ట్రెండింగ్: హీరోయిన్ రహస్య నిశ్చితార్థం, ప్రభాస్ పాలిటిక్స్, యాంకర్ సుమ రికార్డ్
హీరోయిన్ అనీషా ఆంబ్రోస్ పెళ్లికి సిద్ధమైంది, రహస్యంగా నిశ్చితార్థం జరుపుకుంది. అఖిల్ 'మజ్ను' మూవీతో ఈ వారం సందడి చేశాడు కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. యాంకర్ సుమ తన టీవీ షోలతో మరో రికార్డు క్రియేట్ చేసింది. లైంగిక వేధింపుల అంశంపై మరోసారి హీరోయిన్ కంగనా రనౌత్ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ గురించి రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇలా పలు అంశాలు ఈ వారం ట్రెండ్ అయ్యాయి. మీరు ఏమైనా మిస్ అయి ఉంటే ఓ లుక్కేయండి.

పెళ్లి పీటలెక్కుతున్న టాలీవుడ్ హీరోయిన్.. గుట్టుచప్పుడు కాకుండా నిశ్చితార్థం!
టాలీవుడ్ హీరోయిన్ అనిషా అంబ్రోస్ త్వరలోనే పెళ్లికూతురు కాబోతున్నది. గత కొద్దికాలంగా తెలుగు సినిమాకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ పెళ్లీ పీటలు ఎక్కడానికి సిద్ధమైంది. కొద్ది రోజుల క్రితం మీడియాకు దూరంగా, గుట్టుచప్పుడు కాకుండా అనిషా వివాహ నిశ్చితార్థం జరిగింది.

ఆ రెండు నాకు గుణపాఠం.. అమ్మ కాదు.. నాన్న పాత్రనే .. అఖిల్
అక్కినేని నట వారసుడు అఖిల్ ఇటీవల ‘మిస్టర్ మజ్ను' సినిమా ప్రమోషన్‌లో భాగంగా తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు. తన కెరీర్, వ్యక్తిగత అనుభవాల గురించి పలు విషయాలు పంచుకొన్నాడు.

యాంకర్ సుమ కుమ్మేసింది.. వేల ఎపిసోడ్స్‌తో.. ఇండియాలోనే సంచలన రికార్డు..
తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ యాంకర్ ఎవరంటే సుమ అని ఠక్కున చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తాజాగా ఆమె హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓ టెలివిజన్ షో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నది.

స్టార్ హీరో కుమారుడి పెళ్లి.. దేశంలోని అందరూ సీఎంలు అక్కడికే.. రాహుల్, చంద్రబాబు!
బాలీవుడ్ స్టార్ స్టార్ దంపతులు రాజ్ బబ్బర్, స్వర్గీయ స్మితా పాటిల్ కుమారుడు ప్రతీక్ బబ్బర్ పెళ్లికొడుకయ్యాడు. ఆయన వివాహం ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బీఎస్పీ నేత పవన్ సాగర్ కుమార్తె సన్యా సాగర్‌తో జరిగింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అక్కడ గట్టిగా గిల్లి.. అదోలా నవ్వాడు.. ఆపై ఏం పీకుతావన్నట్టు చూశాడు? కంగన
కంగన మరోసారి లైంగిక వేధింపుల విషయాన్ని తెరమీదికి తెచ్చారు. మీటూ ఉద్యమంపై తాజాగా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇంకా ఈ ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకుపోవాలి అని కంగన పేర్కొన్నారు.

బాలయ్యలో నాకు ఎన్టీఆర్ కనిపించలేదు.. ఆయన కొడుకు కాబట్టే.. ఆర్జీవీ!
రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎన్టీఆర్ లుక్ ని టీజర్ రూపంలో విడుదల చేశారు. ఎన్టీఆర్ గెటప్ లో ఉన్న ఆ నటుడు గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ బాలయ్య బయోపిక్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రభాస్‌కు ఎమ్మెల్యే టికెట్ ఆఫర్.. త్వరలో గవర్నర్‌గా కృష్ణంరాజు!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఓ ఆంగ్ల పత్రిక సంచలన కథనం ప్రచురించింది. మరికొద్ది నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలో ప్రభాస్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడనేది ఈ వార్త సారాంశం.

