పూరీ జగన్నాథ్ అంటే అసూయ.. నీవు పనికి రావని డైరెక్ట్‌గా చెప్పాడు.. విజయేంద్రప్రసాద్ షాకింగ్ కామెంట్స్
ప్యాన్ ఇండియా రచయితగా విజయేంద్ర ప్రసాద్ అందరికీ సుపరిచితులు. భాషతో సంబంధం లేకుండా కథలు అందించడంలో దిట్ట. ప్రస్తుతం తలైవి, RRR చిత్రాలకు రచయితగా పనిచేశారు. చరిత్ర సృష్టించడానికి ఈ చిత్రాలు రిలీజ్‌కు సిద్దంగా ఉన్న నేపథ్యంలో స్టార్ కమెడియన్, హోస్ట్ ఆలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ పలు విషయాలను పంచుకొన్నాడు. ఆయన చెప్పిన మాటలు ఇవే..

భజరంగీ భాయ్‌జాన్ సినిమాకు స్పూర్తి
భజరంగీ భాయ్‌జాన్ సినిమాకు పసివాడి ప్రాణం సినిమా స్పూర్తి. ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఓ రోజు కీరవాణి తమ్ముడు, మరో డైరెక్టర్, నేను ఆ సినిమాను కలిసి చూశాం. ఆ సమయంలో ఈ కథ బాగుందే నొక్కేద్దామా? అని అన్నాను. అలా బజ్‌రంగీ భాయ్‌జాన్ కథకు ఆ సినిమా స్పూర్తిగా నిలిచింది అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

రాజమౌళి షాకింగ్ కామెంట్స్
నేను ప్యాన్ ఇండియా రైటర్‌గా గుర్తింపు పొందినప్పటికి.. దర్శకుడిగా సక్సెస్ కాలేకపోయాను. రాజన్న సినిమా చూసిన రాజమౌళి.. మీరు తెలుగులో పాపులర్ దర్శకులతో సమానంగా సినిమా తీశారని ప్రశంసించారు. ఆ తర్వాత శ్రీవల్లి సినిమా చూసిన తర్వాత అతనే.. మీకు డైరెక్షన్ రాదండి అని జక్కన చెప్పాడు అంటూ విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.

ఆ విషయం తెలిస్తే అన్నీ హిట్లే..
రైటర్‌గా మంచి పేరు సంపాదించుకొన్నప్పటికీ.. డైరెక్టర్‌గా ఎందుకు రాణించలేకపోయాననే విషయం నాకు తెలియదు. ఒకవేళ అది తెలిస్తే నేను సూపర్ హిట్లు తీసేవాడిని అని విజయేంద్ర ప్రసాద్ చమత్కరించారు. రాజన్న, శ్రీవల్లి, శ్రీకృష్ణ చిత్రాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

పూరీ జగన్నాథ్ అంటే నాకు అసూయ
నాకు తెలుగు సినిమా పరిశ్రమలో రాజమౌళి కాకుండా నాకు బాగా నచ్చేది పూరీ జగన్నాథ్. ఆయన అంటే నాకు చాలా అసూయ. అందుకే నా మొబైల్ ఫోన్ వాల్‌పేపర్‌పై పూరీ ఫోటో పెట్టుకొంటాను. మన శత్రువు ఫోటోను ఎప్పుడూ చూస్తూ ఉండాలంటూ తన ఫోన్‌లోని పూరి వాల్ పేపర్‌ను చూపిస్తూ తన అభిప్రాయాన్ని విజయేంద్ర ప్రసాద్ పంచుకొన్నారు.

యువ రచయితలకు అలాంటి సలహా
తెలుగు సినిమా పరిశ్రమలో అబద్దాలు ఆడేవారికి మంచి భవిష్యత్ ఉంటుంది అంటూ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇండస్ట్రీలో రాణించాలంటే బాగా అబద్దాలు నేర్చుకోవాలి అంటూ యువ రచయితలకు విజయేంద్ర ప్రసాద్ సరదాగా సలహా ఇచ్చారు.

రాజమౌళి గురించి తండ్రిగా
ఒకప్పుడు విజేంద్ర ప్రసాద్ అబ్బాయే రాజమౌళి అంటే అందులో సంతోషం ఉండేది. నా కంటే గొప్పగా నా కొడుకు కావాలని కోరుకొన్నాను. కానీ రాజమౌళి తండ్రే విజయేంద్ర ప్రసాద్ అంటే బాధ ఉంటుంది. అతడి మాదిరిగా నేను ఎలా ఎదుగుతాను అనే ఫీలింగ్ నాకు కలుగుతుంటుంది అని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
Recommended Video

విజయేంద్ర ప్రసాద్ కెరీర్..
విజయేంద్రప్రసాద్ కెరీర్ విషయానికి వస్తే.. జానకీ రాముడు చిత్రానికి కథ అందించడం ద్వారా మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత సమరసింహారెడ్డి, సింహాద్రి, చత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, బాహుబలి చిత్రాలకు కథ అందించారు. హిందీలో భజరంగీ భాయ్‌జాన్, మణికర్ణిక, తమిళంలో తలైవి చిత్రాలకు రచయితగా పనిచేశారు. ఇప్పుడు RRR సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.


Click it and Unblock the Notifications











