పెద్దల ఆట మొదలైంది.. కొందరి ఆత్మహత్యలకు కారణం వారే.. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

By Rajababu

Recommended Video

Sri Reddy Sensational Comments.. Big People Game Started

సినీ నటి శ్రీరెడ్డి మల్లిడి సంచలన వ్యాఖ్యల జోరు సోషల్ మీడియాలో కొనసాగుతునే ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సభ్యత్వం ఇవ్వనందుకు నిరసన వ్యక్తం చేస్తూ శనివారం (ఏప్రిల్ 7) హైదరాబాద్ ఫిలిం చాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తనకు జరుతున్న అన్యాయంపై ఆమె సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురిపించారు. నిరసన తర్వాత తన పరిస్థితి దారుణంగా తయారైందని, అయినా తన పోరాటాన్ని ఆపబోనని శ్రీరెడ్డి స్పష్టం చేశారు.

ఇంటి యజమాని ఫోన్ చేసి

ఇంటి యజమాని ఫోన్ చేసి

నేను అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని నాకు కాల్ చేశాడు. వెంటనే ఇళ్లు ఖాళీ చేయాలని సూచించాడు. అతడు ఓ ఐఏఎస్ ఆఫీసర్. ఎంతటి కుచ్చిత స్వభావమో మీరే చూడండి. పెద్దలంటే ఇలానే ఉంటారా? కొందరు ఎంత నీచంగా మాట్లాడుతున్నారో మీరు ఊహించుకోలేరు. పెద్దల గేమ్ మొదలైంది అని ఫేస్‌బుక్‌లో శ్రీరెడ్డి పోస్ట్ చేసింది.

యాక్టర్ల ఆత్మహత్యలకు కారణం వారే

యాక్టర్ల ఆత్మహత్యలకు కారణం వారే

సమాజంలోని పెద్దలు మీడియాను మేనేజ్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ వారు నా నిరసనను ఆపడంలో విఫలమయ్యారు. ఇండస్ట్రీలోని కొందరు గొప్ప యాక్టర్లు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. వారి బెదిరింపులకు లొంగిపోను.

నా ఈక కూడా పీకలేరు

నా ఈక కూడా పీకలేరు

మీ దృష్టిలో నేను చిన్నదానిని కావొచ్చు. కానీ నా నిరసన మాత్రం కాదు. ఈక కూడా పీకలేదు అనే మొండి ధైర్యానికి హ్యాట్సాఫ్ అని మరో ట్వీట్‌లో శ్రీరెడ్డి పేర్కొన్నారు.

టాలీవుడ్‌లో చీకటి రోజు

టాలీవుడ్‌లో చీకటి రోజు

తెలుగు హీరోయిన్ల కోసం జల్లికట్టు ఉద్యమం మాదిరిగా నిరసన మొదలుపెట్టాలి. టాలీవుడ్‌‌లో ఇది చీకటి రోజు. నేను నగ్న ప్రదర్శన నిర్వహించడానికి కారణం అయ్యారు. టాలీవుడ్‌లోని దేవతలందరికీ, తెలుగు మహిళలకు సిగ్గు చేటు. నా పోరాటం కొనసాగుతుంది అని శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్టుల వర్షం కురిపించింది.

 పోరాటం మరింత ఉధృతం

పోరాటం మరింత ఉధృతం

నా అర్ధనగ్న ప్రదర్శన తర్వాత చిత్ర సీమలో నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదు. పరిశ్రమకు సముచితమైన సేవ చేశానని అనుకొంటున్నాను. ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాను. సినిమా అవకాశాలు వస్తాయని అనుకోవడం లేదు అని శ్రీరెడ్డి అన్నారు.

యాక్టింగ్ చేయకపోవచ్చు..

యాక్టింగ్ చేయకపోవచ్చు..

నాకు యాక్టింగ్ చేయాలనే ఆశ చచ్చిపోయింది. నా దేహాన్ని కించపరుచవద్దు. ఒకవేళ నాకు అవకాశాలు వస్తే నటిస్తా, లేదంటే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. తెలుగు హీరోయిన్లకు న్యాయం చేసే పోరాటాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లానని అనుకొంటున్నాను.

అదే నా అంతిమ లక్ష్యం

అదే నా అంతిమ లక్ష్యం

నాకు సొంత ఫ్లాట్, అందమైన కారు ఉందని కొందరికి కళ్ల మంటగా ఉంది. నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను. ఏదో ఒకరోజు అది అందరికీ జరిగిదే. ఒకవేళ నాకు ఇల్లు, ఆస్తులు ఉంటే అమ్ముకొని హాయిగా జీవించే దానిని. ఇలా రోడ్డున పడి నిరసన తెలుపాల్సిన అవసరం లేదు. తెలుగు కళాకారుల కోసం పోరాటం చేస్తున్నాను. న్యాయం కోసం పోరాటం చేయడం తప్పు కాదు కదా. తెలుగు అమ్మాయిలను హీరోయిన్లుగా చూడటమే నా కల అని శ్రీరెడ్డి వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X