పాతికేళ్ల క్రితం నేను తీసిన ఫోటో ఇది.. సూపర్ స్టార్ కృష్ణతో పూరి జ్ఞాపకాలు

తెలుగు చిత్ర సీమను కొత్త పుంతలు తొక్కించిన వారిలో అగ్రగణ్యుడు సూపర్ స్టార్ కృష్ణ. ప్రయోగాలకు మారుపేరుగా నిలుస్తూ ధైర్య సాహాసాలకు నిర్వచనంగా ఎంతో ఎత్తుకు ఎదిగారు. తెలుగు చిత్ర సీమకు టెక్నాలజీని పరిచయం చేసిన సూపర్ స్టార్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మొదటి ఈస్ట్‌మన్, మొదటి70 ఎమ్ఎమ్, మొదటి స్కోప్, మొదటి కౌబాయ్ ఇలా ఎన్నో రకాల విభిన్న చిత్రాలకు నాంది పలికారు. ఈయన చేసినన్నీ సాహాసాలు సినీ చరిత్రలో మరెవరూ చేసి ఉండరు. అందుకు సూపర్ స్టార్ కాగలిగారు. నేడు ఆయన పుట్టిన రోజు. ఈ మేరకు సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తున్నాయి.

మహేష్ స్పెషల్ విషెస్..

మహేష్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణకు ప్రతీసారి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుతాడు. ఘట్టమనేని ఫ్యాన్స్‌కు ఈ పండుగ రోజున కచ్చితంగా ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాడు. అందుకే నేడు సర్కారు వారి వాట టైటిల్‌ను అనౌన్స్ చేశాడు. ఈ మేరకు కృష్ణకు విషెస్ చెబుతూ.. ‘ప్రతీసారి మీలా ఉండటానికి ప్రయత్నిస్తూనే ఉంటాను.. మీకు ఎప్పటికీ రుణపడే ఉంటాను..హ్యాపీ బర్త్ డే నానా.. నా ఎవర్‌గ్రీన్ సూపర్ స్టార్'అంటూ తండ్రితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశాడు.

చిరు విషెస్..

చిరు విషెస్..

మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. ‘కథానాయకుడిగా 345 సినిమాలు దర్శకుడిగా 14 చిత్రాలు.నిర్మాతగా తెలుగుతో పాటు భారతీయభాషల్లో 50 చిత్రాలు.మొదటి సినిమాస్కోప్ సినిమా ఆయనదే.మొదటి 70mm చిత్రం కూడా ఆయనదే. అనితరసాధ్యం ఈ ట్రాక్ రికార్డ్. సాహసానికి మారుపేరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, సూపర్ స్టార్ గారికి జన్మదినశుభాకాంక్షలు'అని ట్వీట్ చేశాడు.

నాగబాబు శుభాకాంక్షలు..

నాగబాబు శుభాకాంక్షలు..


సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా బర్త్ డే కామన్ డీపీని సుధీర్ బాబు రిలీజ్ చేస్తూ ఎంతో గర్వంగా ఉందని ట్వీట్ చేశాడు. మెగా బ్రదర్ నాగబాబు కృష్ణకు విషెస్ చెబుతూ.. తనకిష్టమైన ఫేవరేట్ స్టార్స్‌లో కృష్ణ ఒకరని, మెగాస్టార్ దశ మొదలు కాకముందు ఏఎన్నార్, ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణల యుగం నడిచిందని చెప్పుకొచ్చాడు. ఫస్ట్ డీటీఎస్, 70ఎమ్ఎమ్,కౌబాయ్, స్టీరీయోస్కోప్ ఇలా అన్నింట్లోనూ నాంది పలికాడని చెబుతూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.

Recommended Video

Prabhas20 Title Announcement In August, Fans Frustration Peaks
నాటి ఫోటోను షేర్ చేస్తూ..

నాటి ఫోటోను షేర్ చేస్తూ..

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ బర్త్ డే విషెస్ చెబుతూ.. ‘పాతికేళ్ల క్రితం నేను తీసిన ఫోటో ఇది . ఒకసారి కృష్ణ గారు నన్ను కార్ ఎక్కించుకుని తీసుకెళితే సంగీత్ లో సినిమా కూడా చూసాం . ఆయన సినిమాల కోసం క్యూ లో నిలుచునే వాడిని , ఆ రోజు ఆయన పక్కన కూర్చున్న . మరిచిపోలేను 🙏🏽 కృష్ణగారికి జన్మదిన శుభాకాంక్షలు'అని ట్వీట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X