ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడిని మరచిపోయి.. పూరి జగన్నాథ్ గురించి మహేష్ ట్విట్టర్‌లో!

Recommended Video

#MaharshiTrailer | Mahesh Forgets Important Director; Tweets On It || Filmibeat Telugu

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో బుధవారం రోజు ఘనంగా జరిగింది. వరుస విజయాలతో రాణిస్తున్న వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహేష్ 25వ చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని దిల్ రాజు, అశ్విని దత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విక్టరీ వెంకటేష్, విజయ్ దేవరకొండ, కొరటాల శివ, అనిల్ రావిపూడి లాంటి ప్రముఖుల అతిథులుగా హాజరయ్యారు. ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగడం, మహేష్ ప్రసంగం ఆకట్టుకోవడంతో అభిమానులు ఖుషి అయ్యారు. కానీ ఓ విషయంలో మాత్రం మహేష్ ఫ్యాన్స్ ని నిరాశకు గురిచేశాడు.

అతిథుల సమక్షంలో

అతిథుల సమక్షంలో

చిత్ర యూనిట్ విక్టరీ వెంకటేష్, యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండని స్పెషల్ గెస్ట్ లుగా ఆహ్వానించింది. వెంకీ, మహేష్ కాంబోలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక మహేష్ కు రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన కొరటాల, తదుపరి చిత్రం చేయబోతున్న అనిల్ రావిపూడి కూడా అతిథులుగా హాజరయ్యారు.

 కెరీర్ నిలబెట్టిన దర్శకులు

కెరీర్ నిలబెట్టిన దర్శకులు

ప్రీరిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు తన 25 చిత్రాల జర్నీని ఓసారి గుర్తు చేసుకున్నారు. తనని చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం చేసిన రాఘవేంద్ర రావుగారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని మహేష్ తెలిపాడు. మురారి చిత్రంలో తాను కూడా నటించగలననే ఆత్మవిశ్వాసాన్ని కృష్ణవంశీగారు పెంచారని మహేష్ తెలిపాడు. తనని స్టార్ గా నిలబెట్టిన ఒక్కడు చిత్ర దర్శకుడు గుణశేఖర్ కి కృతజ్ఞతలు తెలిపారు. అతడు చిత్రంతో యూఎస్ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యానని, అందుకు త్రివిక్రమ్ గారికి థాంక్స్ అని మహేష్ తెలిపాడు. దూకుడు చిత్రం తన కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అని శ్రీనువైట్లని గుర్తుచేసుకున్నారు. కొరటాల శివ రెండు సార్లు తనకు విజయాలు అందించారని తెలిపారు.

పోకిరిని మరచిపోయి

పోకిరిని మరచిపోయి

తనకు విజయాలు అందించిన అందరి దర్శకుల గురించి చెప్పిన మహేష్.. పూరి జగన్నాథ్ ని మాత్రం మరచిపోయారు. మహేష్ బాబు కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచిన చిత్రం పోకిరి. మహేష్ కెరీర్ ని చాలా మంది అభిమానులు పోకిరీకి ముందు, ఆ తర్వాత అని అభివర్ణిస్తుంటారు. అలాంటి దర్శకుడి గురించి మహేష్ చెప్పకపోవడంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. 2006లో విడుదలైన పోకిరి చిత్రం మహేష్ కు మాస్ ఆడియన్స్ లో అమాంతం క్రేజ్ ని పెంచేసి సూపర్ స్టార్ ని చేసింది.

ట్విట్టర్ ద్వారా

ప్రీరిలీజ్ ఈవెంట్ లో పూరి పేరు చెప్పడం మరచిన మహేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. నా ప్రసంగంలో ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి ప్రస్తావించడం మరచిపోయా.. నా 25 సినిమాల జర్నీలో పోకిరి చిత్రం నన్ను సూపర్ స్టార్ ని చేసింది. అలాంటి పోకిరి చిత్రాన్ని అందించిన పూరి జగన్నాథ్ గారికి కృతజ్ఞతలు. ఆ చిత్రం నా జీవితంలో ఎప్పటికి మరచిపోలేనిదిగా ఉంటుందని మహేష్ తెలిపాడు.

పూరి జగన్నాథ్ స్పందన

మహేష్ బాబు ట్వీట్ కు పూరి జగన్నాథ్ ప్రతిస్పందించారు. థాంక్యూ సర్.. మీపైన నా ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. మహర్షి ట్రైలర్ అదిరిపోయింది అని పూరిజగన్నాథ్ ట్వీట్ చేశారు. కేవలం పోకిరి చిత్రం మాత్రమే కాదు పూరి, మహేష్ కాంబోలో వచ్చిన రెండవ చిత్రం బిజినెస్‌మేన్ చిత్రం కూడా మంచి విజయంగా నిలిచింది.మహర్షి చిత్రం మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X