ఉపాసన కూడా సినిమా ప్రపంచంతో కనెక్ట్ అయింది!
అపోలో ఫ్యామిలీ నుండి సినిమా ఫ్యామిలీలోకి కోడలుగా వచ్చిన ఉపాసన..... అత్తారింటికి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. అంతకు ముందు వరకు సినిమా ప్రపంచానికి అంటీముట్టనట్లు ఉండే ఆమె.... మెగా ఫ్యామిలీలోకి ఎంటరైన తర్వాత ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా మారిపోయింది.
అత్తారింట్లో అన్ని విషయాల్లోనూ సపోర్టుగా ఉంటున్నారు. ఓ వైపు అపోలో వైస్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే మరో వైపు సినిమా రంగంలో స్టార్స్‌గా వెలుగొందుతున్న తన భర్త, మామయ్య గురించిన విషయాలు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి 151వ మూవీ 'సైరా నరసింహారెడ్డి' సినిమా షూటింగ్ బుధవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా విశేషాలను ఉపాసన అభిమానులతో పంచుకున్నారు.
కొణిదెల కుటుంబం నుండి ఇదో కొత్త ప్రారంభం
‘కొణిదెల కుటుంబం నుండి ఇదో కొత్త ప్రారంభం. మిస్టర్.సి(చరణ్) రెండోసారి నిర్మాతగా మామయ్య 151వ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమాలోని ‘సైరా నరసింహారెడ్డి' పాత్ర, సినిమా మిమ్మల్ని తప్పకుండా మెస్మరైజ్ చేస్తాయి' అని ఉపాసన ట్వీట్ చేశారు.
తెరపై అల్టిమేట్ మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది
సూపర్ టీమ్ వర్క్ అండ్ టీమ్ స్పిరిట్. ‘సైరా నరసింహారెడ్డి' చిత్రం తప్పకుండా వెండితెరపై అల్టిమేట్ మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని తప్పకుండా చెప్పగలను అని ఉపాసన నమ్మకం వ్యక్తం చేశారు.

చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ విశేషాలు
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఈ సినిమా షూటింగ్ బుధవారం (డిసెంబర్ 6) హైదరాబాద్ శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది.
పూర్తి వివరాలు, షూటింగ్ ఫోటోల కోసం క్లిక్ చేయండి.



Click it and Unblock the Notifications











