పాపం పవన్ కేసు పెట్టమంటే బూతులు తిడతారా.. వాళ్ళ కూతుళ్లు లేరా, పెళ్లిళ్లు కావడం లేదా!

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్, శ్రీరెడ్డి వ్యవహారంలో రోజురోజుకు వివాదం ముదురుతోంది. టాలీవుడ్ ప్రముఖులు ఒక్కొకరుగా బయటకు వచ్చి ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు. శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ పై దూషణలు దిగడం ప్రకంపనలు రేపుతోంది. తాజగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ శ్రీరెడ్డి విషయం గురించి మీడియాతో మాట్లాడారు. ఇలాంటి ప్రచారం ఎక్కువ జరగడం వలన తెలుగు నటులు ఇండస్ట్రీలోకి రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంటుందని అన్నారు. నిజంగా ఇండస్ట్రీలో ఆడవారికి అంత భయంకర పరిస్థితులు ఉంటె పెద్ద సెలెబ్రిటీలు వారి కుమార్తెలని ఎందుకు ఇండస్ట్రీలో ఉంచుతారని తమ్మారెడ్డి ప్రశ్నించారు. శ్రీరెడ్డిపై ఆయన మంది పడ్డారు.

మాధవీలత మొదట చెప్పింది

మాధవీలత మొదట చెప్పింది

హీరోయిన్ మాధవీలత ఈ విషయం గురించి మొదట ఐదునెలల క్రితం కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిందని, ఆ తరువాత కొంత మంది నటులు ఈ సమస్యపై మాట్లాడారని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. అలాంటివి జరుగుతుంటే చర్యలు తీసుకోవాలని తాను కూడా చెప్పానని ఆయన అన్నారు.

టీవీల్లో బూతులు మాట్లాడుతున్నారు

టీవీల్లో బూతులు మాట్లాడుతున్నారు

సమస్య ఉన్నప్పుడు దానిని పరిష్కరించాలి. కానీ భయబ్రాంతులకు గురిచేయడం సరికాదని ఆయన అన్నారు. సినిమాలకు సెన్సార్ ఉంది, కానీ టీవీల్లో బూతులు మాట్లాడుతూంరని ఆయన ఆరోపించారు.

వాళ్ళ కూతుళ్లు ఎందుకు ఉంటారు

వాళ్ళ కూతుళ్లు ఎందుకు ఉంటారు

కొత్త మేరకు సమస్య ఉండవచ్చు. కానీ ఇండస్ట్రీ గురించి తెలియని వారందరికీ ఇలాగే జరుగుతుందేమోనని భయబ్రాంతులకు గురిచేయడం సరికాదని అన్నారు. అలాగే జరుగుతుంటే కృష్ణ, నాగబాబు, మోహన్ బాబు వాళ్ళ కుమార్తెలని ఇండస్ట్రీకి ఎందుకు తీసుకుని వస్తారని ఆయన ప్రశ్నించారు. రాజమౌళి కుటుంబం మొత్తం ఇండస్ట్రీలోనే ఉందని అన్నారు.

అందరికి వర్తిస్తుందా

అందరికి వర్తిస్తుందా

కొన్ని ఘటనలు జరిగినంత మాత్రాన అందరికి వర్తిస్తుందా అని తమ్మారెడ్డి ప్రశ్నించారు. అంత నీచంగా ఉంటె తామంతా ఇండస్ట్రీలో ఉంటామా అని అన్నారు. హీరో హీరోయిన్లే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు కదా అని అన్నారు.

మాట్లాడిన పాపానికి బూతులు తిడతారా

మాట్లాడిన పాపానికి బూతులు తిడతారా

ఏదైనా జరిగితే వెంటనే సాక్ష్యాలు బయటపెట్టాలి.. పోలీస్ కేసు పెట్టాలని తమ్మారెడ్డి అన్నారు. పవన్ కేసు పెట్టమని సలహా ఇచ్చిన పాపానికి ఆయన్ని బూతులు తిడతారా అంటూ శ్రీరెడ్డిపై మండిపడ్డారు.

కాస్టింగ్ కౌచ్ కాదు.. మోసాలు

కాస్టింగ్ కౌచ్ కాదు.. మోసాలు

కాస్టింగ్ కౌచ్ పేరు వాడుతున్నారు. కానీ అదికాదని జరుగుతున్నవి మోసాలు అని అన్నారు. ఊరూ పేరు తెలియని వ్యక్తి ఆడిషన్స్ జరుగుతున్నాయని ప్రకటన ఇస్తే అమాయకంగా మోసపోవద్దని తమ్మారెడ్డి సూచించారు. ఇలాంటి వారివలనే వర్తమాన నటులు మోసపోతున్నాని అన్నారు. అలా మోసాలకు పాల్పడుతున్న వారితో ఇండస్ట్రీకి సంబంధం లేదని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X