ఈసారి హిట్ ఖాయమంటున్న డాషింగ్ డైరెక్టర్, విడుదలకు అంతా సిద్దం
తనయుడు ఆకాశ్ పూరి హీరోగా పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'మెహబూబా'. ఇండియా- పాకిస్థాన్ బోర్డర్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రంలో నేహాశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.
పునర్జన్మల చుట్టూ సాగే ఈ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా కు ప్రముఖ సంగీత దర్శకుడు సందీప్ చౌతా సంగీతమందించారు. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై మంచి హోప్స్ ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు ఈ రోజు (గురువారం) పూర్తయ్యాయి.

సెన్సార్ కమిటీ ఈ చిత్రానికి 'యు/ఎ' సర్టిఫికేట్ జారీ చేసింది. పూరి జగన్నాధ్ తీసిన గత రెండు సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు, ఈ సినిమా పూరిని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి. పూరి కూడా ఈ సినిమా తనకు విజయం తెచ్చిపెడుతుందని నమ్మకంగా ఉన్నాడు. ''శత్రువు గేట్ దగ్గరకు వచ్చినంత వరకూ సైనికుడిని ఎవ్వరూ ప్రేమించరు.. మమ్మల్ని (ప్రేమికుల్ని) విడదీస్తే మళ్లీ పుడతాం.. మళ్లీ మళ్లీ పుడతాం'' వంటి లిరిక్స్ ఈ సినిమాలో ఆకట్టుకున్నాయి.


Click it and Unblock the Notifications











