ఆ కుటుంబాలతో పెట్టుకున్నా.. పవన్‌ని తిడుతూ రోజా గురించి, 'ఓరి నాగబాబు' అంటూ శ్రీరెడ్డి సంచలనం!
Recommended Video

శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్, అతడి కుటుంబమే టార్గెట్ గా సోషల్ మీడియాలో వరుస విమర్శలు చేస్తోంది. గతంలో శ్రీరెడ్డిని పిలిచిమరీ డిబేట్లు పెట్టిన కొన్ని ఛానల్స్ ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నా పట్టించుకోకపోవడం గమనార్హం. దీనికి కారణం పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ అని అంతా చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా దిగజార్చడమే లక్ష్యంగా శ్రీరెడ్డి తన విమర్శలు పవన్ పై సంధిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె రోజా ప్రస్తావన కూడా తీసుకుని వచ్చారు.
ఆ రెండు కుటుంబాలతో
తాను ఇండస్ట్రీలోని రెండు కుటుంబాలతో పెట్టుకున్నానని శ్రీరెడ్డి తెలిపింది. దీని వలన తన జీవితాన్ని చిదిమేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారని శ్రీరెడ్డి ఆరోపించింది. ఈ కుట్రలో తాను బలి కాబోతున్నానంటూ శ్రీరెడ్డి సోషల్ మీడియా ద్వారా తెలిపింది. పవన్ కళ్యాణ్, సురేష్ బాబు కుటుంబంతో పెట్టుకున్నందుకే తనపై కుట్ర జరుగుతోందని శ్రీరెడ్డి తెలిపింది.

నా పేవరెట్ స్టార్ ఆయనే
తనకు రీల్ హీరోలు నచ్చరని శ్రీరెడ్డి తెలిపింది. తన అభిమాన స్టార్ నారా చంద్రబాబు నాయుడు అని పచ్చ జెండా వర్ధిల్లాలి అంటూ శ్రీరెడ్డి సోషల్ మీడియాలో సంచలన కామెంట్స్ చేసింది.

పవన్ టార్గెట్ గా
గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ రాజకీయపరమైన విమర్శలు శ్రీరెడ్డి చేస్తోంది. పవన్ కళ్యాణ్ చిన్న పొరపాటు చేసిన తన సోషల్ మీడియా ద్వారా బూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి.

వాళ్ళు కూడా శ్రీరెడ్డి టార్గెట్
ఓ వైపు పవన్ కళ్యాణ్ ని తిడుతూనే అతడికి మద్దత్తుగా నిలిచిన వారిని కూడా శ్రీరెడ్డి టార్గెట్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా, ఆయన తల్లిపై శ్రీరెడ్డి దారుణమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో వ్యక్తి గత వ్యాఖ్యలు తగవని రోజా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే.
ఓరి నాగబాబు అంటూ సంచలనం
జనసేన పార్టీలోకి రోజా జంప్ అవుతున్నారంటూ శ్రీరెడ్డి పేర్కొంది. ఈ వార్త అధికారికంగా ఎక్కడా రాలేదు. కానీ శ్రీరెడ్డి ఊహాజనితంగా ఈ కామెంట్ చేసింది. ఓరి నాగబాబు అంటూ ఇందులో ఆయన ప్రమేయం ఉన్నట్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

మితిమీరుతున్నాయా
మరో వైపు శ్రీరెడ్డి వ్యాఖ్యలు మితిమీరుతున్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ఏం జరిగినా పవన్ కళ్యాణ్ అభిమానులని బూచిగా చూపించే ప్రయత్నం కూడా జరుగుతోందనే వాదన వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











