»   » అందరికీ మేమే సాఫ్ట్ టార్గెట్: పూరి గురించి, డ్రగ్స్ ఇష్యూపై వరుణ్ తేజ్

అందరికీ మేమే సాఫ్ట్ టార్గెట్: పూరి గురించి, డ్రగ్స్ ఇష్యూపై వరుణ్ తేజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ త్వరలో 'ఫిదా' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న ఈ మెగా ప్రిన్స్ టాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు కూడా ఎదుర్కోక తప్పడం లేదు.

డ్రగ్స్ స్కాండల్ మీద మీ స్పందన ఏమిటి? అని అడిగిన ప్రశ్నకు వరుణ్ తేజ్ స్పందిస్తూ....'దీన్ని ఓ స్కాండల్‌లా చూడొద్దు. ఇప్పటికే ఈ విషయమై నోటీసులు అందుకున్న వారు అంతా క్లారిఫికేషన్ ఇచ్చారు. ప్రస్తుతం కేవలం విచారణ మాత్రమే జరుగుతోంది. అలా అని నేను ఎవరి పక్షం తీసుకోవడం లేదు. నేను రెండువైపుల వారూ మాట్లాడే విష‌యాల్లో న్యాయాన్ని గ‌మ‌నిస్తుంటాను' అని సమాధానం ఇచ్చారు.


పూరి జగన్నాథ్ గురించి...

పూరి జగన్నాథ్ గురించి...

నాకు తెలిసినంత వరకు పూరి జగన్నాథ్ చాలా మంచి వ్యక్తి. అందరినీ సమానంగా చూస్తారు. ఆరోగ్యం విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. తన స్టాఫ్‌ను కూడా చాలా బాగా చూసుకుంటారు. ఆయనపై డ్రగ్స్ వ్యవహారం గురించి వార్తలు వినడమే తప్ప తనకే ఏమీ తెలియదన్నారు.


Sai Pallavi Dominating Varun Tej In Fidaa Movie
పూరి పేరు చూసి షాకయ్యాను

పూరి పేరు చూసి షాకయ్యాను

డ్రగ్ రాకెట్‌తో పూరికి సంబంధముందని వార్తలు చూసి షాకయ్యాను. నేను ఆయనతో సినిమా చేస్తుండగా ఎప్పుడూ డ్రగ్స్ జోలికి వెళ్లినట్లు చూడలేదన్నారు.మేమే సాఫ్ట్ టార్గెట్

మేమే సాఫ్ట్ టార్గెట్

ఏదైనా ఇష్యూ జరిగితే ముందుగా అందరూ సినీ సెలబ్రిటీలనే టార్గెట్ చేస్తారు. నిజా నిజాలు తేలక ముందే చాలా బ్యాడ్‌గా మాట్లాడతారు. ఈ విషయంలో సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వరుణ్ తేజ్ అభిప్రాయ పడ్డారు.


ఫిదా సినిమా గురించి

ఫిదా సినిమా గురించి

శేఖ‌ర్‌క‌మ్ముల‌గారి సినిమాల్లో క‌థ అంటూ పెద్ద‌గా ఏమీ ఉండ‌దు. చాలా స‌న్న‌టి థ్రెడ్‌మాత్ర‌మే ఉంటుంది. కానీ ఎమోష‌న్స్ మాత్రం చ‌క్క‌గా క్యారీ చేస్తారు. `ఫిదా` అలాంటి సినిమా అవుతుంది. తండ్రీ కూతురి మ‌ధ్య‌, అన్న‌ద‌మ్ముల మ‌ధ్య‌, ప‌ర‌స్ప‌ర విరుద్ధ‌మైన ఆలోచ‌న‌లున్న అమ్మాయి, అబ్బాయి మ‌ధ్య జ‌రిగే అంశాల‌ను చాలా సున్నితంగా చూపించారని వరుణ్ తేజ్ తెలిపారు.


నా హీరోయిజం ఏమీ ఉండదు

నా హీరోయిజం ఏమీ ఉండదు

సినిమాలో నా హీరోయిజం చూపించడం లాంటి బిల్డప్పులు ఏమీ ఉండవు. మెడిస‌న్ చ‌దివే అబ్బాయిగా న‌టించాను. చాలా సాఫ్ట్‌గా ఉండే క్యారెక్టర్ చేశాను అని వరుణ్ తేజ్ తెలిపారు. నా పాత్ర ఫ్యాన్స్‌కి నచ్చుతుందనే అనుకుంటున్నాను అన్నారు.


బాబాయ్ మేనరిజమ్స్

బాబాయ్ మేనరిజమ్స్

సినిమాలో ఓ సీన్లో సాయి పల్లవి బాబాయ్ మేనరిజమ్ చేస్తుంది. మొన్న ఆడియో ఫంక్ష‌న్‌లో బాబాయ్ పేరు విన్న ప్ర‌తిసారీ అభిమానులు అరుస్తుంటే `ఎవ‌రు ఆయ‌న‌... ఎందుకు ఇంత మంది ఇలా అరుస్తున్నారు` అని అడిగితే బాబాయ్ గురించి చెప్పాను అని వరుణ్ తేజ్ తెలిపారు.


చరణ్ అన్నయ్య నిర్మాణంలో సినిమా చేస్తాను

చరణ్ అన్నయ్య నిర్మాణంలో సినిమా చేస్తాను

అన్నయ్య స్థాపించిన కొణిదెల ప్రొడక్షన్స్ లో త్వరలో సినిమా చేస్తాను. ఇప్పటికే అన్నయ్య నాతో సినిమా చేద్దామ,ని అన్నారు. మంచి కథ కోసం ఎదురు చూస్తున్నాం అని వరుణ్ తేజ్ తెలిపారు.English summary
Asked about the Drug Scandal, Varun Tej opined 'It's not scandal...all of them have issued clarification already. But, I don't want to take anyone's side. Drugs aren't good for our health..nothing is better than a healthy life.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu