పూరి జగన్నాథ్ 20 ఇయర్స్.. ఆ ఇద్దరు హీరోలే మిస్సింగ్
టాలీవుడ్ లో ఎంతమంది దర్శకులు ఉన్నా పూరి జగన్నాథ్ కి ఉన్న క్రేజ్ చాలా డిఫరెంట్ అని చెప్పాలి. హీరోలకు ఒక స్పెషల్ క్యారెక్టర్ ని క్రియేట్ చేసి దానికి స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసిన ఘనత ఆయనది. పూరి సినిమాలో మినిమామ్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనే తరహాలో క్రేజ్ ఏర్పడింది. దాదాపు స్టార్ హీరోలందరితో పూరి వర్క్ చేశాడు. ఒక్క ఇద్దరితో తప్పితే..

బద్రి 20 ఇయర్స్..
2000వ సంవత్సరం ఏప్రిల్ 20న రిలీజైన పూరి జగన్నాథ్ మొదటి సినిమా బద్రి ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమా వచ్చి నేటికి 20 ఏళ్ళు పూర్తయ్యింది. బద్రి పవన్ కళ్యాణ్ క్రేజ్ ని కూడా మరింత పెంచేసింది. ఈ 20 ఏళ్ల ప్రయాణంలో పూరి 35 సినిమాలు డైరెక్ట్ చేశాడు.

ఆ ఇద్దరితో తప్పితే..
పూరి జగన్నాథ్ సినిమాలో నటించడానికి ఎలాంటి హీరోలైనా సరే రెడీ అవుతుంటారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలందరికి బాక్స్ ఆఫీస్ హిట్టిచ్చిన పూరి.. బాలకృష్ణ, ప్రభాస్, ఎన్టీఆర్ లతో వర్క్ చేసి ఓ వర్గం వారిని బాగానే ఎట్రాక్ట్ చేశాడు. ఇక రవితేజ, గోపిచంద్, రామ్ వంటి మీడియం హీరోలతో కూడా వర్క్ చేసిన పూరి ఈ 20 ఏళ్ళల్లో కేవలం విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవిలతోనే వర్క్ చేయలేదు.

చిరంజీవితో జస్ట్ మిస్..
మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని పూరి జగన్నాథ్ చాలా ప్రయత్నాలు చేశారు. అప్పట్లో ఆయన రీ ఎంట్రీ 150వ మూవీకి దాదాపు పూరి జగన్నాథ్ ఫిక్స్ అని అంతా అనుకున్నారు. కానీ రీ ఎంట్రీ సినిమా మంచి సందేశాన్ని ఇచ్చేలా ఉండాలని మెగాస్టార్ నిర్ణయం తీసుకొని పూరి జగన్నాథ్ తో తరువాత చేద్దామని ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకున్నాడు. అలాగే వెంకటేష్ తో కూడా కొన్నిసార్లు స్టోరీ డిస్కర్షన్స్ జరిగినప్పటికీ సినిమా సెట్టవ్వలేదు.
Recommended Video

పాన్ ఇండియా ఫైటర్..
నెక్స్ట్ ఫైటర్ సినిమా ద్వారా పూరి జగన్నాథ్ మరో బాక్సాఫీస్ హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న ఆ సినిమా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో కూడా సినిమాను భారీగా రిలీజ్ చేయాలని కరణ్ జోహార్ తో చేతులు కలిపిన పూరి జగన్నాథ్ ఆడియెన్స్ లో అంచనాల డోస్ పెంచుతున్నాడు. మరి ఆ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











