పవన్ కళ్యాణ్ గారు అతడిని జనసేనలో చేర్చుకోకండి.. నన్ను బిచ్ అని పిలిచాడు, కత్తి నూరుతున్న శ్రీరెడ్డి!
శ్రీరెడ్డికి మీడియాలో పబ్లిసిటీ కరువైనా సోషల్ మీడియా వేదికగా మాత్రం తన సంచలన వ్యాఖ్యల పరంపర కొనసాగిస్తోంది. కాస్టింగ్ కౌచ్ పోరాటంతో దాదాపు రెండు నెలల పాటు శ్రీరెడ్డి మీడియాలో తెగ హంగామా చేసిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి వార్తలనే ప్రధానంగా చూపిస్తూ లబ్ది పొందుతున్న కొన్ని మీడియా సంస్థలపై ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ తల్లిని దూషించడం, ఆ ఘటనపై కొన్ని మీడియా సంస్థలు ఎడతెరిపి లేకుండా డిబేట్లు పెట్టడంతో ప్రజల్లో వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరింది. సరిగ్గా అదే సమయంలో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో పరిస్థితి మారిపోయింది. పవన్ ధాటికి ఆ మీడియా సంస్థలు గగప్ చుప్ అయిపోయాయి. తాజగా శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా హేతువాది బాబు గోగినేనిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

హేతువాది బాబు గోగినేని
హేతువాది బాబు గోగినేని కాస్టింగ్ కౌచ్, శ్రీరెడ్డి వ్యవహారంలో మీడియా చర్చల్లో పాల్గొని తన అభిప్రాయాలు తెలియజేసారు. ఆధారాలు మీడియాకు ఇస్తే ఉపయోగం లేదని న్యాయవ్యవస్థని ఆశ్రయించాలని బాబు గోగినేని శ్రీరెడ్డికి సూచించిన సంగతి తెలిసిందే.

నాకు సమాచారం ఉంది
బాబు గోగినేనిపై శ్రీరెడ్డి మండి పడుతోంది. అతడు జనసేన పార్టీలో చేరబోతున్నట్లు తనకు సమాచారం ఉందని శ్రీరెడ్డి తెలిపింది. అతడు జనసేన పార్టీ నేతలో టచ్ లో ఉంటున్నాడని అందువలనే తనకు వ్యతిరేంగా మాట్లాడుతున్నాడని శ్రీరెడ్డి ఆరోపిస్తోంది.

బిచ్ అని పిలిచాడు
బాబు గోగినేని తనని బిచ్ అని పిలిచాడని శ్రీరెడ్డి సంచలన ఆరోపణ చేసింది. కాస్టింగ్ కౌచ్ పోరాటాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించాడు. నా గురించి చాలా నీచంగా మాట్లాడారు. అతడు మానసిక నిపుణుడిని కలిస్తే మంచిది అంటూ శ్రీరెడ్డి ఎద్దేవా చేసింది.
పవన్ కళ్యాణ్ గారూ..
పవన్ కళ్యాణ్ గారూ.. బాబు గోగినేనిని జనసేన పార్టీలో చేర్చుకోకండి. అతడికి ఎంటువంటి పదవి ఇవ్వకండి అంటూ శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా కోరింది. అతడు సరైన వ్యక్తి కాదు. నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి అంటూ శ్రీరెడ్డి పేర్కొంది.

యూట్యూబ్ ఇంటర్వ్యూలు
శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పోరాటాన్ని బాబు గోగినేని సమర్థించారు. కానీ ఆమె అనుసరిస్తున్న విధానాన్ని మాత్రం ఆయన తప్పు బట్టారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను శ్రీరెడ్డి యూట్యూబ్ ఇంటర్వ్యూలు చూశానని, అవి ఎక్కువగా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయంటూ బాబు గోగినేని వ్యాఖ్యానించారు.

కరువైన పబ్లిసిటీ
పవన్ కళ్యాణ్ సదరు మీడియా ఛానల్స్ పై విరుచుకుపడడంతో శ్రీరెడ్డికి పబ్లిసిటీ కరువైంది. ప్రస్తుతం శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగానే ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తోంది.


Click it and Unblock the Notifications











