ఖబడ్డార్ అంటూ మళ్ళీ.. సీరియల్ అమ్మాయిలు కూడా.. దర్శకులకు, నిర్మాతలకు శ్రీరెడ్డి వార్నింగ్!

కాస్టింగ్ కౌచ్, తెలుగు అమ్మాయిలకు అవకాశాల అంశాలపై పోరాటం చేస్తున్న శ్రీరెడ్డి తాజగా బుల్లితెరపై దృష్టి పెట్టింది. బుల్లి తీరుపై కూడా తెలుగు వారికె అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. సంచలన వ్యాఖ్యలతో టాలీవడ్ లో శ్రీరెడ్డి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. టాలీవడ్ ప్రముఖులపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. పవన్ కళ్యాణ్ పై ఆమె చేసిన వ్యక్తి గత దూషణలు వివాదానికి తెరతీశాయి. తాజగా శ్రీరెడ్డి బుల్లి తెర దర్శక నిర్మాతలకు ఘాటు వార్నింగ్ ఇచ్చింది.

తెలుగు అమ్మాయిలకు అవకాశాలు

తెలుగు అమ్మాయిలకు అవకాశాలు

తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో ప్రాధాన్యత కల్పించాలని శ్రీరెడ్డి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఉత్తరాది హీరోయిన్లకు నటీ నటులకు ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నారని శ్రీరెడ్డి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

 భిన్నాభిప్రాయాలు

భిన్నాభిప్రాయాలు

తెలుగు చిత్రాల్లో తెలుగు వారికి అవకాశాలు కల్పించాలని తాము ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నామని మా అసోసియేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు ఓ సందర్భంలో ఇది పూర్తిగా దర్శక నిర్మాతల ఛాయిస్ అని అన్నారు. ఎవరు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సినిమాలు నిర్మిస్తున్నారని, నటి నటుల ఎంపిక కూడా వారికి సంబంధించినదని అని అన్నారు.

 సీరియల్ నటి నటులు కూడా

సీరియల్ నటి నటులు కూడా

తనని సీరియల్ నటీనటులు కూడా కలుస్తున్నారని, తెలుగు బుల్లితెరపై తెలుగు అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తున్నారని శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పేర్కొంది.

ఖబడ్డార్ అంటూ వార్నింగ్

ఖబడ్డార్ అంటూ వార్నింగ్

సీరియల్స్ లో కూడా తెలుగు అమ్మాయిలని తీసుకోవాల్సిందే అని శ్రీరెడ్డి డిమాండ్ చేస్తోంది. పంథా మార్చుకోకపోతే బుద్ది వచ్చేట్లు చేస్తాం అంటూ శ్రీరెడ్డి బుల్లితెర దర్శక నిర్మాతలకు వార్నింగ్ ఇచ్చింది.

 ఇతర భాషల్లో

ఇతర భాషల్లో

తనకు విన్నవించుకున్న నటి ఆవేదనని శ్రీరెడ్డి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కన్నడ కన్నడ సీరియల్స్ లో కన్నడ వాళ్లే ఉంటారు. కానీ తెలుగులో అలాంటి పరిస్థితి లేదనేది వారి ఆరోపణ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X