సీనియర్ నటుడిపై విరుచుకుపడ్డ శ్రీరెడ్డి.. నీ బండారం బయటపెడుతా!
Recommended Video

వివాదాస్పద వ్యాఖ్యలతో తరచుగా శ్రీరెడ్డి హాట్ టాపిక్ గా మారుతోంది. టాలీవుడ్ ప్రముఖులపై శ్రీరెడ్డి విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది. కాస్టింగ్ కౌచ్ పేరుతో మీడియా ఛానల్స్ లో హల్ చల్ చేసిన శ్రీరెడ్డి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వివాదాలు సృష్టిస్తోంది. తాజగా శ్రీరెడ్డి టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. సడెన్ గా రాజేంద్ర ప్రసాద్ పై శ్రీరెడ్డి విమర్శలు మొదలు పెట్టడం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.

మానసిక రోగి
రాజేంద్ర ప్రసాద్ పై శ్రీరెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఆయన ఒక మానసిక రోగి అంటూ అభివర్ణించింది. మీరు త్వరగా ఓ మెంటల్ హాస్పిటల్ లో చేరండి అంటూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. రాజేంద్ర ప్రసాద్ పై శ్రీరెడ్డి విమర్శలు చేయడానికి గల కారణాలు తెలియలేదు.

మీ డిక్షనరీలోనే లేదు
ఆడవాళ్లకు మర్యాద అనే పదమే మీ డిక్షనరీలోనే లేదనే విషయం నాకు తెలుసు. త్వరలోనే మీ బండారం బయటపెడుతా అంటూ శ్రీరెడ్డి రాజేంద్ర ప్రసాద్ కు వార్నింగ్ ఇచ్చింది. ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవాలని శ్రీరెడ్డి ప్రయత్నిస్తోందంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కారణం లేకుండా
రాజేంద్ర ప్రసాద్ పై శ్రీరెడ్డి ఇంత ఘాటు వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు చెప్పలేదు. కానీ సినీవర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. ఇటీవల రాజేంద్ర ప్రసాద్ ఓ సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ తన కుమార్తె ప్రేమ వివాహం గురించి ప్రస్తావించాడు. ఆ వ్యాఖ్యపై శ్రీరెడ్డి కౌంటర్ ఇచ్చి ఉంటుందనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రేమ వివాహం
ఆ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. నా కుమార్తె ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి నా కూతురుతో మాట్లాడడం లేదు. బేవర్స్ చిత్రంలో తల్లి ప్రేమ గురించి వివరించే పాట ఉంది. నా కుమార్తె గాయత్రిని ఇంటికి పిలిచి ఈపాటని వినిపించానని తెలిపారు.


Click it and Unblock the Notifications











