రీలో చిన్న నిర్మాతలు బావుంటేనే 24 క్రాఫ్ట్స్ లోని వారు, తెలుగు హీరోయిన్లు, నటులు బావుంటారని శ్రీరెడ్డి అభిప్రాయపడింది.

పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్
శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పోరాటం మొదలు మొదలు పెట్టిన సమయంలో కొంత మద్దత్తు లభించింది. కానీ వ్యక్తిగతమైన దూషణలతో ఈ విషయం సేడ్ ట్రాక్ లోకి వెళ్లిపోవడం దాని ద్వారా కొన్ని మీడియా సంస్థలు లబ్ది పొందాలని చూడడంతో పవన్ కళ్యాణ్ సదరు మీడియా సస్థలపై విమర్శల వర్షం కురిపించాడు. ఆ తరువాత ఆయా మీడియా సంస్థలు ఈ విషయాన్ని పక్కన పెట్టేశాయి.