‘రౌడీ’ స్టైల్‌కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. విజయ్ దేవరకొండ పిక్స్ వైరల్
విజయ్ దేవరకొండ స్టైల్, యాటిట్యూడ్‌కు సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. సినిమాల ద్వారా విజయ్ దేవరకొండకు ఎంతటి క్రేజ్ వచ్చిందో.. తన ప్రవర్తనతో అంతకు మించి ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నాడు. విజయ్ దేవరకొండ అతి తక్కువ సమయంలోనే తనకంటూ సొంతంగా బ్రాండ్‌ను ఏర్పర్చుకున్నాడు. విజయ్ ఇప్పుడు ప్యాన్ ఇండియన్ ప్లానింగ్స్‌లో ఉన్నాడు.

లైగర్‌తో రచ్చ..
పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో సినిమా అంటేనే అందరికీ అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి. అయితే సినిమాపై అంచనాలు ఎంత పెరుగుతూ ఉంటే.. అంతగా వాయిదాలు పడుతూ వచ్చింది. లాక్డౌన్ వల్ల పూర్తిగా వాయిదా పడ్డ ఈ మూవీ అప్డేట్లను ఈ మధ్యే ప్రకటించారు. లైగర్ అంటూ వదిలిన పోస్టర్ సినిమాపై అంచనాలు రెట్టింపుచేశాయి.
రాయ్ లక్ష్మీ సెక్సీ ఫోటోలు.. శృంగారం ఒలకబోస్తున్న హాట్ హీరోయిన్

షూటింగ్ మొదలు..
విజయ్ దేవరకొండ లైగర్ షూటింగ్ గత వారమే మొదలైంది. ఇన్ని రోజులు ఎదురుచూసి పూరి జగన్నాథ్ రంగంలోకి దిగాడు. ఇక లైగర్‌ను పరుగులు పెట్టించేందుకు అంతా సిద్దం చేశాడు. అయితే ఆల్రెడీ షూటింగ్ మొదలైన కూడా విజయ్ దేవరకొండ ఇంకా సెట్‌లో అడుగుపెట్టలేదు.

అప్డేట్లతో రచ్చ..
విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ సినిమా అని ఫైటర్ అంటూ ఇలా రకరకాలుగా పిలిచేవారు. అభిమానుల కోరిక మేరకు చివరకు సినిమా టైటిల్ రిలీజ్ చేస్తూ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. లైగర్ అంటూ విడుదల చేసిన పోస్టర్, సెప్టెంబర్ 9న సినిమా విడుదల చేస్తామని ప్రకటిస్తూ వదిలిన పోస్టర్‌ల అప్డేట్లతో సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అయింది.

అనన్య పాండే అలా..
లైగర్ సెట్‌లో ఆల్రెడీ అనన్య పాండే అడుగుపెట్టేసింది. పూరి జగన్నాథ్.. అనన్యకు ఏదో సీన్ వివరిస్తున్నట్టు ఉన్న స్టిల్ బయటకు వచ్చింది. అంతే కాకుండా ఛార్మీ పెట్‌తో అనన్య ఆడుకున్న వీడియో కూడా తెగ వైరల్ అయింది. తాజాగా విజయ్ దేవరకొండ ముంబైలో ల్యాండ్ అయ్యాడు.

అదిరిపోయే లుక్..
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ షూటింగ్ కోసం ముంబైలో అడుగుపెట్టాడు. సపరేట్ ఫ్లైట్‌లో విజయ్ దేవరకొండ అదిరిపోయే లుక్‌తో ముంబైలో అడుగుపెట్టేశాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ స్టైల్, లుక్, ఆ యాటిట్యూడ్ అన్నీ కూడా తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలన్నీ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.


Click it and Unblock the Notifications











