For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ మొదలైంది... (ఫోటోస్)

  By Bojja Kumar
  |
  చిరంజీవి ‘సైరా' షూటింగ్ మొదలైంది... డీటైల్స్ ఇవే !

  మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఈ సినిమా షూటింగ్ బుధవారం (డిసెంబర్ 6) హైదరాబాద్‌ శివారులో వేసిన ప్రత్యేక సెట్లో మొదలైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం చిరంజీవి కోరీర్లోనే భారీ బడ్జెట్‌ మూవీ.

  బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

  ఈ సినిమాకు మంచి టీం దొరికింది. ఈ చిత్ర నిర్మాణం ఓ మధురమైన జ్ఞాపకంగా మాకు మిగిలిపోతుంది. అని రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు

   డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఎగ్జైట్మెంట్

  డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఎగ్జైట్మెంట్

  షూటింగ్ మొదలైన విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు సురేందర్ రెడ్డి సెట్స్‌ నుండి కొన్ని ఫోటోలు విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉందని, అమేజింగ్ టీమ్‌తో కలిసి పని చేస్తున్నానని సురేందర్ రెడ్డి తెలిపారు. లొకేషన్లో చిత్ర నిర్మాత రామ్ చరణ్ తో కలిసి సెల్ఫీ పోస్టు చేశారు.

   సినిమాటోగ్రాఫర్ రత్నవేలు

  సినిమాటోగ్రాఫర్ రత్నవేలు

  ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా మొదట రవివర్మన్‌ను అనుకున్నారు. అయితే పలు కారణాలతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పని చేస్తున్నారు.

  షూటింగ్ మొదలైంది

  సెట్స్‌లో చిన్నపాటి పూజా కార్యక్రమాలు నిర్వహించి షూటింగ్ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కొణిదెల ప్రొడక్షన్స్ విడుదల చేసింది.

  నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను

  సైరా నరసింహారెడ్డి లాంటి ఎపిక్ మూవీలో భాగం కావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. మరోసారి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తో కలిసి పని చేసే అవకాశం దక్కింది. సూరికి అండ్ టీమ్‌కు బెస్ట్ విషెస్ చెబుతున్నాను అంటూ రత్నవేలు ట్వీట్ చేశారు.

   తొలి షెడ్యూల్ లో మెగాస్టార్

  తొలి షెడ్యూల్ లో మెగాస్టార్

  మొదటి షెడ్యూల్‌తో చిరంజీవితో పాటు ముఖ్యతారాగణంపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఏయే లొకేషన్లలో సినిమా షూటింగ్ జరుగబోతోంది అనేది కొణిదెల ప్రొడక్షన్స్ అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది.

   అమితాబ్ తొలిసారిగా

  అమితాబ్ తొలిసారిగా

  ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో, సౌత్ చిత్ర సీమలో బాహుబలిని మించిన సినిమా లేదు. అయితే 'బాహుబలి' తర్వాత ఆ స్థాయిలో 'సై రా నరసింహారెడ్డి' సినిమా తెరకెక్కబోతోంది. భారీ తారాగణంతో ఈ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేయబోతోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ తొలిసారిగా ఈ సినిమా ద్వారా తెలుగులో నటించబోతున్నారు.

  ఫిట్‌నెస్ సాధించి కొత్తగా కనిపించబోతున్న మెగాస్టార్

  ఫిట్‌నెస్ సాధించి కొత్తగా కనిపించబోతున్న మెగాస్టార్

  రీసెంట్ గా రిలీజ్ చేసిన ఒక ఫొటోని చూస్తే ఆరు పదుల వయసు దాటిన మెగా స్టార్ ఒక యోధుడిగా అదరగొట్టబోడున్నాడని తెలుస్తోంది. పాత్రకు కరెక్ట్ గా సెట్ అయ్యేలా మెగాస్టార్ తన బాడీని ఫిట్‌గా మార్చుకున్నారు.

  150 కోట్ల భారీ బడ్జెట్

  150 కోట్ల భారీ బడ్జెట్

  పీరియాడియకల్ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రం దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందనుందని తెలుస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళంలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  భారీ తారాగణం అందుకే

  భారీ తారాగణం అందుకే

  హిందీ నుండి అమితాబ్, తమిళం నుండి విజయ్ సేతుపతి, కన్నడ నుండి కిచ్చా సుదీప్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. తెలుగు నటుడు జగపతి బాబు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. నయనతార హీరోయిన్. ఆయా ఇండస్ట్రీలో మార్కెట్ చేజిక్కించుకునేందుకే ఇంత భారీ తారాగణం సెట్ చేసినట్లు తెలుస్తోంది.

  ఛాన్స్ కొట్టేసిన తమన్

  ఛాన్స్ కొట్టేసిన తమన్

  ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తారని మొదట ప్రకటించారు. అయితే పలు కారణాలతో రెహమాన్ తప్పుకోవడంతో ఈ అవకాశం తమన్‌కు దక్కింది. సైరా మోషన్ పోస్టర్ కు సంగీతం అందించింది కూడా అతడే.

  English summary
  Mega Star Chiranjeevi’s most prestigious project, ‘Sye Raa Narasimha Reddy’, kicks off today in Hyderabad. Directed by Surender Reddy, Chiranjeevi will be seen applying the titular role in the period film which is based freedom fighters of India, Uyyalawada Narasimha Reddy.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X