For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: మహేష్‌తో పెంట వద్దన్న పూరి, సునీల్ నిజస్వరూపం అదే, సెట్ తగలబెడతాం..

  |

  ఆ పాప ఎక్స్‌ఫోజింగుకు సెన్సార్, కన్నీరు తెప్పిస్తున్న కౌశల్ పోస్ట్ ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ రిప్లై.. శ్రీముఖిని ఎలిమినేట్ చేస్తే సెట్ తగలబెడతాం.. ఆ పాప ఎక్స్‌ఫోజింగుకు సెన్సార్ పెట్టాలంటూ ట్రోల్స్.. మహేష్ బాబు వివాదాన్ని ఇంకా పెంట చేయడం ఇష్టం లేదన్న పూరి.. విజయ్‌తో అనగానే అమ్మానాన్న వద్దన్నారని చెప్పిన రష్మిక.. చాలా హర్ట్ అయ్యానంటూ కామెడీ స్టార్ సునీల్ నిజస్వరూపం బయట పెట్టిన ఆకాష్.. భర్త ఆత్మహత్య తర్వాత కోలుకున్న టీవీ హీరోయిన్, అతడితో రెండో పెళ్లికి సిద్ధం.. ప్రముఖ నటి బికినీ ఫొటో షేర్ చేసిన రష్మీ.. 'RRR'కు మరో బ్రేక్ ప్యాకప్ చెబుతున్న రామ్ చరణ్ కారణం చిరునే.. ఇలా పలు అంశాలు ఈ వారం బాగా ట్రెండ్ అవుతున్నాయి.

  నోరు జారిన రష్మిక మందన్న... ఆమెను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తారా?

  నోరు జారిన రష్మిక మందన్న... ఆమెను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తారా?

  హీరోయిన్ రష్మిక మందన్నపై కన్నడిగులు కారాలు మిర్యాలు నూరుతున్నారు. కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కన్నడ బిడ్డగా పుట్టి భాషను అవమానించే విధంగా ఆమె మాట్లాడిందనే అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  కన్నీరు తెప్పిస్తున్న కౌశల్ పోస్ట్.. ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ రిప్లై

  కన్నీరు తెప్పిస్తున్న కౌశల్ పోస్ట్.. ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ రిప్లై

  కౌశల్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు రియాలిటీ షో 'బిగ్‌బాస్' ద్వారా ఈయన ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. గత సంవత్సరం 'స్టార్ మా' చానెల్‌లో ప్రసారమైన బిగ్‌బాస్ సీజన్-2 ద్వారా తెలుగు రాష్ట్రాల్లో కౌశల్ స్టార్ అయిపోయాడు. ఈ షోలో ఎన్నో కష్టాలను ఎదుర్కొనడంతో పాటు, హౌస్‌లోని అందరూ టార్గెట్ చేయడంతో చాలా మంది కౌశల్‌కు మద్దతుగా నిలిచారు. అతడు పడుతున్న కష్టాలు చూసి ప్రేక్షకులు భారీ స్థాయిలో ఓట్లు వేశారు. ఈ క్రమంలో కొందరు ఆర్మీలా తయారై అతడిని విన్నర్‌ను చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా కౌశల్ పేరు మారుమ్రోగిపోయింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  శ్రీముఖిని ఎలిమినేట్ చేస్తే సెట్ తగలబెడతాం..

  శ్రీముఖిని ఎలిమినేట్ చేస్తే సెట్ తగలబెడతాం..

  'బిగ్ బాస్' సీజన్ 3 ప్రారంభమైంది. ఎన్నో వివాదాలు చుట్టుముట్టినా ఈ షోను మాత్రం అనుకున్న సమయానికే ప్రారంభించారు నిర్వహకులు. అంగరంగ వైభవంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా పరిచయం అయ్యారు. అదే రోజు 15 మంది సభ్యులను ఆయన హౌస్‌లోకి పంపించారు. ఇక, తర్వాతి రోజే 'బిగ్ బాస్‌'లో రచ్చ మొదలైంది. దీనికి కారణం ఎలిమినేషన్‌కు నామినేషన్స్ జరగడమే.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బిగ్‌బాస్ 3: ఆ పాప ఎక్స్‌ఫోజింగుకు సెన్సార్ పెట్టాలంటూ ట్రోల్స్!

