నా ఈ మాటలు గుర్తు పెట్టుకోండి.. విజయ్ దేవరకొండ ఎమోషనల్
ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత పూరి జగన్నాథ్ తెరెకెక్కించే సినిమాపై అందరికీ ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. పైగా విజయ్ దేవరకొండ లాంటి హీరోతో సినిమా అనేసరికి అందరికీ భారీగా హైప్ పెరిగింది. ఇక ముందుగా దాన్నితెలుగులోనే ప్లాన్ చేసినా కూడా చివరకు అది ప్యాన్ ఇండియా వరకు వెళ్లింది. అలా మొత్తంగా పూరి సినిమాతో విజయ్ దేవరకొండ హిందీలో పరిచయం కాబోతోన్నాడు.
Recommended Video

అప్పట్లో ఓ షెడ్యూల్..
పూరి జగన్నాథ్ సినిమా కోసం విజయ్ దేవరకొండ స్పెషల్ మేకోవర్ ట్రై చేశాడు. సినిమా కోసం బాక్సింగ్‌లొ శిక్షణ తీసుకున్నాడు. థాయ్‌లాండ్‌లో స్పెషల్ ట్రైనింగ్ అనంతరం ఆ మధ్య ముంబైలో ఓ షెడ్యూల్‌ను కూడా షూట్ చేశారు. ఆ తరువాత కరోనా, లాక్డౌన్ వల్ల ఇప్పటి వరకు మళ్లీ షూటింగ్‌కు ప్రారంభించలేదు.

అంతా రెడీ..
ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాథ్ తమ సినిమా షూటింగ్‌ను మళ్లీ ప్రారంభించేందుకు అంతా సిద్దం చేశారు. అయితే సినిమా సెట్ మీదకు వెళ్లే ముందు అందరికీ ఓ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇంత వరకు సినిమా టైటిల్ అనౌన్స్ చేయకపోవడంతో అందరికీ అప్డేట్ ఇచ్చారు.

లైగర్ అంటూ రచ్చ..
విజయ్ దేవరకొండ పూరి ప్రాజెక్ట్‌కు మొదటగా ఫైటర్ టైటిల్‌ను ఫిక్స్ చేయాలని చూసినట్టున్నారు. కానీ అది వర్కింగ్ టైటిల్ అని ఆ మధ్య క్లారిటీ ఇచ్చారు. కానీ రీసెంట్‌గా ఓ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ను షేర్ చేశారు. ఇందులో లైగర్‌గా విజయ్ దేవరకొండ అదిరిపోయే లుక్కులో కనిపించాడు. లైగర్ పోస్టర్ రిలీజ్ సందర్భంగా సంబరాలు మిన్నంటాయి.

లైగర్ పోస్టర్ రిలీజ్
లైగర్ పోస్టర్ రిలీజ్ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు ఆకాశన్నంటాయి. అలా అభిమానులు తనపై చూపించిన ప్రేమకు విజయ్ దేవరకొండ ఎమోషనల్ అయ్యాడు. 'లైగర్' టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైన రోజు మీరు నన్ను ఎంతగానో భావోద్వేగానికి గురి చేశారు. మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నేను ఆనందంతో ఉద్వేగానికి లోనయ్యానంటూ చెప్పుకొచ్చాడు.

నా ఈ మాటలు గుర్తుపెట్టుకోండంటూ..
ప్రేక్షకుల్లో ఒక్కరైనా నా నటనను గుర్తిస్తారా? నా సినిమాలు చూడడానికి థియేటర్‌కు వస్తారా?అని ఒకానొక సమయంలో ఎంతో బాధపడేవాడిని. 'లైగర్' పోస్టర్ విడుదల చేసిన తర్వాత ఎన్నో ప్రాంతాల్లో జరిగిన సెలబ్రేషన్స్ చూసి నాకెంతో ఆనందంగా అనిపించింది. టీజర్ విడుదలైనప్పుడు దేశవ్యాప్తంగా ఇలాంటి వేడుకలే జరుగుతాయని గ్యారంటీ ఇస్తున్నా... నా ఈ మాటలు గుర్తుపెట్టుకోండంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు..


Click it and Unblock the Notifications











