Liger: విజయ్ దేవరకొండ, చిరంజీవికి ఫ్యాన్స్ వార్నింగ్.. చరణ్ సినిమా పోతే పూరీ పార్టీ ఇచ్చాడంటూ!

కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా మారుమ్రోగుతోన్న సినిమా పేర్లలో 'లైగర్' ఒకటి. అంతలా ఈ మూవీ నేషనల్ రేంజ్‌లో ప్రభావాన్ని చూపింది. దీనికి కారణం ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించడంతో పాటు ఇందులో క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ హీరోగా నటించడమే. దీనికితోడు ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో రూపొందడంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుంది. ఇలా ఎంతో బజ్‌తో ఈరోజే 'లైగర్' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ, చిరంజీవి ఫ్యాన్స్ పూరీ జగన్నాథ్‌ను ట్రోల్ చేస్తున్నారు. అసలేం జరిగిందో మీరే చూడండి!

లైగర్‌గా వచ్చేసిన విజయ్ దేవరకొండ

లైగర్‌గా వచ్చేసిన విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రమే 'లైగర్'. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించిన ఈ మూవీని ఛార్మీ, పూరీతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుండగా.. రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఏకంగా ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు వర్క్ చేశారు.

గ్రాండ్‌గా రిలీజ్... థియేటర్లలో రచ్చ

గ్రాండ్‌గా రిలీజ్... థియేటర్లలో రచ్చ

విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న 'లైగర్' మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3000లకు పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. దీంతో అన్ని థియేటర్లూ ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీ, తెలంగాణలోని సినిమా హాళ్లన్నీ విజయ్ దేవరకొండ అభిమానులతో రచ్చతో మోత మోగిపోతున్నాయి.

అంతటా విడుదల... అలాంటి టాక్

అంతటా విడుదల... అలాంటి టాక్

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'లైగర్' మూవీకి సంబంధించి ఇప్పటికే ఓవర్సీస్ సహా తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో షోలు ప్రదర్శితం అయిపోయాయి. అన్ని చోట్లా దీనికి మంచి స్పందన దక్కింది. దీంతో షోలన్నీ హౌస్‌ఫుల్ అయిపోయాయి. అయితే, టాక్ మాత్రం అనుకున్న విధంగా రాలేదు. ఎక్కువ శాతం మంది ఈ ప్రతిష్టాత్మక సినిమాపై పెదవి విరుస్తున్నారు.

పూరీ జగన్నాథ్‌ను టార్గెట్ చేసేశారు

పూరీ జగన్నాథ్‌ను టార్గెట్ చేసేశారు

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'లైగర్' మూవీపై ఆరంభంలోనే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు అనుగుణంగా ఈ చిత్రానికి అన్ని ప్రాంతాల్లోనూ మంచి బజ్ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో విడుదలైన 'లైగర్' మూవీకి టాక్ మాత్రం ఊహించని విధంగా వస్తోంది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు.

విజయ్ దేవరకొండకు వార్నింగ్‌లు

విజయ్ దేవరకొండకు వార్నింగ్‌లు

'లైగర్' మూవీకి వచ్చిన టాక్‌తో విజయ్ దేవరకొండ అభిమానులు నిరాశగా ఉన్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా వాళ్లంతా తమ అభిప్రాయాలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఫ్యాన్స్ 'పూరీ జగన్నాథ్‌లో జన గణ మన మూవీని క్యాన్సిల్ చేసేయ్' అంటూ హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, పూరీ జగన్నాథ్‌ను కొత్త కథలతో సినిమాలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

చిరంజీవికి కూడా ఫ్యాన్స్ హెచ్చరిక

చిరంజీవికి కూడా ఫ్యాన్స్ హెచ్చరిక


పాన్ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో వచ్చిన 'లైగర్' మూవీ టాక్‌పై మెగా అభిమానులు కూడా స్పందిస్తున్నారు. ఈ మేరకు కొందరు ఫ్యాన్స్ ట్విట్టర్‌లో 'చిరంజీవి బాస్.. నువ్వు కానీ ఆ పూరీ జగన్నాథ్‌కు ఛాన్స్ ఇస్తే మంచిగా ఉండదు' అంటూ ఏకంగా మెగాస్టార్‌కే వార్నింగ్ ఇస్తున్నారు. అంతేకాదు, పూరీ క్యారెక్టర్‌ను తప్పుబడుతూ తీవ్రమైన పదజాలంతో కామెంట్లు చేస్తున్నారు.

బ్రూస్‌లీ పోతే పూరీ పార్టీ ఇచ్చాడని

బ్రూస్‌లీ పోతే పూరీ పార్టీ ఇచ్చాడని

'లైగర్' మూవీకి సంబంధించిన టాక్‌ను పక్కనపెడితే.. కొందరు మెగా అభిమానులు ఓ ఆసక్తికరమైన విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. 'చిరంజీవి.. పూరీ జగన్నాథ్‌తో కమ్‌బ్యాక్ మూవీని చేద్దామనుకుని ఆపేశాడు. దీంతో బ్రూస్‌లీ సినిమా ఫ్లాప్ అయినప్పుడు పూరీ తన బ్యాచ్ మొత్తానికి పార్టీ ఇచ్చాడు' అని ఆరోపిస్తూ కొన్ని ట్వీట్లు చేశారు. దీంతో ఇది హైలైట్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X