నమ్ముకున్నోడి నోట్లో.. చిరు, పవన్‌పై శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. నాని రాసలీలలు అన్నీ!

Recommended Video

Sri Reddy Comments About Actor Nani's Personal Life

పవన్ కళ్యాణ్ పై విమర్శలు కొనసాగిస్తూనే సినీ ఇండస్ట్రీలో ఉన్న మరి కొందరి ప్రముఖులపై కూడా శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. కాస్టింగ్ కౌచ్ పోరాటం పేరుతో శ్రీరెడ్డి ఫిలిం ఛాంబర్ ముందు అర్థ నగ్న నిరసన చేసిన సంగతి తెలిసిందే. దీనితో టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ గురించి జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. తన పోరాటాన్ని అర్ధవంతమైన మార్గంలో నడిపించకుండా అత్యంత దారుణమైన వ్యక్తిగత విమర్శలకు శ్రీరెడ్డి దిగడంతో ప్రజల్లో ఉన్న సానుభూతిని కోల్పోయి వ్యతిరేకత మూటగట్టుకుంది. ఇప్పటికే అలాంటి వ్యక్తిగత విమర్శలే శ్రీరెడ్డి చేస్తోంది. పవన్, చిరు, నాని, దగ్గుబాటి ఫ్యామిలీ గురించి వరుసగా సోషల్ మీడియాలో పోస్ట్స్ పెడుతోంది.

బూతు పదజాలం

బూతు పదజాలం

తాను పోరాటం చేస్తున్న వీరనారిగా చెప్పుకుంటున్న శ్రీరెడ్డి భూతు పురాణం మాత్రం విడిచిపెట్టడంలేదు. గతంలో ఆమె ఇచ్చిన యూట్యూబ్ ఇంటర్వ్యూలు, ఆ తరువాత జరిగిన టివి చర్చల్లో ఇదే పద్ధతి కొనసాగించింది. తాజాగా ఇస్తున్న యూట్యూబ్ ఇంటర్వ్యూలలో కూడా అదే పద్ధతి కనిపిస్తోంది.

రాజకీయంగా టార్గెట్

రాజకీయంగా టార్గెట్

శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ఆమె వ్యక్తిగత ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పై అర్థం లేని విమర్శలు చేస్తూ రాజకీయంగా దిగజార్చడమే తన ఉద్దేశంగా శ్రీరెడ్డి కామెంట్లు ఉన్నాయి.

నమ్ముకున్నోడి నోట్లో

పవన్ ని విమర్శిస్తూ చిరుపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది. మీ అన్న ఎమ్మెల్యే సీట్లు అమ్ముకున్నాడు. నమ్ముకున్నోడిని నిండా ముంచాడు అంటూ కొన్ని పేర్కొనలేని అసభ్య పదప్రయోగం చేసింది. సినిమాల్లో కోట్లు ఎందుకు వదిలేసావో ఎవరికి తెలియదు అంటూ పవన్ ని ఉద్దేశించి విమర్శించింది.

వాళ్ళని కూడా టార్గెట్ చేస్తూ

వాళ్ళని కూడా టార్గెట్ చేస్తూ

మెగా ఫ్యామిలీతో పాటు దగ్గుబాటి కుటుంబం, నేచురల్ స్టార్ నానిని కూడా శ్రీరెడ్డి లక్ష్యంగా చేసుకుని విమర్శలతో చెలరేగిపోతోంది. తాజాగా శ్రీరెడ్డి నానిపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

నాని రాసలీలలు

నానిని ఉద్దేశించి శ్రీరెడ్డి ఓ ట్వీట్ చేసింది. నాని రాసలీలలు అన్ని బయట పెడతా. కాచుకోరా నాని.. నీ కాపురంలో నిప్పులే అని శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసింది.

బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసిందా

బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసిందా

తరచుగా శ్రీరెడ్డి నానిని ఉద్దేశించి కామెంట్లు పెడుతుండడంతో శ్రీరెడ్డి బిగ్ బాస్ లో ఛాన్స్ దక్కించుకుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ 2 కు నాని హోస్ట్ గా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X