హద్దులు దాటిన ఎక్స్‌ఫోజింగ్‌తో ప్రయివేట్ పిక్స్ లీక్.. కారణం ఇదే అంటున్న హన్సిక!
ఆపిల్ బ్యూటీ హన్సిక హ్యాకర్స్ అటాక్ కు గురైంది. కొన్ని రోజుల క్రితం హన్సిక ప్రైవేట్ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. దీంతో ఆమె ట్విట్టర్ ద్వారా తన అభిమానులని అలెర్ట్ చేసింది.

రిక్వస్ట్ చేసిన రాంచరణ్.. రూల్స్ బ్రేక్ చేసిన నయనతార!
నయనతారకు డిమాండ్ బాగా పెరగడంతో ఆమె కోసం దర్శక నిర్మాతలు ఎగబడుతున్నారు. నయన్ ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకమైన సైరా నరసింహా రెడ్డి చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం కోసం నయనతార రూల్స్ బ్రేక్ చేస్తోందట.

'వినయ విధేయ రామ' నష్టాలు.. రంగంలోకి దిగిన నిర్మాత!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు బోయపాటి శ్రీను తెరెకక్కించిన ఈ మాస్ ఎంటర్ టైనర్ కు తొలి షో నుంచే నెగిటివ్ టాక్ ప్రారంభమైంది. వసూళ్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు. దీనితో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో బయ్యర్లు నష్టపోయే పరిస్థితి ఉంది. దీనితో చిత్ర నిర్మాత డివివి దానయ్య రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

‘యాత్ర' మూవీ సెన్సేషన్: స్క్రీన్‌పై వైఎస్ జగన్? క్లైమాక్స్‌లో గుండె పిండేసే...
యాత్ర చిత్రంలో ఇతర పాత్రల్లో నటిస్తున్న వారి వివరాలు వెల్లడయ్యాయి కానీ వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి పాత్రలో నటించేది ఎవరు? అనేది రివీల్ కాలేదు. గతంలో కొందరి పేర్లు వినిపించినా ఎవరూ ఫైనల్ కాలేదు. తాజాగా ఇందుకు సంబంధించి ఓ ఆసక్తికర ప్రచారం తెరపైకి వచ్చింది.

నా దృష్టిలో, ఫాన్స్ దృష్టిలో బాబాయి ఇలాగే ఉంటాడు: రామ్ చరణ్ పోస్ట్ వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా తన ఫేస్ బుక్ పేజీ ద్వారా బాబాయ్ పవన్ కళ్యాణ్ గురించిన పాట రిలీజ్ చేయడం హాట్ టాపిక్ అయింది. నా దృష్టిలో, లక్షలాది ఫాన్స్ దృష్టిలో, అంతకన్నా ఎక్కువ ఉండే జన సైనికుల దృష్టిలో బాబాయి ఎలా ఉంటాడో చెప్పే ఓ పాట ఇది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

దిల్ రాజు కొత్తట్రెండ్... ప్రెగ్నెంట్ లేడీతో పోల్చిన తమన్నా!
ఎఫ్ 2 మూవీ రూ. 100 కోట్లు సాధించిన నేపథ్యంలో ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ మా సినిమాతో మొదలు పెడుతున్నామని దిల్ రాజు అన్నారు.

రాజకీయాల్లోకి బిగ్ బాస్ 2 కంటెస్టెంట్, పార్టీ అధ్యక్షురాలిగా...
ది నేషనల్ ఉమెన్స్ పార్టీ(ఎన్.డబ్ల్యు.పి) తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా తమిళ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ నిత్యా ధేజు ఎన్నికయ్యారు. భారత దేశంలో మొట్టమొదటి పూర్తి మహిళలతో కూడిన పార్టీగా గుర్తింపు పొందిన ఎన్.డబ్ల్యు.పి తమిళనాడు రాష్ట్ర కార్యవర్గాన్ని ఇటీవల ప్రకటించింది.


Click it and Unblock the Notifications











