నటి శ్రీరెడ్డి అరెస్ట్.. అర్ధనగ్న నిరసనపై పోలీసుల సీరియస్
అర్ధనగ్న నిరసనతో సంచలనం రేపిన నటి శ్రీరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకుగాను ఆమెను అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తనకు సభ్యత్వం ఇవ్వకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అన్యాయం చేస్తున్నదనే ఆరోపణలతో హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన జరిపడం మీడియాలో సంచలనం రేపింది.
ఫిలిం ఛాంబర్ వద్ద అర్ధనగ్నంగా నిరసన తెలుపుతున్న శ్రీరెడ్డిని అదుపులోకి తీసుకొన్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో శ్రీరెడ్డిపై కేసు నమోదు చేసి ఆ తర్వాత ఆమెను తన నివాసం వద్ద వదలిపెట్టినట్టు తాజా సమాచారం.
ఈ వివాదం నేపథ్యంలో శ్రీరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నాపై మా పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నది. ఒక సినిమాలో నటిస్తే నటీనటులుకు మా సభ్యత్వం కార్డు ఇస్తున్నారు. నేను మూడు చిత్రాల్లో నటించాను. నాకు ఎందుకు కార్డు ఇవ్వరు? వారి తీరును ప్రశ్నించినందుకే కార్డు ఇవ్వడం లేదా? తెలుగు నటీనటులు ఇబ్బందుల్లో ఉంటే మా ఏంచేస్తున్నది అని సినీ ప్రముఖులను ఆమె ప్రశ్నించారు.


Click it and Unblock the Notifications











