»   »  మగవాళ్ళతోనే సెక్స్, బండ బూతులతో అలాంటి కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి.. మళ్ళీ మొదలైందిగా!

మగవాళ్ళతోనే సెక్స్, బండ బూతులతో అలాంటి కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి.. మళ్ళీ మొదలైందిగా!

Subscribe to Filmibeat Telugu

గత ఎనిమిది నెలలుగా తెలుగు వారికి విసుగు తెప్పించిన కొన్ని న్యూస్ ఛానల్స్ పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ తో సైలెంట్ అయిపోయాయి. కానీ శ్రీరెడ్డి మాత్రం కాస్టింగ్ కౌచ్ పై పోరాటం పేరుతో దారుణమైన వ్యాఖ్యలు కొనసాగిస్తూనే ఉంది. ఆ మధ్యన శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ తల్లిపై చేసిన నీచమైన కామెంట్స్ అందరిలోనూ తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. అప్పటివరకు కొన్ని మీడియా సంస్థలు కొందరి ద్వారా ఎంతగా కవ్వించినా సైలెంట్ మైంటైన్ చేసిన పవన్ కళ్యాణ్.. తన తల్లిపై చేసిన దారుణమైన కామెంట్స్ తో సహనాన్ని కోల్పోయారు. పవన్ సోషల్ మీడియా వేదికగా సదరు న్యూస్ ఛానల్స్ పై యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో ఆ మీడియా సంస్థలు సైలెంట్ అయిపోయాయి. శ్రీరెడ్డి కూడా కొంతకాలంగా సైలెంట్ గా ఉంటోంది. తాజాగా శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టింది.

 మళ్ళీ మొదలెట్టింది

మళ్ళీ మొదలెట్టింది

పవన్ తల్లిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారడంతో శ్రీరెడ్డి కొంత కాలం మౌనం వహించింది. తిరిగి మళ్ళి మీడియా ముందు హల్ చల్ చేయడం, సోషల్ మీడియాలో దారుణమైన వ్యాఖ్యలు చేయడం ప్రారంభించింది.

బండ బూతులతో

శ్రీరెడ్డి తాజాగా పేస్ బుక్ వేదికగా దారుణమైన వ్యాఖ్యలు చేసింది. బూతులు ఉపయోగిస్తూ కొందరు దర్శకులు మగవాళ్ళతోనే శృంగారం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. అసిస్టెంట్ డైరెక్టర్స్, చిన్ననటులని వదలకుండా దర్శకుడు వేధిస్తున్నారంటూ పోస్ట్ పెట్టింది.

'మా' చర్యలు చేపట్టిన తరువాత కూడా

'మా' చర్యలు చేపట్టిన తరువాత కూడా

శ్రీరెడ్డి పోరాటానికి మహిళా సంఘాలు పెద్ద ఎత్తున సపోర్ట్ చేశాయి. దీనితో మీడియాలో ఇండస్ట్రీ గురించి చెడుగా ప్రచారం మొదలైంది. మా అసోసియేషన్ ఆ దిశగా నివారణ చర్యలు చేపడుతూ నిన్న అధికారిక ప్రతినిధులని నియమించిన సంగతి తెలిసిందే. మా అసోసియేషన్ చర్యలు చేపడుతున్నా శ్రీరెడ్డి సంచలనాలు ఆగడంలేదు.

లైంగిక వేధింపులు జరగకుండా

లైంగిక వేధింపులు జరగకుండా

లైంగిక వేధింపులు జరగకుండా, ఒకవేళ జరిగినా వెంటనే చర్యలు తీసుకోవడానికి మా అసోసియేషన్ ఓ ప్యానల్ ని నియమించబోతున్న సంగతి తెలిసిందే. జూనియర్ అరిటిస్టుల కోసం కూడా కొన్ని పాలసీలు ప్రకటించారు.

చిరంజీవి సలహాలతో

చిరంజీవి సలహాలతో

ఆ మధ్యన మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ప్రముఖులతో రహస్య సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో చిరు చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా మా అసోషషన్ చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం లేదని మా ప్రకటించిన అంశాలు తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం తీసుకున్న నిర్ణయాలు అని చెబుతున్నారు.

English summary
SriReddy latest sensational comments. SriReddy targets some directors in Tollywood
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X