»   » చిరంజీవి, బాలయ్య న్యూ మూవీ టైటిల్స్ ఖరారు!

చిరంజీవి, బాలయ్య న్యూ మూవీ టైటిల్స్ ఖరారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ 'ఖైదీ నెం 150' సినిమా భారీ విజయం సాధించిన తర్వాత అభిమానుల్లో ఆయన తర్వాత సినిమా ఏమిటి? ఎప్పుడు వస్తుంది? అనే ఆసక్తి పెరిగింది. మెగాస్టార్ 151వ సినిమా ఎవరితో ఉంటుంది? దానికి ఆయన ఎలాంటి సబ్జెక్టు ఎంచుకుంటారు? అనే విషయంలో ఇంకా సరైన క్లారిటీ రాలేదు.

మెగాస్టార్ 151వ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఇంకా అఫీషియల్ గా అయితే ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. తాజాగా రామ్ చరణ్ సొంత బేనర్ కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో ఫిల్మ్ చాంబర్లో 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' టైటిల్ రిజిస్టర్ చేయించడంతో ఇదే మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా అనే ప్రచారం జరుగుతోంది.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

ఉయ్యాలవాడ నరిసింహారెడ్డి కథను మెగాస్టార్ చిరంజీవి సినిమాకు సరిపోయే విధంగా.... ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ స్క్రిప్టు వర్క్ చేస్తున్నారు. మెగాస్టార్ కూడా ఈ సినిమా చేయడంపై ఆసక్తిగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది... ఉయ్యాలవాడ స్టోరీ గురించి తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

 బాలయ్య ‘జయ సింహ’

బాలయ్య ‘జయ సింహ’

ప్రముఖ తెలుగు నిర్మాత సి కళ్యాణ్ 'జయ సింహ' అనే టైటిల్ ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ చేయించారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కే చిత్రం కోసమే ఈ టైటిల్ రిజిస్టర్ చేయించారని టాక్.

101వ మూవీ

101వ మూవీ

బాలకృష్ణ, పూరి జగన్నాథ్‌ కాంబినేషనల్లో తెరకెక్కనున్న చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. బాలకృష్ణకు ఇది 101వ చిత్రం కావడం విశేషం.ఈ ప్రారంభోత్సవంలో రాజమౌళి ప్రత్యేకార్షణగా నిలిచారు. పూర్తి వివరాలు, ఫోటోల కోసం క్లిక్ చేయండి.

‘పక్కింటి అబ్బాయి’గా

‘పక్కింటి అబ్బాయి’గా

మరో వైపు అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కే సినిమా కోసం ‘పక్కింటి అబ్బాయి' అనే టైటిల్ ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ అయింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయి.

English summary
Megastar Chiranjeevi is gearing up to work for his 151 film with Surendar Reddy. The movie is said to be a periodic drama and Megastar will essay the role of Uyyalawada Narasimha Reddy. As per the latest Report, Konidela Production Company has registered the title Uyyalawada Narasimha Reddy at the film chamber.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu