మార్ సాలే కో... పుల్వామా ఉగ్రదాడిపై మహేష్, బన్నీ, నాని, పూరి, టాలీవుడ్ స్టార్స్ స్పందన!
Recommended Video

కాశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై గురువారం జరిగిన ఉగ్రవాదుల దాడిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనలో దాదాపు 44 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిన ప్రతి భారతీయుడు కోపంతో రగలిపోతున్నారు. ఈ రాక్షస ఉగ్రదాడిపై సినీ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా స్పందించారు.
సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్ లక్ష్యంగా జైషే మహ్మద్ గ్రూఫుకు చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ జరుపాల్సిన అవసరం ఉందనే డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది.
అల్లు అర్జున్
పుల్వామాలో జరిగిన దాడి ఘటనలో సిఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన విషయం తెలిసి షాకయ్యాను. ఇది చాలా దుర్దినం. వారి కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తున్నాను. తమ ప్రాణాలు త్యాగం చేసిన ప్రతి జవాను ప్రజల గుండెల్లో నిలిచిపోతాడు.
మహేష్ బాబు
పల్వామా ఉగ్రదాడిపై మహేష్ బాబు స్పందిస్తూ...‘ఈ విషయం తెలిసి చాలా బాధేసింది. చనిపోయిన జవాన్ల కటుంబాలకు మనో ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.
మార్ సాలే కో...(చంపేయండి)
‘మరో సర్జికల్ స్ట్రయిక్ అవసరం ఏర్పడింది. మాస్ సాలేకో (వారిని చంపిపడేయండి)... అని పూరి జగన్నాథ్ ట్వీట్ చేశారు.
మంచు మనోజ్
మన యుద్ధ వీరులకు ఎక్కడా సెక్యూరిటీ లేదు. పుల్వామా దాడి గురించి తెలిసిన వెంటనే చాలా బాధేసింది. ఈ దాడికి కారణమైనా వారికి మరణశిక్ష వేయాలి, చనిపోయిన జనవాన్ల కుటుంబాల్లో ధైర్యం నింపాలి.
సూర్య
పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ మీద జరిగిన దాడి విషయం తెలియగానే బాధతో నా హృదయం ముక్కలైంది. ఈ ఘటనలో తమ కొడుకులు, సోదరులు, తండ్రులు, భర్తలను కోల్పోయిన వారికి నా సంతాపం తెలియజేస్తున్నాను.
సల్మాన్ ఖాన్
మన దేశాన్ని, మన కుటుంబాలను కాపాడటానికి వారి ప్రాణాలు త్యాగం చేశారు. ఈ సంఘటన గురించి తెలియగానే బాధేసింది.
వరుణ్ తేజ్
పుల్వామా దాడిలో తమ సన్నిహితులను కోల్పోయిన వారికి నా సంతాపం తెలియజేస్తున్నాను. జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలి.
ప్రియాంక చోప్రా
పుల్వామా దాడి ఘటన గురించి తెలిసి షాకయ్యాను. ద్వేషం అనేది ఎప్పటికీ సమాధానం కాదు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జనాన్ల కుటుంబాలకు దేవుడు మనోదైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.
నాని
సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి జరిగిన విషయం తెలిసి షాకయ్యాను. ప్రేమ వికసించే రోజున మన హీరోలను కోల్పోయాం. వారి కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తున్నాను.
అభిషేక్ బచ్చన్
ప్రేమికుల రోజును అందరూ సెలబ్రేట్ చేసుకుంటుంటే పుల్వామా నుంచి దారుణమైన వార్త విన్నాను. ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తున్నాను.
కొరటాల శివ
పుల్వామా ఎటాక్ బాధాకరం. మరణించిన జనవాన్ల కుటుంబాలకు ఆదేవుడు మనో దైర్యాన్ని ఇవ్వాలి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అందరూ కలిసి కట్టుగా పోరాటం చేయాలి.


Click it and Unblock the Notifications