  బిగ్‌బాస్ 3: ఆ పాప ఎక్స్‌ఫోజింగుకు సెన్సార్ పెట్టాలంటూ ట్రోల్స్!

  యంగ్ యాక్ట్రెస్ పునర్నవి బిగ్ బాస్ ఇంట్లో చిట్టిపొట్టి షార్ట్స్ ధరించి సూపర్ హాట్‌గా లుక్‌తో కనిపిస్తున్నారు. ఆమె లుక్ చూసిన నెటిజన్స్ ఫన్నీ మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోల్స్ వల్ల పునర్నవికి మంచే జరుగుతోందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఆమెను ఎవరూ పట్టించుకునేవారు లేరు, కనీసం ఈ రకంగా అయినా అందరి దృష్టిలో పడుతున్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  లైఫ్ ఎఫెక్ట్ అయినా నా కోసం రష్మిక ఎన్నో మాటలు పడింది.. ఆరోజు మీకే తెలుస్తుంది.. విజయ్ ఆవేదన

  లైఫ్ ఎఫెక్ట్ అయినా నా కోసం రష్మిక ఎన్నో మాటలు పడింది.. ఆరోజు మీకే తెలుస్తుంది.. విజయ్ ఆవేదన

  టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా తాజాగా నటించిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. గత సంవత్సరం వచ్చిన సూపర్ హిట్ సినిమా 'గీత గోవిందం' తర్వాత ఈ జంట నటిస్తున్న చిత్రం ఇది. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అలాగే, ఈ జంటపై చాలా రూమర్స్ వస్తున్నాయి. దీని గురించి అటు విజయ్.. ఇటు రష్మిక ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చినా అవి ఆగడం లేదు. దీంతో వైజాగ్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దీనిపై మరోసారి స్పందించాడు విజయ్.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మహేష్ బాబు వివాదం: దాన్ని ఇంకా పెంట చేయడం ఇష్టం లేదన్న పూరి!

  మహేష్ బాబు వివాదం: దాన్ని ఇంకా పెంట చేయడం ఇష్టం లేదన్న పూరి!

  నేను హిట్లలో ఉంటేనే మహేష్ బాబు సినిమా చేస్తాడు... లేకుంటే చేయడు అంటూ పూరి జగన్నాధ్ చేసిన కామెంటుపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. పూరిని ట్రోల్ చేస్తూ తమ ప్రతాపం చూపిస్తున్నారు. దీనిపై పూరి తాజాగా పూరి స్పందిస్తూ... ‘ఆల్రెడీ ట్రోల్ అవుతోంది అంటున్నారు. మళ్లీ దాన్ని గెలికి పెంటచేయడం ఎందుకు? ఆ విషయాలు ఇప్పుడు వద్దు' అంటూ దాటవేసే ప్రయత్నం చేశారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  విజయ్‌తో అనగానే అమ్మానాన్న వద్దన్నారు.. అతడి కోసం ఎన్నో దాటుకుని వచ్చా: రష్మిక

  విజయ్‌తో అనగానే అమ్మానాన్న వద్దన్నారు.. అతడి కోసం ఎన్నో దాటుకుని వచ్చా: రష్మిక

  రష్మిక మందన్నా.. అందం, అభినయంతో రాణిస్తున్న హీరోయిన్. సైలెంటుగా తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చినా.. ఇప్పుడు వ‌ర‌స సినిమాల‌తో బిజీ అయిపోయింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో 'గీత గోవిందం' త‌ర్వాత ఈమె న‌టించిన సినిమా 'డియర్ కామ్రేడ్'. ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్‌తోనే నెల రోజులుగా బిజీగా ఉంది ఈ కన్నడ బ్యూటీ. భ‌ర‌త్ క‌మ్మ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. జులై 26న విడుదల కానుంది ఈ చిత్రం. ఈ నేపథ్యంలో వైజాగ్‌లో 'డియర్ కామ్రేడ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా రష్మిక ఎన్నో విషయాలు పంచుకుంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  చాలా హర్ట్ అయ్యాను అంటూ... కామెడీ స్టార్ సునీల్ నిజస్వరూపం బయట పెట్టిన ఆకాష్!

