»   » చూడదగ్గ చక్కని సీన్ :బాలయ్య కు రాజమౌళి క్లాప్, బోయపాటి గౌరవ దర్శకత్వం (ఫొటోలు)

చూడదగ్గ చక్కని సీన్ :బాలయ్య కు రాజమౌళి క్లాప్, బోయపాటి గౌరవ దర్శకత్వం (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌:బాలకృష్ణ పూరి జగన్నాథ్‌ కాంబినేషనల్లో తెరకెక్కనున్న చిత్రం ఇవాళ ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. బాలకృష్ణకు ఇది 101వ చిత్రం కావడం విశేషం.ఇవాళ ఉదయం కూకట్‌పల్లి తులసీవనంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ ప్రారంభోత్సవం జరిగింది.

ఈ చిత్రం ప్రారంభోత్సవం కార్యక్రమంలో బాలకృష్ణ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బాలకృష్ణ, పూరి జగన్నాథ్‌, దర్శకులు క్రిష్‌, బోయపాటి శ్రీను, ఎస్వీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యంగా ఈ ప్రారంభోత్సవంలో రాజమౌళి ప్రత్యేకార్షణగా నిలిచారు. ఎంతోకాలం నుంచి బాలయ్య, రాజమౌళి కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుండును అనుకునేవారికి, అది నిజం కాకపోయినా , ఇలా అయినా వారిద్దరూ ఒకే చోట కనపడటం ఆనందం కలిగించింది.

బోయపాటి గౌరవ దర్శకత్వం

బోయపాటి గౌరవ దర్శకత్వం

ఇక ఈ కార్యక్రమంలో .... నందమూరి రామకృష్ణ కెమెరా స్విచ్ఛాన్‌ చేసారు. అలాగే .. తొలి సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి క్లాప్‌ కొట్టారు. మరో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు.

...ఇన్నాళ్లకు అవకాసం

...ఇన్నాళ్లకు అవకాసం

నందమూరి బాలకృష్ణతో సినిమా చేసేందుకు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని.. ఇప్పటికి ఆయనతో పనిచేసే అవకాశం వచ్చిందని దర్శకుడు పూరి జగన్నాథ్‌ అన్నారు. నందమూరి అభిమానులు బాలకృష్ణ నుంచి ఏ అంశాలు కోరుకుంటారో అలాగే చిత్రాన్ని తెరకెక్కిస్తామని పేర్కొన్నారు.

పొలిటీషన్స్ కూడా

పొలిటీషన్స్ కూడా

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను కూకట్ పల్లి తులసీ వనం టెంపుల్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హీరో బాలకృష్ణ, దర్శకుడు పూరి జగన్నాథ్ తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

తెరదించాడు

తెరదించాడు

గౌతమిపుత్ర శాతకర్ణి సక్సెస్ తరువాత గ్యాప్ తీసుకున్న బాలయ్య పూరి దర్శకత్వంలో సినిమాచేసేందుకు అంగీకరించాడు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి' విజయంతో ఉత్సాహంగా ఉన్న బాలకృష్ణ తర్వాత ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తారన్న వూహాగానాలకు కొద్దిరోజుల క్రితం పూరి జగన్నాథ్‌ తెరదించారు.

వరస ప్లాఫ్ లతో

వరస ప్లాఫ్ లతో

వరుస ఫ్లాప్ లతో ఇబ్బందుల్లో ఉన్న పూరి ప్రస్తుతం ఇషాన్ హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన రోగ్ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. బాలకృష్ణ 101 చిత్రం.. మార్చి 9న చిత్రాన్ని ప్రారంభించి.. సెప్టెంబర్‌ 29న విడుదల చేస్తామని ప్రకటించారు.

ఫ్రొపైల్ ని పంపి

ఫ్రొపైల్ ని పంపి

ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతూ మేకర్స్ కాస్టింగ్ కాల్ ఇచ్చారు. 23 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య ఉన్న మేల్, ఫీమేల్ వ్యక్తులు ఈ చిత్రంలో నటించే గొప్ప ఛాన్స్ అందుకోవచ్చంటూ తెలిపారు. ఇక ఈ చిత్రంలో విలన్ గా పూరీ కొత్త వ్యక్తిని తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. మరి ఆసక్తి గల వారు మీ కంప్లీట్ ప్రొఫైల్ ని CASTING@PURICONNECTS డాట్ కామ్ కు కి పంపించి, బాలయ్య సినిమాలో నటించే గొప్ప ఛాన్స్ అందుకోవచ్చని తెలిపారు.

English summary
Nandamuri Balakrishna‘s 101st film finally went on floors today at a grand launch ceremony in Hyderabad. This time, he is teaming up with Puri Jagganadh. His previous directors ( Krish, Boyapati Srinu, and Jagganadh) were also present at the inauguration. Baahubali director SS Rajamouli gave the first clap.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu