ఎర్రి పుష్పం.. మరో శ్రీరెడ్డి పుడుతుంది, వాళ్లకు డబ్బు ఇస్తోంది సూరి అంకులే.. వల్గర్ కామెంట్స్!

Recommended Video

Sree Reddy Comments On Suresh Babu

కొన్ని రోజుల క్రితం వరకు శ్రీరెడ్డి ఎలాంటి విషయాలు చెబుతుంది, ఏ ఫోటోలు విడుదల చేస్తుంది అని కాచుకు కూర్చున్న కొన్ని మీడియా సంస్థలు ఇప్పుడు సైలెంట్ అయిపోయాయి. సోషల్ మీడియా వేదికగా దగ్గుబాటి అభిరామ్ తో తాను కలసి ఉన్న సంచనల ఫోటోలు విడుదల చేసినా కూడా మీడియాలో ఎలాంటి హడావిడి లేదు. అదే పవన్ కళ్యాణ్ ఓ వర్గం మీడియాపై చిరుచుకు పడనంతవరకు శ్రీరెడ్డి ఇష్యూని ఆయా మీడియా సంస్థలు డిబేట్ లతో హోరెత్తించాయి. శ్రీరెడ్డి నిన్న దగ్గుబాటి అభిరామ్ తో క్లోజ్ గా కలసి ఉన్న ఫోటోలని విడుదల చేసింది. అయినా కూడా శ్రీరెడ్డి వ్యవహారాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. దీనితో తాజాగా సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టింది. తన పోరాటాన్ని అన్ని వైపుల నుంచి అణగదొక్కడానికి సూరి అంకులే ప్రయత్నిస్తున్నారంటూ పరోక్షంగా నిర్మాత సురేష్ బాబు గురించి వ్యాఖ్యలు చేసింది.

ఎర్రి పుష్పం అంటూ

కొందరు ఎర్రిపుష్పాలు యూట్యూబ్ ఛానల్స్ మైంటైన్ చేస్తూ తనపై నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నాయని శ్రీరెడ్డి ఆరోపించింది. సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద వారే ఇలాంటి పనులు చేయిస్తున్నారని శ్రీరెడ్డి అంటోంది.

సూరి అంకుల్ ఇదంతా చేయిస్తున్నాడు

సూరి అంకుల్ ఇదంతా చేయిస్తున్నాడు

ఈ సందర్భంగా శ్రీరెడ్డి ప్రముఖ నిర్మాత సురేష్ బాబుని సూరి అంకుల్ అంటూ పరోక్షంగా ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేసింది. ఆయనే మీడియాని మొత్తం కొనేసి తన పోరాటాన్ని అన్ని వైపుల నుంచి అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నట్లు శ్రీరెడ్డి చెబుతోంది. యూట్యూబ్ ఛానల్స్ కు డబ్బు ఇచ్చి నాపై నెగిటివ్ పబ్లిసిటీ చేయిస్తున్నారని పేర్కొంది.

వల్గర్ కామెంట్స్

వల్గర్ కామెంట్స్

కొందరు ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి డిస్ లైకులు, వల్గర్ కామెంట్స్ చేసేలా చేస్తున్నది కూడా ఇండస్ట్రీలో ఉన్నా పెద్దవారే అనేది శ్రీరెడ్డి ఆరోపణ. చివరకు మా అసోసియేషన్ ని కూడా కంట్రోల్ చేస్తున్నారని, తనకు కార్డ్ ఇవ్వడం లేదని తెలిపింది.

మరో శ్రీరెడ్డి పుడుతుంది

ఇండస్ట్రీ లోని బడా నిర్మాతలని తమ చెప్పు చేతల్లో పెట్టుకుని ఆడిస్తున్నారు. నా తుది శ్వాస వరకు వదిలిపెట్టను. నేను మరణించినా మరో శ్రీరెడ్డి పుడుతుందని వ్యాఖ్యానించింది.

చివరకు పోలీసులు కూడా

చివరకు పోలీసులు కూడా

పోలీసులకు తనపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారం గురించి ఫిర్యాదు చేశాను. వారు కూడా లైట్ తీసుకున్నారని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. తనపై అసభ్యంగా కామెంట్స్ చేస్తున్నారంటూ శ్రీరెడ్డి ఇటీవల కొందరిపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వంపై విమర్శలు

ప్రభుత్వంపై విమర్శలు

శ్రీరెడ్డి ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పిస్తోంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొన్ని హామిలి ఇచ్చారని, ఇంతవరకు వాటి ప్రస్తావనే లేదని శ్రీరెడ్డి విమర్శించింది. ప్రభుత్వం ఇండస్ట్రీ పెద్దలకు కొమ్ము కాయదని ఇప్పటికి భావిస్తున్నట్లు శ్రీరెడ్డి తెలిపింది. కానీ ఆ ఆశ రోజురోజుకూ క్షిణిస్తోందని తెలిపింది.

మహిళా కమిషన్ నుంచి కూడా

మహిళా కమిషన్ నుంచి కూడా

చివరకు మహిళా కమిషన్ కూడా ఈ విషయంలో సైలెంట్ గా ఉంటోందని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసాం వారినుంచి కూడా స్పందన లేదు అని శ్రీరెడ్డి వాపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X