టాలీవుడ్లో మరో విషాదం: ప్రముఖ నటుడు బోస్ కన్నమూత
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తెలుగు నటుడు పి. సుభాష్ చంద్రబోస్ అలియాస్ బోస్ మరణించారు. కొన్ని రోజులుగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం తుది శ్వాస విడిచారు.
కృష్ణానగర్‌లో నివాసం ఉంటున్న బోస్ బాత్రూంలో జారి పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. మొదడులో రక్తం గడ్డకట్టుకుపోవడంతో వారం రోజులుగా చికిత్స పొందుతున్నప్పటికీ అపస్మారక స్థితిలోనే ఉన్నారు. ఆదివారం మధ్నాహ్నం కన్నుమూశారు.

సుమన్ హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో 1990లో వచ్చిన 'సాహసపుత్రుడు' ద్వారా బోస్ తన కెరీర్ ప్రారంభించాడు. డి రామానాయుడు నిర్మించి 'ప్రేమఖైదీ'లో విలన్ పాత్ర పోషించాడు. కృష్ణా నగర్లో ఉన్నప్పటి నుంచే పూరి, కృష్ణ వంశీలతో స్నేహం ఉండటంతో వారు దర్శకులు అయ్యాక బోస్‌కు తమ సినిమాల్లో ఎక్కువగా అవకాశం ఇచ్చారు.
ఈ సినిమాలతో పాటు చిరంజీవి హీరోగా వచ్చిన 'కొదమ సింహం'లో నటించారు. మెగాస్టార్ హిందీలో చేసిన 'ప్రతిబంధ్'లోనూ నటించే అవకాశం దక్కించుకున్నారు. సినిమాలతో పాటు కొన్ని టీవీ సీరియల్స్‌లో కూడా బోస్ నటించారు.


Click it and Unblock the Notifications











