LIGER TRAILER: ఊహించని విధంగా లైగర్ ట్రైలర్.. విజయ్‌కు ఉన్న సమస్యే హైలైట్‌

బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే తనదైన చిత్రాలతో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. 'పెళ్లి చూపులు' మూవీతో హీరోగా గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకున్న అతడు.. ఆ వెంటనే వచ్చిన 'అర్జున్ రెడ్డి'తో స్టార్‌గా మారిపోయాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు విజయ్ దేవరకొండ 'లైగర్' మూవీతో పాన్ ఇండియాపై దండయాత్ర చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. అతి త్వరలోనే ఎంతో గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇంకెందుకు ఆలస్యం? ఈ వీడియోపై మీరూ లుక్కేయండి మరి!

లైగర్‌గా మారిపోయిన విజయ్

లైగర్‌గా మారిపోయిన విజయ్

టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో సత్తా చాటుతోన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి 'లైగర్' అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమాను ఛార్మీ, పూరీతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా చేస్తోంది. ఇది ఆగస్టు 25న రిలీజ్ కానుంది.

హాలీవుడ్ రేంజ్‌లోనే వస్తుంది

హాలీవుడ్ రేంజ్‌లోనే వస్తుంది


బాక్సింగ్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోన్న 'లైగర్'లో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎంతో మంది ప్రముఖులు పని చేస్తున్నారు. అలాగే, హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు ఇందులో భాగం అయ్యారు. అలాగే, అమెరికన్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమా రేంజ్ విశ్వవ్యాప్తం అయిపోయిందనే చెప్పుకోవాలి.

ప్రమోషన్స్ షురూ.. బోల్డ్ పిక్

ప్రమోషన్స్ షురూ.. బోల్డ్ పిక్

'లైగర్' సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ ఈ మధ్యనే ముగిసింది. అలాగే, ఇటీవలే అనన్య పాండే, విజయ్ దేవరకొండ మధ్యన ముంబైలో అదిరిపోయే సాంగ్‌ను షూట్ చేసుకున్నారు. ఇక, ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఇటీవలే విజయ్ దేవరకొండ న్యూడ్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

ట్రైలర్ వదిలిన లైగర్ టీమ్

ట్రైలర్ వదిలిన లైగర్ టీమ్

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'లైగర్' మూవీ విడుదలకు సమయం ఆసన్నం అవుతుండడంతో చిత్ర యూనిట్‌ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇందులో భాగంగానే తాజాగా ఈ మూవీ యూనిట్ ట్రైలర్ వీడియోను విడుదల చేసింది. మొత్తంగా 2.02 నిమిషాల నిడివితో వచ్చిన ఈ వీడియో ఆద్యంతం ఆకట్టుకునేలా కట్ చేశారు.

నా కొడుకు క్రాస్ బ్రీడ్ అంటూ

నా కొడుకు క్రాస్ బ్రీడ్ అంటూ

తాజాగా విడుదలైన 'లైగర్' ట్రైలర్‌ ఆరంభంలో రమ్యకృష్ణ తన కొడుకైన హీరో పాత్రను పరిచయం చేశారు. 'ఒక లయన్‌కు, టైగర్‌కు పుట్టిండాడు. క్రాస్ బ్రీడ్ సార్ నా బిడ్డ' అంటూ ఆమె చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. అంతేకాదు, ఇందులో చూపించిన విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీక్వెన్స్ ఊహించని విధంగా కట్ చేశారు. దీంతో ఈ వీడియోకు భారీ స్పందన దక్కుతోంది.

విజయ్ సమస్యను హైలైట్‌గా

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'లైగర్' మూవీలో విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో చేసినట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. మరీ ముఖ్యంగా ఇందులో అతడు నత్తి ఉన్న యువకుడిలా నటించాడు. ఈ విషయాన్ని ట్రైలర్‌లోనే చూపించి చిత్ర యూనిట్ అందరికీ షాకిచ్చింది. నత్తితో అతడు పలికే డైలాగులు సూపర్‌గా ఉన్నాయి. దీంతో ఇది వైరల్ అవుతోంది.

మూవీపై అంచనాలు రెట్టింపు

మూవీపై అంచనాలు రెట్టింపు

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన 'లైగర్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఉన్నాయి. వీటిని రెట్టింపు చేసేలా తాజాగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా ఇందులో చూపించిన అన్ని సన్నివేశాలూ అదిరిపోయేలా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. అప్పుడే ఈ ట్రైలర్‌కు తెలుగులోనే కాకుండా మిగిలిన భాషల్లోనూ రెస్పాన్స్ వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X