శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. వర్మ, తేజ కలసి సెటిల్మెంట్ కు ప్రయత్నించారు, మళ్ళీ హడావిడి!

శ్రీరెడ్డి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి హడావిడి మొదలు పెట్టింది. గత రెండు నెలలుగా శ్రీరెడ్డి వార్తలని అదే పనిగా ప్రసారం చేసిన మీడియా సంస్థలు ప్రజలకు విసుగు తెప్పించాయి. పవన్ కళ్యాణ్ తిరుగుబాటు తరువాత ఆ సంస్థలన్నీ సైలెంట్ అయిపోయిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి కూడా గత కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉంటోంది. కేవలం పబ్లిసిటీకి మాత్రమే ప్రయత్నిస్తోందనే విమర్శలు, దానికి తోడు పవన్ కళ్యాణ్ తల్లిపై దారుణమైన వ్యాఖ్యలు చేయడంతో శ్రీరెడ్డి పై అందరిలో ఉన్న సానుభూతి తొలగిపోయింది. ఆమె పోరాటంలో నిజాయతీ లేదని విమర్శించేవారు ఎక్కువవుతున్నారు. తాజగా మళ్ళీ మీడియా ముందుకు వచ్చిన శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యతో హడావిడి మొదలుపెట్టింది.

 తమన్నాని ఎవరు పంపారో తెలుసు

తమన్నాని ఎవరు పంపారో తెలుసు

తాను చేస్తున్న ఉద్యమం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకునేందుకే తమన్నా అనే ట్రాన్స్ జెండర్ మా మధ్యకు వచ్చిందని శ్రీరెడ్డి తెలిపింది. తమన్నాని ఏ రాజకీయ పార్టీ పంపింది, ఏ వ్యక్తులు పంపారు అనే విషయాలు తనకు తెలుసు అని శ్రీరెడ్డి తెలిపింది. ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడిన శ్రీరెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఆస్తుల గుట్టు విప్పిన శ్రీరెడ్డి

ఆస్తుల గుట్టు విప్పిన శ్రీరెడ్డి

కేవలం రెండు సినిమాలు మాత్రమే చేరిన తాను ఇన్ని ఆస్తులు ఎక్కడివి అనే ప్రశ్నకు శ్రీరెడ్డి స్పందించింది. విజయవాడలో భూముల ధరల పెరిగాక అక్కడ ఉన్న ఆస్తులు అమ్ముకుని హైదరాబాద్ లో స్థిరపడినట్లు శ్రీరెడ్డి వెల్లడించింది.

అంతకు ముందే చర్చలు జరిగాయి

అంతకు ముందే చర్చలు జరిగాయి

తాను ఫిలిం ఛాంబర్ లో అర్థ నగ్న నిరసన చేయడానికి ముందే సురేష్ బాబు కుటుంబం రాజీ ప్రయత్నాలు చేసిందని శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. దర్శకుడు తేజ చేత రెండు సినిమాలు నాకు బిస్కెట్స్ లాగా పడేశారని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది.

 తేజ పేరు బయటకు

తేజ పేరు బయటకు

రాంగోపాల్ వర్మ తో పాటు దర్శకుడు తేజ కూడా సెటిల్మెంట్ చేసే ప్రయత్నం చేసారని శశ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. వాళ్ళు పెద్ద వాళ్ళు.. కోర్టుకు వెళ్లినా ఇదే జరుగుతుంది. ఇంత హడావిడి ఎందుకు డబ్బు తీసుకుని ఇప్పుడే తప్పుకో అని తేజ సెటిల్మెంట్ కు ప్రయత్నించారు అని శ్రీరెడ్డి తెలిపింది. చూద్దాం లెండి సరి అని తాను ఆయనతో అన్నానని తెలిపింది.

 రెండు నెలలుగా

రెండు నెలలుగా

గత రెండు నెలలుగా శ్రీరెడ్డి వ్యవహారం టాలీవుడ్ లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ పేరుతో పోరాటం మొదలు పెట్టిన శ్రీరెడ్డి, పవన్ కళ్యాణ్ ని వ్యతిగతంగా ఆయన తల్లిని దూషించడానికి కారణం ఏంటి ? దీని వెనుక ఎవరు ఉన్నారు అనే విషయాల్ని గమనించిన పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చేసిన కొన్ని మీడియా సంస్థలపై యుద్ధం ప్రకటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X