Liger Glimpse: పవన్ రికార్డును బ్రేక్ చేసిన విజయ్.. ఇండియాలోనే నెంబర్ వన్ స్థానానికి ‘లైగర్’

విజయ్ దేవరకొండ.. తెలుగు రాష్ట్రాల్లో అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా అతడు దాదాపు ఐదారేళ్లుగా వరుస సినిమాలతో సత్తా చాటుతూ దూసుకుపోతున్నాడు. కెరీర్ ఆరంభంలోనే 'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' వంటి సూపర్ హిట్ మూవీలతో ఒక్కసారిగా స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే తన స్టామినాను పాన్ ఇండియా రేంజ్‌లో చూపించాలన్న లక్ష్యంతో ఇప్పుడు 'లైగర్' అనే సినిమాను చేస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ నుంచి గ్లిమ్స్ వీడియో విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఇది ఇండియాలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఆ వివరాలు మీకోసం!

Recommended Video

Liger - Boxing Legend Mike Tyson In Vijay Deverakonda's Liger
‘లైగర్'గా మారిపోయిన విజయ్

‘లైగర్'గా మారిపోయిన విజయ్

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి 'లైగర్' అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమాను ఛార్మీ, పూరీతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తైపోయిన విషయం తెలిసిందే.

పాన్ ఇండియా కాదు.. మించేలా

పాన్ ఇండియా కాదు.. మించేలా

కిక్ బాక్సింగ్ నేపథ్యంతో రూపొందుతోన్న 'లైగర్'లో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎంతో మంది ప్రముఖులు పని చేస్తున్నారు. అలాగే, హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు ఇందులో భాగం అయ్యారు. అలాగే, అమెరికన్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమా పాన్ ఇండియా రేంజే అయినా అంతకు మించి ఉంటుందట.

న్యూ ఇయర్ గిఫ్టుగా గ్లిమ్స్ రిలీజ్

న్యూ ఇయర్ గిఫ్టుగా గ్లిమ్స్ రిలీజ్

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న 'లైగర్' మూవీ నుంచి అప్‌డేట్లు ఆరంభం నుంచే పెద్దగా రావడం లేదు. దీంతో క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులు తీవ్ర నిరాశగా ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో నూతన సంవత్సర కానుకగా ఒకరోజు ముందే (శుక్రవారం) ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేశారు.

అదిరిపోయే రెస్పాన్స్... రిపోర్టు

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న 'లైగర్' మూవీ ఫస్ట్ గ్లిమ్స్ వీడియో సూపర్బ్‌గా ఉంది. ఇందులో హీరోల ఎలివేషన్స్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. అందుకే దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా దీనికి యూట్యూబ్‌లో 24 గంటల్లో 15.92 మిలియన్ వ్యూస్, 399.6K లైక్స్ వచ్చాయి.

పవన్ రికార్డును బ్రేక్ చేసిన రౌడీ

పవన్ రికార్డును బ్రేక్ చేసిన రౌడీ

'లైగర్' గ్లిమ్స్ వీడియో అన్ని భాషలకూ కలిసి ఒకటే విడుదలైంది. దీంతో దీనికి మరింత ఎక్కువ స్పందన వచ్చింది. అందుకే 24 గంటల్లోనే 15.92 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దీంతో 'భీమ్లా నాయక్' (8.49M) రెండో స్థానానికి పడిపోయింది. ఈ జాబితాలో 'విక్రమ్' మూడో స్థానంలో, RRR నాలుగో స్థానంలో, 'సైరా' ఐదో స్థానంలో ఉన్నాయి.

ఇండియాలోనే ఫస్ట్.. అందులో

ఇండియాలోనే ఫస్ట్.. అందులో

విజయ్ దేవరకొండ 'లైగర్' గ్లిమ్స్ వీడియోకు ఒక్కరోజులోనే 15.92 మిలియన్ వ్యూస్‌ను అందుకోవడం ద్వారా ఇండియాలోనే 24 గంటల్లో ఎక్కువ మంది వీక్షించిన గ్లిమ్స్ వీడియోగా ఇది రికార్డు సాధించింది. అయితే, లైకుల పరంగా మాత్రం ఐదో స్థానంలో ఉంది. ఈ జాబితాలో అజిత్ కుమార్ 'వాలిమై' గ్లిమ్స్ వీడియో 785.3K లైకులతో మొదటి స్థానంలో కొనసాగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X