  చాలా హర్ట్ అయ్యాను అంటూ... కామెడీ స్టార్ సునీల్ నిజస్వరూపం బయట పెట్టిన ఆకాష్!

  తెలుగులో స్టార్ కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగిన సునీల్ ఆ తర్వాత హీరోగా కూడా ట్రై చేశాడు. మొదట్లో కొన్ని విజయాలు లభించినప్పటికీ ఆ తర్వాత వరుస ప్లాపులతో కెరీర్ అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేదు. మళ్లీ ఇపుడు కామెడీ పాత్రలు చేస్తూ కెరీర్ నెట్టుకొస్తున్నారు. 'అందాల రాముడు' సినిమాతో హీరోగా తన జర్నీ మొదలు పెట్టిన సునీల్‌పై ఈ చిత్రంలో సెకండ్ హీరో పాత్ర చేసిన ఆకాష్ సంచలన కామెంట్స్ చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సునీల్ తన విషయంలో ఎలా ప్రవర్తించాడో వెల్లడించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  భర్త ఆత్మహత్య... కోలుకున్న టీవీ హీరోయిన్, అతడితో ప్రేమలో, రెండో పెళ్లికి సిద్ధం!

  భర్త ఆత్మహత్య... కోలుకున్న టీవీ హీరోయిన్, అతడితో ప్రేమలో, రెండో పెళ్లికి సిద్ధం!

  టీవీ నటి పావని రెడ్డి త్వరలో రెండో వివాహానికి సిద్దమవుతున్నారు. భర్త ప్రదీప్ చనిపోయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్లిన ఆమె కొన్ని నెలల క్రితమే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇపుడు మరో వివాహం చేసుకోవడం ద్వారా సరి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. తెలుగులో పలు సీరియల్స్, సినిమాల్లో నటించిన పావని ప్రస్తుతం తమిళంలో 'చిన్న తంబి' అనే సీరియల్‌లో నందిని అనే పాత్రలో నటిస్తోంది. సుమ, రాజీవ్ కనకాల నిర్మాణంలో వచ్చిన 'నేను, ఆయన, ఐదుగురు అత్తలు' సీరియల్ ద్వారా టీవీ నటిగా పావని కెరీర్ ప్రారంభించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బికినీ ఫొటో షేర్ చేసిన రష్మీ.. సిక్స్ ప్యాక్ బాడీ.. ఇంక లేట్ ఎందుకు నువ్వు కూడా అంటూ..

  బికినీ ఫొటో షేర్ చేసిన రష్మీ.. సిక్స్ ప్యాక్ బాడీ.. ఇంక లేట్ ఎందుకు నువ్వు కూడా అంటూ..

  తెలుగు వారికి బాగా దగ్గరైన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. అందంతో ఎంతో మందిని తన వైపునకు తిప్పుకున్న ఈ హాట్ బ్యూటీ.. బుల్లితెరపైనే కాకుండా, వెండితెరపైనా అప్పుడప్పుడూ మెరుస్తోంది. అవసరం ఉన్నప్పుడు తన అందాలతో కనువిందు చేసే ఈ అమ్మడు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు, తరచూ ఫొటో షూట్లు చేస్తూ కుర్రకారు మదిని దోచుకుంటున్న ఈ అమ్మడు తాజాగా షేర్ చేసిన ఫొటో చర్చనీయాంశం అవుతోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ‘RRR'కు మరో బ్రేక్.. ప్యాకప్ చెబుతున్న రామ్ చరణ్.. కారణం చిరునే

  ‘RRR'కు మరో బ్రేక్.. ప్యాకప్ చెబుతున్న రామ్ చరణ్.. కారణం చిరునే

  తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'RRR'. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఇద్దరు స్టార్ హీరోలు.. అందునా బడా డైరెక్టర్ ఉండడంతో ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. అలాగే, ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామారాజుగా కనిపించనుండగా, తారక్ మాత్రం కొమరం భీంగా నటిస్తున్నాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మొత్తానికి కారణం పూరీ జగన్నాథే: కీలక వ్యాఖ్యలు చేసిన రామ్ చరణ్.. ఇండస్ట్రీలో చర్చ

