సీఎం కేసీఆర్ కోర్టులో టాలీవుడ్ బంతి.. చిరంజీవి, రాజమౌళి రిక్వెస్ట్ ఏంటంటే!
కరోనా వ్యాప్తి నివారణకు అమలుచేస్తున్న లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు చలన చిత్ర పరిశ్రమ సమస్యలను తెలంగాన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ సినీ ప్రముఖులకు హామీ ఇచ్చారు. గురువారం జూబ్లీహిల్స్ లోని ప్రముఖ సినీనటులు, పద్మభూషణ్ చిరంజీవి నివాసంలో చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశం వివరాల్లోకి వెళితే..
Rajamouli: నా ప్రయాణంలో భాగస్వామివి.. దర్శకధీరుడి ఎమోషనల్ కామెంట్

కష్టాల్లో వేతన కార్మికుల జీవితాలు
పలువురు నిర్మాతలు, దర్శకులు మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు నిలిచిపోయి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్న లక్షలాది మంది ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అందరి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొనే షూటింగ్ లను నిలిపివేయడం జరిగిందని అన్నారు. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న పరిశ్రమలోని 14 వేల మందికి కరోనా క్రైసిస్ చారిటీ (CCC) ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. పరిశ్రమలోని అన్ని వర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని సినీమా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ నిర్వహించుకునేందుకు, సినిమా దియేటర్ లను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించాలని కోరారు.

RRR షూటింగ్‌కు అనుమతులివ్వండి
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. RRR మూవీ జాతీయ ప్రాజెక్టుగా రూపొందిస్తున్నాం. ప్రభుత్వం సహకరిస్తే తాము పరిమితమైన యూనిట్‌తో షూట్ చేసుకొంటాం. సోషల్ డిస్టెన్స్, కోవిడ్ 19 వ్యాప్తి నివారణకు సంబంధించిన నిబంధనలను పాటిస్తాం. ఇప్పటికే ఈ ప్రాజెక్టు జాప్యం కావడం వల్ల నిర్మాతపై భారీగా ఒత్తిడి పెరిగింది అని అన్నారు.

ప్రభుత్వంతో చర్చించి
లాక్ డౌన్ సమయంలో షూటింగ్ లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో వివరిస్తూ అవుట్ డోర్, ఇండోర్ షూటింగ్ లకు సంబంధించిన మాక్ వీడియోను ప్రభుత్వానికి సమర్పిస్తామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ కు వివరించారు. పోస్ట్ ప్రొడక్షన్ చేసుకునేందుకు అనుమతించే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. తప్పని సరిగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాస్క్ లను ధరించాలని, శానిటైజేషన్ ఉపయోగించాలని, భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మాక్ షూటింగ్ నిర్వహణకు అవసరమైన సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు. షూటింగ్ ల నిర్వహణకు, థియేటర్లను తెరిచేందుకు ముఖ్యమంత్రి తో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.
Recommended Video

14 వేల మంది కార్మికులకు సాయం
పరిశ్రమలోని 14 వేల మంది కార్మికులకు తన సొంత నిధులతో నిత్యావసర సరుకులను అందజేస్తానని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ సమావేశంలో పద్మభూషణ్ చిరంజీవి, సేనియర్ నటులు అక్కినేని నాగార్జున, నిర్మాతలు అల్లు అరవింద్, C.కళ్యాణ్, దిల్ రాజు, శ్యాం ప్రసాద్ రెడ్డి, జెమిని కిరణ్, దర్శకులు VV,వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, N.శంకర్, FDC మాజీ చైర్మన్ రాం మోహన్ రావు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