  మొత్తానికి కారణం పూరీ జగన్నాథే: కీలక వ్యాఖ్యలు చేసిన రామ్ చరణ్.. ఇండస్ట్రీలో చర్చ

  తెలుగు సినీ ఇండస్ట్రీలోని అందరు హీరోలతో సినిమాలు చేసిన దర్శకుల్లో పూరీ జగన్నాథ్ ఒకరు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన.. ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో చేసిన చిత్రమే 'ఇస్మార్ట్ శంకర్'. గత వారం విడుదలైన ఈ సినిమా మొదట మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత క్రమంగా పుంజుకుని హిట్ చిత్రంగా నిలిచింది. విడుదలైన అన్ని కేంద్రాల్లో హౌస్‌ఫుల్ షోలతో దూసుకుపోతోంది. అలాగే భారీ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులను తిరగరాసింది. తాజాగా ఈ సినిమాకు ఊహించని బూస్ట్ వచ్చింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  చుట్టూ వంద మంది మగాళ్లు.. వాష్ రూమ్ కూడా లేదు.. చేసేందే లేక..: శివాత్మిక

  చుట్టూ వంద మంది మగాళ్లు.. వాష్ రూమ్ కూడా లేదు.. చేసేందే లేక..: శివాత్మిక

  తెలుగు యంగ్ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్, సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక కలిసి నటించిన చిత్రం 'దొరసాని'. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ కమర్షియల్‌గా సక్సెస్‌ కాలేకపోయింది. అయితే, ఇందులో హీరో, హీరోయిన్ల నటనకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా ఇందులో శివాత్మక 'దొరసాని' పాత్రలో మెప్పించింది. ఈ నేపథ్యంలో ఆమె ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా పలు విషయాలను వెల్లడించింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  వయసైపోయిన నాగార్జునతో రొమాన్స్ ... ఎన్ని కోట్లు ఇచ్చి ఒప్పించారంటే?

  వయసైపోయిన నాగార్జునతో రొమాన్స్ ... ఎన్ని కోట్లు ఇచ్చి ఒప్పించారంటే?

  వయసైపోయిన హీరోలతో యంగ్ హీరోయిన్లు చేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. వారితో ఒకసారి సినిమా కమిటైతే యువ హీరోలతో తమకు అవకాశాలు రాకపోవచ్చని చాలా మంది భయపడతారు. అందులోనూ 60 ఏళ్లకు దగ్గరైన స్లార్లతో చేయడాన్ని తమ కెరీర్‌కు రిస్క్‌గా భావిస్తారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  'బిగ్ బాస్'కి వెళ్లి క్యారెక్టర్ స్పాయిల్ చేసుకున్నా అని ఫీల్ కావొద్దు.. సంజన సెన్సేషనల్ కామెంట్స్

  'బిగ్ బాస్'కి వెళ్లి క్యారెక్టర్ స్పాయిల్ చేసుకున్నా అని ఫీల్ కావొద్దు.. సంజన సెన్సేషనల్ కామెంట్స్

  ఎన్నో అవాంతరాలు, మరెన్నో వివాదాలు.. వీటన్నింటి దాటుకొని సక్సెస్‌ఫుల్‌గా ప్రారంభమైంది బిగ్ బాస్ షో. సీజన్ 3కి హోస్ట్ గా చేస్తున్న నాగార్జున, 15 మంది పార్టిసిపెంట్స్ గత ఆదివారం బిగ్ బాస్ షో ప్రారంభం రోజున బుల్లితెర ఆడియన్స్‌ని పలకరించారు. గత రెండు సీజన్లలో కంటే ఈ సీజన్ పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు రావడం, చర్చలు ముదరటం కారణంగా జనంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో బిగ్ బాస్ సీజన్ 2 కంటిస్టెంట్ సంజన బిగ్ బాస్ షో గురించిన ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇంతకీ ఆమె చెప్పిన సంగతులేంటి? వివారాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Trending news July 4th week 2019. Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. rashmika mandanna, kaushal manda, vijay deverakonda, puri jagannadh, mahesh babu news in top list.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X